Oneplus Open Launch : ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ మరో కొత్త మొబైల్‌ను లాంఛ్ చేసింది. గురువారం రాత్రి తన తొలి ఫోల్డబుల్ ఫోన్ 'వన్‌ప్లస్ ఓపెన్'ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ వల్చర్ బ్లాక్, ఎమెరాల్డ్ డస్ట్ రెండు రంగుల్లో రానుంది. ఈ ఫోన్ ఇండియాలో రూ.1,39,999 ధరకు లభించనుంది. అక్టోబర్ 27 నుంచి అందుబాటులో ఉంటుంది. శాంసంగ్, మోటారొలా వంటి కంపెనీలు ఇప్పటికే ఫోల్డబుల్ ఫోన్లను తీసుకురాగా.. వీటికి పోటీగా ఈ ఫోన్ తీసుకువచ్చింది.
-
Introducing the #OnePlusOpen – designed to deliver the ultimate foldable smartphone experience. Open for Everything.
— OnePlus India (@OnePlus_IN) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Pre-book now!https://t.co/uUjnmr7KN3 pic.twitter.com/Rwkpnjmryf
">Introducing the #OnePlusOpen – designed to deliver the ultimate foldable smartphone experience. Open for Everything.
— OnePlus India (@OnePlus_IN) October 19, 2023
Pre-book now!https://t.co/uUjnmr7KN3 pic.twitter.com/RwkpnjmryfIntroducing the #OnePlusOpen – designed to deliver the ultimate foldable smartphone experience. Open for Everything.
— OnePlus India (@OnePlus_IN) October 19, 2023
Pre-book now!https://t.co/uUjnmr7KN3 pic.twitter.com/Rwkpnjmryf
Oneplus Open Fold Specs : ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే ఇది స్నాప్ డ్రాగన్ 8 జన్ 2తో వస్తుంది. ఆండ్రాయిడ్ ఆక్సిజన్ 13.2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. 16 జీబీ ర్యామ్‌తో పాటు 512 ఇంటర్నల్ స్టోరేజీతో మార్కెట్లోకి రానుంది. కవర్ డిస్ప్లే 6.31 అంగుళాల ఓఎల్ఈడీ ఔటర్ ప్యానెల్‌తో వస్తుండగా.. అన్‌ఫోల్డెడ్ ఇన్నర్ డిస్ప్లే 7.82 అంగుళాల ఓఎల్ఈడీతో రానుంది.120 hz రిఫ్రెష్ రేట్‌తో 2K రిజల్యూషన్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 48 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 48 మెగా పిక్సెల్ సెకండరీ సెన్సార్, 64 మెగా పిక్సెల్ సెన్సార్ విత్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్‌తో వస్తుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4,805 కాగా.. 67 వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
-
The wait is over! We've heard the anticipation all over the internet about the price of #OnePlusOpen
— OnePlus India (@OnePlus_IN) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Get ready to pre-book yours!
Watch more: https://t.co/1PlD2H5Duc pic.twitter.com/GhoLXC3GTN
">The wait is over! We've heard the anticipation all over the internet about the price of #OnePlusOpen
— OnePlus India (@OnePlus_IN) October 19, 2023
Get ready to pre-book yours!
Watch more: https://t.co/1PlD2H5Duc pic.twitter.com/GhoLXC3GTNThe wait is over! We've heard the anticipation all over the internet about the price of #OnePlusOpen
— OnePlus India (@OnePlus_IN) October 19, 2023
Get ready to pre-book yours!
Watch more: https://t.co/1PlD2H5Duc pic.twitter.com/GhoLXC3GTN
Oneplus Open Foldable Release Date : వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ సైడ్ ప్యానెల్ మెటల్ ఫ్రేమ్‌తో అందుబాటులోకి రానుంది. దీనిని టైటానియం అల్లాయ్, కార్బన్ ఫైబర్, ఏరోస్పేస్ గ్రేడ్‌తో తయారు చేసినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఫోల్డబుల్ మొబైల్స్ కంటే ఈ ఫోన్ భిన్నంగా కనిపిస్తోంది. ఏళ్లుగా వన్‌ప్లస్ తన ఫోన్లకు ఇస్తున్న అలర్ట్ స్లైడర్‌ను ఇందులోనూ ఇస్తోంది. ఈ ఫోన్ బరువు 245 గ్రాములు ఉంటుంది.
Oppo Find N3 Flip Review : ఒప్పో ఫైండ్ N3 ఫ్లిప్.. రివ్యూ అదిరింది.. ఫీచర్లు మామూలుగా లేవు.!
Repair Mode Option Google : రిపేర్ సమయంలో ఫోన్ డేటా పోయిందా? గూగుల్ నయా ఆప్షన్‌తో అంతా సేఫ్!