రెనో సిరీస్‌లో.. రెనో6 జెడ్ అనే కొత్త మొబైల్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనుంది ఒప్పో. ఏప్రిల్‌లో విడుదలైన రెనో5 జెడ్ మోడల్‌కు ఇది కొనసాగింపు. తొలుత అంతర్జాతీయ మార్కెట్లోకి ఈ మోడల్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే విడుదలకు ముందే ఈ ఫోన్ ఫీచర్స్ లీకయ్యాయి.
లీకైన రెనో6 జెడ్ ఫీచర్స్..
- 60హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్ డిస్ప్లే
- మీడియాటెక్ డైమెన్సిటి 800యూ ప్రాసెసర్
- 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఈ మొబైల్ భారత్‌లో ఎప్పుడు విడుదలవనుంది? ధర ఎంత ఉండొచ్చు అనే వివరాలు తెలియాలంటే.. ఒప్పో నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.
ఇదీ చదవండి : ఒప్పో రెనో 5ఏ.. ప్రత్యేకతలివే!