హెచ్‌ఎండీ గ్లోబల్ ఆరు సరికొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిని మూడు సిరీస్‌లలో ఆరు మోడల్స్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటి పేర్లు నోకియా సీ10, నోకియా సీ20, నోకియా జీ10, నోకియా 20,నోకియా ఎక్స్10, నోకియా ఎక్స్ 20. వీటిలో రెండు వేరయంట్లు 5జీ టెక్నాలజీని సపోర్టు చేయనున్నాయి. ఈ మోడల్స్ అందరికీ అందుబాటులో ఉండేలా ధరలను నిర్ణయించింది కంపెనీ.
వీటితో పాటు నోకియా పవర్ ఇయర్‌బడ్స్ లైట్‌ను కూడా విడుదల చేసింది.
నోకీయా సీ10
నోకియా సీ10 ప్రారంభ ధర సుమారు రూ. 7వేలు ఉండొచ్చని అంచనా. 1జీబీ+16జీబీ, 1జీబీ+32జీబీ,2జీబీ+16జీబీ ఇలా మొత్తం మూడు వేరియింట్లు బడ్జెట్లో వివిధ ధరల్లో ఉండనున్నాయి. ఈ ఫోన్లు కేవలం కొన్ని మార్కెట్లలోనే జూన్ నుంచి అందుబాటులోకి రానున్నాయి.

ఫీచర్లు ఇవే..
- గ్రే, లైట్ పర్పుల్ కలర్లలో లభ్యం.
- ఆండ్రాయిడ్ 11
- 6.51 అంగుళాల హెచ్డీ డిస్ప్లే
- 2డీ పాండా గ్లాస్ ప్రొటెక్షన్
- 2జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్
- 5ఎంపీ బ్యాక్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
- ఎఫ్ఎం రేడియో
నోకియా సీ20
నోకియా సీ20 ప్రారంభ ధర సుమారు రూ. 7,900 ఉండొచ్చని అంచనా. 1జీబీ+16జీబీ, 2జీబీ+32జీబీ ఇలా రెండు వేరియింట్లు బడ్జెట్ ధరల్లో లభించనున్నాయి. ఈ ఫోన్లు కేవలం కొన్ని మార్కెట్లలోనే జూన్ నుంచి అందుబాటులోకి రానున్నాయి.

సీ20 ఫీచర్లు
- డార్క్ బ్లూ, సాండ్ కలర్లలో లభ్యం
- ఆండ్రాయిడ్ 11
- 6.51 అంగుళాల హెచ్డీ డిస్ప్లే
- 2డీ పాండా గ్లాస్ ప్రొటెక్షన్
- 2జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్
- 5ఎంపీ బ్యాక్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
- ఎఫ్ఎం రేడియో
- హెచ్డీఆర్ సపోర్టెడ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్
నోకియా జీ10
నోకియా జీ10 ప్రారంభ ధర సుమారు రూ. 12,300 ఉంటుందని అంచనా. 3జీబీ+32జీబీ, 4జీబీ+64జీబీ ఇలా రెండు వేరియింట్లు సరసమైన ధరల్లో ఉండనున్నాయి. ఈ ఫోన్లు కేవలం కొన్ని మార్కెట్లలోనే ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానున్నాయి.

ఫీచర్లు..
- ఆండ్రాయిడ్ 11
- 6.5 అంగుళాల హెచ్డీ గ్లాస్
- 4జీబీ ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్
- 13ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ సెల్ఫీ కెమెరా
- డస్క్, నైట్ షేడ్స్‌లో లభ్యం
- ఫింగర్ ప్రింట్ సెన్సార్
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
నోకియా జీ20
నోకియా జీ20 ప్రారంభ ధర సుమారు రూ. 14,000 ఉంటుందని అంచనా. 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ ఇలా రెండు వేరియింట్లు లభించనున్నాయి. ఈ ఫోన్లు కేవలం కొన్ని మార్కెట్లలోనే మే నెల నుంచి అందుబాటులోకి రానున్నాయి.

ఫీచర్లు..
- ఆండ్రాయిడ్ 11
- 6.5 అంగుళాల డిస్ప్లే
- 48ఎంపీ+5ఎంపీ+2ఎంపీ+8ఎంపీ కెమెరా
- 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ
- గ్లాసియర్, నైట్ కలర్స్‌లలో లభ్యం
నోకియా ఎక్స్10
నోకియా ఎక్స్10 ప్రారంభ ధర సుమారు రూ. 27,400గా ఉండనుంది. 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ,4జీబీ+128జీబీ ఇలా మొత్తం మూడు వేరియింట్లలో ఉండనుంది. జూన్ నుంచి ఈ ఫోన్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

ఫీచర్లు..
- ఆండ్రాయిడ్ 11
- 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే
- ఆక్టోకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 పై పని చేస్తుంది
- 48ఎంపీ+5ఎంపీ+2ఎంపీ+2ఎంపీ కెమెరాలు
- 8ఎంపీ సెల్ఫీ కెమెరా
- 5జీ సపోర్ట్ ఫోన్
- వాటర్ రెసిస్టెంట్
- 4,470 ఎంఏహెచ్ బ్యాటరీ
- 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్
- ఫారెస్ట్, స్నో కలర్స్‌లో లభ్యం
- లైట్ వెయిట్ ఫోన్, 210 గ్రాములు
నోకియా ఎక్స్20
నోకియా ఎక్స్20 ప్రారంభ ధర సుమారు రూ. 31,000గా ఉండనుంది. 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ ఇలా మొత్తం రెండు వేరియింట్లలో ఉండనుంది. మే నెల నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

ఫీచర్లు..
- డ్యూయల్ సిమ్
- ఆండ్రాయిడ్ 11
- 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే
- ఆక్టోకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 పై పని చేస్తుంది
- 64ఎంపీ+5ఎంపీ+2ఎంపీ+2ఎంపీ కెమెరాలు
- 32ఎంపీ సెల్ఫీ కెమెరా
- 5జీ టెక్నాలజీ
- ఫింగర్‌ప్రింట్
- 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్
- నూర్డిక్ బ్లూ, సన్ రంగుల్లో లభ్యం కానున్నాయి.
నోకియా ఇయర్ బడ్స్
హెచ్‌ఎండీ గ్లోబల్ ఈ స్మార్ట్ఫోన్లతో పాటు ఇయర్ బడ్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని మార్కెట్లలో గురువారం నుంచి వీటి అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. వీటి ధర సుమారు రూ. 3,500 వరకు ఉంటుంది అని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 36 గంటల పాటు నిరంతరాయంగా పని చేయగల సామర్థ్యం వీటి సొంతం. ఇవి చార్కోల్, పోలార్ సీ రంగుల్లో లభ్యం కానున్నాయి.
ఇదీ చూడండి: మార్కెట్లోకి నోకియా కొత్త ఫోన్లు.. ఫీచర్లు ఇవే!