ETV Bharat / science-and-technology

వన్​ప్లస్​ నుంచి మరో ఖరీదైన ఫోన్! - వన్​ప్లస్ నార్డ్ ఫీచర్స్

చైనా స్మార్ట్​ఫోన్​ సంస్థ వన్​ప్లస్ నుంచి త్వరలో మరో ఖరీదైన 5జీ ఫోన్​ విడుదల కానున్నట్టు తెలుస్తోంది. దీనికి నార్డ్2 లేదా.. సీఈ 5జీగా పేరుపెట్టనున్నట్టు సమాచారం.

one plus nord
వన్​ప్లస్
author img

By

Published : May 22, 2021, 3:39 PM IST

Updated : May 22, 2021, 5:23 PM IST

చైనాకు చెందిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్.. త్వరలో హై-ఎండ్ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. నార్డ్ 2 లేదా నార్డ్ సీఈ 5జీ పేరుతో జూన్ మధ్యలో ఇది లాంచ్ అయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మీడియాటెక్​ డైమెన్​సిటీ 1200 చిప్‌సెట్​తో పాటు.. డిస్​ప్లేకు సంబంధించి అదిరిపోయే ఫీచర్లతో ఈ మోడల్​ రానున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయాన్ని సంస్థ ధ్రువీకరించాల్సి ఉంది.

గత ఏడాది జులైలో మిడ్-రేంజ్ స్నాప్‌డ్రాగన్ 765జీ చిప్‌సెట్​ కలిగిన నార్డ్​ సిరీస్​ను వన్‌ప్లస్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే అప్‌గ్రేడ్ వెర్షన్ డైమెన్సిటీ 1200 చిప్‌సెట్​ను డిజైన్ చేసినట్లు సమాచారం.

వన్​ప్లస్ నార్డ్ ఫీచర్స్..

  • 6.44-అంగుళాల అమోలెడ్ డిస్​ప్లే
  • 48ఎంపీ క్వాడ్ కెమెరా
  • 4,115ఎంఏహెచ్ బ్యాటరీ
  • 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్​ సామర్థ్యం

ఇవీ చదవండి: వన్​ప్లస్​ 9 ఫోన్స్​​, స్మార్ట్​వాచ్​ ధరలు, ఫీచర్లు ఇవే..

అదిరే ఫీచర్లతో వన్​ప్లస్​ 9ఆర్​ 5జీ!

Last Updated : May 22, 2021, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.