ETV Bharat / science-and-technology

కొత్త గేమ్​తో భారత్​లో పబ్​జీ రీఎంట్రీ

భారత మార్కెట్​లోకి పబ్​జీ రీఎంట్రీ ఇవ్వనుంది. కొత్త గేమ్​ను త్వరలోనే ఆవిష్కరించనున్నట్టు ప్రకటించింది పబ్​జీ కార్పొరేషన్​. ఈ నేపథ్యంలో దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది పబ్​జీ మాతృ సంస్థ క్రాఫ్టాన్​ ఐఎన్​సీ.

PUBG Corporation to launch new game for India mkt, commits USD 100 mn investment
భారత్​లో పబ్​జీ రీఎంట్రీ ఫిక్స్​
author img

By

Published : Nov 12, 2020, 4:56 PM IST

Updated : Feb 16, 2021, 7:52 PM IST

నిషేధానికి గురైన పబ్​-జీ.. ఇండియన్​ మార్కెట్లోకి రీఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని పబ్​జీ కార్పొరేషన్​ ప్రకటించింది. కొత్త గేమ్​ను త్వరలోనే ఆవిష్కరించనున్నట్టు వెల్లడించింది.

రీఎంట్రీ కోసం దేశంలో 100మిలియన్​ డాలర్ల(రూ. 750 కోట్ల) పెట్టుబడి పెట్టేందుకు పబ్​జీ మాతృసంస్థ క్రాఫ్టాన్​ ఐఎన్​సీ ప్రణాళికలు రచిస్తోంది. స్థానిక వీడియో గేమ్స్​, ఈ-స్పోర్ట్స్​, ఐటీ పరిశ్రమల్లో ఈ పెట్టబుడులు ఉండనున్నాయి.

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన అనేక యాప్స్​ను నిషేధించింది భారత్​. ఈ క్రమంలోనే సెప్టెంబర్​ నెలలో పబ్​జీపైనా నిషేధాజ్ఞలు విధించింది. మాతృసంస్థ క్రాఫ్టాన్​.. దక్షిణ కొరియా సంస్థే అయినప్పటికీ.. చైనా సంస్థ టెన్​సెంట్​ ఫ్రాంఛైజీగా ఉండటమే ఇందుకు కారణం.​

ఇదీ చూడండి:- ఈ ఐదు చిట్కాలతో పబ్​జీ వ్యసనం నుంచి విముక్తి!

Last Updated : Feb 16, 2021, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.