ETV Bharat / science-and-technology

Pubg New State: భారత్‌లోకి సరికొత్తగా పబ్‌జీ.. ఆ ఫోన్లలో మాత్రమే! - pubg new state india release date

చైనాతో వివాదం నేపథ్యంలో నిషేధానికి గురైన పబ్‌జీ గేమ్‌ తిరిగి 'పబ్‌జీ: న్యూ స్టేట్‌'(PUBG New State ) పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఆధునాతన ఆయుధాలు, వాహనాలతో పాటు.. ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకొచ్చినట్లు పబ్‌జీ సృష్టికర్త క్రాఫ్టన్‌ సంస్థ చెబుతోంది.

Pubg
పబ్‌జీ
author img

By

Published : Nov 12, 2021, 7:04 AM IST

Updated : Nov 12, 2021, 10:16 AM IST

భారతీయ ఆన్​లైన్​ గేమర్స్‌కు శుభవార్త. నిషేధానికి గురైన పబ్‌జీ గేమ్‌ తిరిగి 'పబ్‌జీ: న్యూ స్టేట్‌'(PUBG New State) పేరుతో అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా నవంబరు 11న(Pubg new state India release date) విడుదలైన ఈ గేమ్‌ను 17 భాషల్లో డిజైన్‌ చేశారట. గూగుల్‌ ప్లేస్టోర్‌లో దీని సైజ్‌ దాదాపు 1.4జీబీ ఉండగా.. ఆండ్రాయిడ్‌ 6 ఆపై వర్షన్లలో మాత్రమే ఈ గేమ్‌ ఆడటానికి వీలున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆధునాతన ఆయుధాలు, వాహనాలతో పాటు.. ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకొచ్చినట్లు పబ్‌జీ సృష్టికర్త క్రాఫ్టన్‌ సంస్థ చెబుతోంది.

భారత్‌లో పబ్‌జీ గేమ్‌కు వచ్చిన పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్ల మంది భారతీయులు ఈ గేమ్‌ను ఆడటానికి ఇష్టపడ్డారు. అయితే, చైనాతో వివాదం నేపథ్యంలో గతేడాది పబ్‌జీని భారత్‌లో నిషేధించారు. దీంతో కొన్నాళ్లపాటు భారత్‌లోని యువత ఆ ఆటకు దూరమైంది. అయితే, భారతీయ యూజర్లను వదులుకోవడం ఇష్టం లేని.. క్రాఫ్టన్‌ సంస్థ 'బ్యాటిల్‌గ్రౌండ్‌ మొబైల్‌ ఇండియా(బీజీఎంఐ)' (Battleground mobile India) పేరుతో ప్రత్యేకంగా దేశీయ గేమ్‌ను రూపొందించింది. ఇప్పుడు క్రాఫ్టన్‌.. పబ్‌జీలో మార్పులు చేస్తూ.. సరికొత్త 'పబ్‌జీ: న్యూ స్టేట్‌' గేమ్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది.

ఇదీ చూడండి: ఐఫోన్‌ సెట్టింగ్స్‌లో ఈ మార్పులు చేశారా? ఓసారి చూడండి!

Last Updated : Nov 12, 2021, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.