రియల్‌మీ సీ25వై పేరుతో బడ్జెట్ శ్రేణిలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గతంలో తీసుకొచ్చిన సీ25 మోడల్‌కు కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. సీ25వై ధర.. ఫీచర్లు ఇలా ఉన్నాయి.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ ఆర్ ఎడిషన్ ఓఎస్‌తో పనిచేస్తుంది.
రియల్‌మీ సీ25వైలో 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఇస్తున్నారు.
ఈ ఫోన్‌లో వెనుక మూడు, ముందు ఒక కెమెరా ఉన్నాయి. వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు రెండు 2 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు.
ముందు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. ఈ కెమెరాలో ఏఐ బ్యూటీ ఫీచర్ ఇస్తున్నారు.
ఆక్టాకోర్ యూనిసాక్ టీ610 ప్రాసెసర్ ఉపయోగించారు. 4జీబీ ఎల్‌పీడీడీఆర్‌ఎక్స్ ర్యామ్ ఇస్తున్నారు.
రియల్‌మీ సీ25వైలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 48 రోజులు స్టాండ్‌బైలో ఉంటుందని రియల్‌మీ తెలిపింది.
ఇందులో సూపర్ పవర్ సేవింగ్ మోడ్ ఇస్తున్నారు. దీన్ని ఎనేబుల్ చేసుకుని యాప్‌లు ఉపయోగించుకోవడం వల్ల 5 శాతం బ్యాటరీ 59 గంటలపాటు స్టాండ్‌బై ఉంటుందని రియల్‌మీ వెల్లడించింది.
రెండు వేరియంట్లలో రియల్‌మీ సీ25వై అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999. 4 జీబీ ర్యామ్/128 జీబీ ధర రూ. 11,999.
సెప్టెంబరు 20 నుంచి ముందస్తు బుకింగ్స్ ప్రారంభంకానున్నాయి. సెప్టెంబరు 27 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ వెబ్‌సైట్లలతోపాటు రియల్‌మీ అవుట్‌లెట్లలో అమ్మకాలు మొదలవుతాయి. గ్లేసియర్ బ్లూ, మెటల్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.
ఇదీ చూడండి: వాట్సాప్ కొత్త ఫీచర్.. సులభంగా ఫొటోను స్టిక్కర్‌గా!