అంతరిక్షంలోని గ్రహశకలం నుంచి నమూనాలు సేకరించిన వ్యోమనౌక 'ఒసైరిస్ రెక్స్'.. భూమికి తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించింది. రెండేళ్లు ప్రయాణించిన తర్వాత ఇది భూమిని చేరుకోనుంది. బెన్నూ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో.. వ్యోమనౌక ఇంజిన్లను మండించినట్లు నాసా తెలిపింది.
నాసా ప్రయోగించిన ఈ వ్యోమనౌక 2018లో 'బెన్నూ' అనే ఆస్టరాయిడ్‌ను చేరుకుంది. రెండేళ్ల పాటు పరిభ్రమించిన తర్వాత బెన్నూపై దిగి నమూనాలను సేకరించింది. 60 గ్రాముల గ్రహశకల నమూనాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే సుమారు 200 నుంచి 400 గ్రాముల మేర నమూనాలను వ్యోమనౌక మోసుకొస్తోంది.
ఇవీ చదవండి: