భారత్‌లో నిషేధం ఎదుర్కొని సరికొత్త పేరుతో మళ్లీ మార్కెట్లోకి ప్రవేశించిన పబ్జీ గేమ్.. యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. 'బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా' పేరుతో వచ్చిన ఈ గేమ్ బీటా వెర్షన్ మోడ్.. యాప్ స్టోర్‌లో దర్శనమిచ్చింది. జూన్ 18న బీటా వర్షన్ రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చినప్పటికీ.. ఒకరోజు ముందుగానే ఇది విడుదలైంది.
బీటా టెస్టర్లకు మాత్రమే ఈ గేమ్ ఇన్స్టాల్ చేసుకొని ఆడేందుకు వీలుంటుంది. కాబట్టి కొద్ది మందికి మాత్రమే ఇది అందుబాటులో ఉన్నట్లు లెక్క. అయితే, కొద్దిరోజుల్లో మరిన్ని బీటా టెస్టింగ్ స్లాట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.
-
Here's some quick, first gameplay of #battlegroundsmobileindia #bgmi.
— Ershad Kaleebullah (@r3dash) June 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
1. Blood is in green, rest of the gameplay elements are near identical.
2. No mobile number OTP required.
3. It let's you get your data from the previous save.
4. Heavy-handed warnings about safe gaming. pic.twitter.com/TJD6AEXGIx
">Here's some quick, first gameplay of #battlegroundsmobileindia #bgmi.
— Ershad Kaleebullah (@r3dash) June 17, 2021
1. Blood is in green, rest of the gameplay elements are near identical.
2. No mobile number OTP required.
3. It let's you get your data from the previous save.
4. Heavy-handed warnings about safe gaming. pic.twitter.com/TJD6AEXGIxHere's some quick, first gameplay of #battlegroundsmobileindia #bgmi.
— Ershad Kaleebullah (@r3dash) June 17, 2021
1. Blood is in green, rest of the gameplay elements are near identical.
2. No mobile number OTP required.
3. It let's you get your data from the previous save.
4. Heavy-handed warnings about safe gaming. pic.twitter.com/TJD6AEXGIx
కొత్త గేమ్ సైజ్ 721 ఎంబీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ బీటా టెస్టర్ ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని.. స్క్రీన్షాట్లను ట్విట్టర్లో షేర్ చేశారు. గేమ్ దాదాపుగా పబ్జీని పోలినట్టే ఉంది. రక్తం ఎరుపు రంగుకు బదులు పచ్చగా ఉండటం, ఇతర గ్రాఫిక్స్ మునుపటిలాగే ఉన్నాయి. కొత్త గేమ్‌లో యూజర్లు లాగిన్ అయ్యేందుకు ఓటీపీ అవసరం లేదు.
ఇదీ చదవండి: