ETV Bharat / science-and-technology

ఇంగ్లిష్​ రావడం లేదా? సందేహాల నివృత్తా? అయితే ఈ యాప్స్​ మీ కోసమే - ఆన్లైన్​ వెబ్​సైట్స్​

టెక్నాలజీ వాడకం పెరుగుతున్న కొద్ది రోజుకో వెబ్​సైట్​ అవతరిస్తూనే ఉంది. మనిషి అవసరాలకు అనుగుణంగా ఆయా వెబ్​సైట్లు తమను తాము అప్డేట్​ చేసుకుంటూనే ఉంటాయి. ఈ క్రమంలో అంతర్జాలంలో ఉన్న కొన్ని వెబ్​సైట్ల గురించి చూసేద్దామా..

new websites for online users
new websites for online users
author img

By

Published : Nov 2, 2022, 8:43 AM IST

ఇంటర్నెట్‌ ఇప్పుడు ఇంటింటి అవసరంగా మారింది. సమాచారం తెలుసుకోవటానికో, వస్తువులు కొనటానికో, నగదు లావాదేవాలకో, సేవలు పొందటానికో.. ఇలా అనుక్షణం ఏదో ఒక పని పడుతూనే ఉంటుంది. అంతర్జాలంలో నిక్షిప్తమైన వెబ్‌సైట్ల భాండాగారంలో ఇవన్నీ గోరంతే. లోతుకు వెళ్లినకొద్దీ వజ్ర వైఢూర్యాల్లాంటివి చాలానే దొరుకుతాయి. మచ్చుకు కొన్ని వెబ్‌సైట్లను ప్రయత్నించి చూడండి.

.

బెరుకులేని రాత
ఇంగ్లిష్‌లో రాయాలని ఉబలాటం. తప్పులు దొర్లుతాయేమోనని భయం. వీటి నుంచి తప్పించుకోవటానికి తోడ్పడే వెబ్‌సైట్‌ https:// hemingwayapp. com/.. ఇంగ్లిష్‌లో ధైర్యంగా, స్పష్టంగా రాయటానికి తోడ్పడే సాధనమిది. గ్రామర్లీ మాదిరిగానే ఉంటుంది గానీ పూర్తిగా ఉచితం. శైలి మీద దృష్టి సారిస్తుంది. పొడవైన, సంక్లిష్టమై వాక్యాలను.. సాధారణ తప్పులను ఎత్తి చూపుతుంది.

వాక్యం పసుపు రంగులో కనిపిస్తే విడదీయాలని.. అదే ఎరుపు రంగులో కనిపిస్తే భాష చాలా గాఢంగా, సంక్లిష్టంగా ఉందని అర్థం. ఊదారంగులో ఏదైనా పదం కనిపిస్తే పొట్టి పదం వాడాలనటానికి సంకేతం. క్రియా విశేషణాలు, అసందర్భ పదబంధాలను నీలిరంగులో ఎత్తి చూపుతుంది. మొత్తమ్మీద రాత నైపుణ్యాలను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది.

.

వెబ్‌లో అగ్ర విషయం
అంతర్జాలంలో ప్రతి క్షణం కొత్త కొత్త అంశాలు ట్రెండ్‌ అవుతూనే ఉంటాయి. ఒకో రంగంలో ఒకోటి ముందుకు దూసుకొస్తుంటుంది. వీటి గురించి తెలుసుకుంటే అగ్రస్థానంలో నిలవొచ్చు. ఇతంటి విశాల వెబ్‌ ప్రపంచంలో అన్నింటికన్నా అగ్రస్థానంలో కొనసాగుతున్న అంశాలను తెలుసుకోవటమంటే మాటలా? https://contentideas.io/ వెబ్‌సైట్‌లోకి వెళ్తే ఇదేమంత కష్టమైన పని కాదు.

వార్తలు, కళలు, వినోదం, టెక్నాలజీ, రాజకీయం, అందం, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, ప్రయాణం, ఆర్థికం, సైన్స్‌.. ఇలా ఆయా విభాగాల వారీగా ట్రెండ్‌ అవుతున్న అంశాలను ఇట్టే తెలుసుకోవచ్చు. బ్లాగ్‌ పోస్ట్‌లకు అవసరమైన ఐడియాలను పొందొచ్చు. ఆయా రంగాల్లో వస్తున్న అధునాతన మార్పులను దీంతో ఓ కంట కనిపెడుతుండొచ్చు.

.

చదువుల గని
జిజ్ఞాస ఉండాలే గానీ అంతర్జాలంలో సొంతంగానే బోలెడంత చదువుకోవచ్చు. అదీ ఉచితంగా. ఇందుకు ప్రత్యేకించిన వెబ్‌సైట్లు బోలెడున్నాయి. కాకపోతే ఎందులో ఏ విషయముందో అనేది తెలుసుకోవటమనేది తేలికైన విషయం కాదు. వీటన్నింటినీ ఒకచోటే తెలుసుకునే వీలుంటే? https://freelearninglist.org అలాంటి వెబ్‌సైటే.

యూట్యూబ్‌, పాడ్‌కాస్ట్‌లు, కోర్సులు, ఎఫెక్టివ్‌ థింకింగ్‌, సబ్‌రెడిట్స్‌, జనరల్‌, లాంగ్వేజెస్‌, ప్రోగ్రామింగ్‌, బుక్స్‌, హౌ టూ.. ఇలా విడివిడిగా అన్నింటినీ ఒకేచోట చూసుకోవచ్చు.

.

శాస్త్ర సందేహ నివృత్తి
మనసులో ఎన్నెన్నో సందేహాలు. వీటిని నివృత్తి చేసుకో వటానికి అంతర్జాలంతో వెతకటం సులభమే. అయితే అవి నిజమేనా? శాస్త్రబద్ధమైనవేనా? అని తరచూ అనుమానం వస్తుంటుంది. మరి ఆయా అంశాలకు సంబంధించి పరిశోధనలు ఏం చెబుతున్నాయని తెలుసుకోవటమెలా? https:// consensus.app/ వెబ్‌సైట్‌లో వెతికితే సరి.

ఇది కృత్రిమ మేధతో కూడిన సెర్చ్‌ ఇంజిన్‌. తెలుసుకోవాల్సిన విషయాన్ని ప్రశ్న రూపంలో టైప్‌ చేస్తే చాలు. శాస్త్ర పరిశోధనల నుంచి వాటిని వెతికి మన ముందుంచుతుంది.

.

పుస్తకాలతో ముచ్చట
మొదట్నుంచీ మనకు పుస్తకాలంటేనే గురి. అందుకే ఏ విషయం తెలుసు కోవాలన్నా ముందు వాటికే ప్రాధాన్యం ఇస్తాం. వాటినే ప్రామాణికంగా భావిస్తుంటాం. దేనిగురించైనా ఆయా పుస్తకాల్లో ఏం చెప్పారో తెలుసుకునేదెలా? దీనికి https://books. google.com/talktobooks/ చక్కటి పరిష్కారం చూపుతుంది.

గూగుల్‌లో శోధించి కాదు. ప్రయోగాత్మక కృత్రిమ మేధ సాయంతో! తెలుసుకోవాల్సిన అంశాన్ని ప్రశ్న రూపంలో టైప్‌ చేస్తే చాలు. ఆయా పుస్తకాలను వెతికి, వాటి నుంచి సమాధానాలను చూపిస్తుంది.

.

డాక్యుమెంట్లపై ఇ-సంతకం
మామూలు పత్రాల మీదే కాదు.. ఇప్పుడు పీడీఎఫ్‌ వంటి డాక్యుమెంట్లపైనా సంతకాల అవసరం ఏర్పడుతోంది. నకిలీ పత్రాల బెడద తప్పించుకోవటానికి ఇదొక మార్గంగా తోడ్పడుతోంది. మరి వీటిపై ఇ-సంతకాలు పెట్టటమెలా? అని ఆలోచిస్తున్నారా? ఇందుకు https://signfree.io/ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇది మొట్టమొదటి ఎలక్ట్రానిక్‌ సిగ్నేచర్‌ ప్రొవైడర్‌. దీంతో ఉచితంగా ఎన్ని డాక్యుమెంట్ల మీదైనా ఇ-సంతకాలు చేసేయొచ్చు. పీడీఎఫ్‌, డాక్స్‌, పీఎన్‌జీ, జేపీజీ, ఎక్సెల్‌, ఆర్‌టీఎఫ్‌, టిఫ్‌, జేపెగ్‌ వంటి ఎలాంటి పత్రాలనైనా అప్‌లోడ్‌ చేసి.. సంతకాన్ని డ్రా చేస్తే చాలు. సంతకంతో కూడిన పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

.

ప్రశాంత వాతావరణం
కంప్యూటరో, ల్యాప్‌టాపో, స్మార్ట్‌ఫోనో.. పరికరం ఏదైనా ఆన్‌లైన్‌లో గడపటం ఎక్కువైపోయింది. ఆఫీసు పని కావచ్చు, వ్యక్తిగత అవసరాలు కావొచ్చు.. పనులు ఏవైనా కొన్నిసార్లు చికాకు తెచ్చిపెట్టొచ్చు. గందరగోళంలోకి నెట్టేయొచ్చు. ఈ డిజిటల్‌ వాతావరణంలో ప్రశాంతత కలగటానికి ఏదైనా మార్గముంటే బాగుంటుందనీ అనిపిస్తుంటుంది.

దీనికి చక్కటి మార్గం https://lofi.co/home/ వెబ్‌సైట్‌. ఇది మన పనులకు ఎలాంటి అంతరాయం కలిగించకుండా ఆయా అవసరాలకు అనుగుణంగా సంగీతాన్ని వినిపిస్తుంది. రద్దీగా ఉండే హోటల్‌లోనైనా, బీచ్‌లోనైనా మనసుకు ఉల్లాసం కలిగించేలా చూసుకోవచ్చు. మూడ్‌కు అనుగుణంగా సంగీతాన్ని ఎంచుకోవచ్చు.

.

కిండిల్‌ రాయబారి
కంప్యూటర్‌ తెరను ఎక్కువసేపు చూస్తుంటే చూపు దెబ్బతినే ప్రమాదముంది. విషయగ్రహణ సామర్థ్యమూ తగ్గుతుంది. మరెలా? https://ktool.io/ ద్వారా ఈ ఇబ్బందులను తేలికగా అధిగమించొచ్చు. ఇది దేనినైనా కిండిల్‌లో చదువుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఇలా కంటి మీద ఒత్తిడి తగ్గిస్తుంది. మరింత ఏకాగ్రతతో చదివేలా చేస్తుంది. వికిపీడియా కథనాలు, ట్విటర్‌ థ్రెడ్స్‌, పీడీఎఫ్‌, డాక్స్‌, ప్రామాణిక ఇ-బుక్స్‌, న్యూస్‌లెటర్ల వంటి అన్నింటినీ ఇది సపోర్టు చేస్తుంది. దీన్ని ఉపయోగించుకోవటం తేలికే. ఒక్క క్లిక్‌తో కిండిల్‌కు కథనాలను పంపుకోవచ్చు. డెస్క్‌టాప్‌, మొబైల్‌.. దేనిలోనైనా వాడుకోవచ్చు.

ఇదీ చదవండి : ఆండ్రాయిడ్​, ఐఓఎస్​లో సేమ్ ఫీచర్స్.. అవేంటో తెలుసా?

మార్కెట్​లో చౌకగా దొరికే బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్​లు ఇవే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.