Motorola Moto G14 Launch Today : మొబైల్స్ తయారీ రంగంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా.. మరో సరికొత్త ప్రొడక్ట్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మోటో జీ14 పేరుతో అదిరిపోయే ఫీచర్స్‌తో కొత్త మోడల్ ఫోన్‌ను మంగళవారం ఇండియాలో లాంఛ్ చేసింది. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొంటున్న దీనిని రూ.15,000 వేలలోపే అందించనున్నట్లుగా తెలిపింది. మోటోరోలా ఆఫ్‌లైన్, ఆన్లైన్ స్టోర్లతో పాటు ఫ్లిప్‌కార్ట్ పోర్టల్లోనూ మోటో జీ14ను కొనుగోలు చేయొచ్చు. మరోవైపు షావోమీ అనుబంధ సంస్థ రెడ్మీ కూడా మోటో జీ14కు పోటీగా రెడ్మీ 12 పేరుతో 5జీ సపోర్ట్ మోడల్ ఫోన్‌ను ఆగస్టు 1నే లాంఛ్ చేసింది.
ఫీచర్స్ ఇవే..
Motorola Moto G14 Features : మోటో జీ13కు అప్డేటెడ్ వెర్షన్‌గా వచ్చిన మోటో జీ14లో డ్యూయెల్ రియర్ కెమెరాతో పాటు 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, డాల్బీ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. 4జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యంతో పాటు మరికొన్ని ఔరా అనిపించే ఫీచర్స్ ఈ ఫోన్ సొంతం. బ్లాక్, బ్లూ కలర్స్‌లో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇక హోల్ పంచ్ కటౌట్‌తో కూడిన సెల్ఫీ కెమెరాను ఇందులో అమర్చారు. ఫోన్‌కు కుడి భాగంలో వాల్యూమ్ ఇంకా పవర్ బటన్లను గమనించవచ్చు. బ్యాక్ కెమెరాల నుంచి తీసే ఫొటోలు అద్భుతంగా రావడానికి ట్రాన్స్పరెంట్ రెక్టాంగ్యులర్ డెక్ మాదిరిగా ఉండే 50 మెగాపిక్సల్ కెమెరాలనూ ఇందులో ఏర్పాటు చేశారు. దీనితో పాటు మ్యాక్రో కెమెరా కూడా ఉంది. ఆండ్రాయిడ్ 13 సాఫ్ట్వేర్ ఆధారంగా ఇది పనిచేస్తుంది.
Motorola Moto G14 Features : యూనిసొక్ టీ616 ఎస్ఓసీ ప్రాసెసర్‌ను మోటో జీ14లో వాడారు. అలాగే మూడేళ్ల భద్రతాపరమైన అప్డేట్లను కూడా ఈ ఇది స్వీకరిస్తుంది. 20 వాట్స్ ఛార్జింగ్ కెపాసిటీ, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్లో చెప్పుకోదగ్గ అంశాలు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 94 గంటలపాటు నిర్విరామంగా పాటలను వినడమే కాకుండా 34 గంటల వరకు ఫోన్‌ను కూడా మాట్లాడుకోవచ్చు. అంటే ఒక్కసారి ఛార్జింగ్‌తో దాదాపుగా 5 రోజుల బ్యాక్అప్ను ఆస్వాదించవచ్చు. కాగా, ఇది వ్యక్తి యూసేజ్‌పై కూడా ఆధారపడి ఉంటుంది.
మోటో జీ14 స్పెక్స్ అండ్ ఫీచర్స్..
- కలర్స్- బ్లూ, బ్లాక్
- ఓఎస్- ఆండ్రాయిడ్ 13
- స్పీకర్లు- డాల్బీ స్టీరియో
- మూడేళ్ల భద్రతాపరమైన అప్డేట్లు
- ప్రాసెసర్- యూనిసొక్ టీ616 ఎస్ఓసీ
- బ్యాటరీ సామర్థ్యం- 5000 ఎంఏహెచ్
- డిస్ప్లే- 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే
- డ్యుయెల్ రియర్ కెమెరా- 50 మెగాపిక్సల్+మ్యాక్రో కెమెరా
- స్టోరేజీ- 4జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ మెమోరీ
- అదనపు ఫీచర్లు- 34 గంటల టాక్‌టైమ్, 94 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్
- ధర- రూ.15 వేల లోపే. వినియోగదారుడు ఎంచుకునే ఫీచర్ల ఆధారంగా ధర ఉంటుంది.
Motorola Moto G14 Price : ఇక ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయెల్ సిమ్ కార్డ్ స్లాట్ మోటో జీ14లోని ఎక్స్ట్రా ఫీచర్స్. ఇక మోడల్ స్పెక్స్ ఆధారంగా దీని ధరలో మార్పులు ఉండవచ్చు. ప్రస్తుతానికి భారత్‌లో దీని ధర రూ.15,000లోపే ఉంటుందని అంచనా. కాగా, మోటో జీ14 అమ్మకాలు మోటోరోలా నుంచి రానున్న అత్యంత ప్రీమియం ఫోన్లలో ఒకటిగా చెప్పుకుంటున్న మోటోరోలా ఆర్ఏజెడ్ఆర్ 40 అల్ట్రా ఫ్లిప్ ఫోన్ విడుదలయిన కొద్ది రోజులకే ప్రారంభం కానున్నాయి. మొత్తంగా ఆండ్రాయిడ్‌కు అతిపెద్ద అప్డేట్గా మోటో జీ14 మోడల్ లాంఛ్‌ను టెకీలు అభివర్ణిస్తున్నారు.
రెడ్మీ 12 ఫీచర్స్..
Redmi 12 Features And Price : రెడ్మీ సంస్థ కూడా మోటో జీ14కు ధీటుగా రెడ్మీ 12ను లాంఛ్ చేసింది. మోటో జీ14, రెడ్మీ 12 ఫ్రేమ్ డిజైన్ దాదాపు ఒకేలా ఉన్నాయి. 5జీ ఎస్ఓసీ చిప్సెట్, ట్రిపుల్ రియర్ కెమెరా, 5000 ఏమ్ఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ రెడ్మీ 12లోని ప్రత్యేకతలు. దీని ధర రూ.15,000-రూ.20,000లోపే ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.
-
The #Redmi12 is designed to amaze with its powerful specs and premium features.
— Xiaomi India (@XiaomiIndia) August 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
📌 Premium Crystal Glass Design
📌 50MP AI Triple Camera
📌 MediaTek Helio G88 Processor
📌 #Redmi's Biggest Display Yet - 17.2cm(6.79) FHD+ Dot Display
📌 Corning Gorilla Glass Protection
📌… pic.twitter.com/4RzIOnfoYe
">The #Redmi12 is designed to amaze with its powerful specs and premium features.
— Xiaomi India (@XiaomiIndia) August 1, 2023
📌 Premium Crystal Glass Design
📌 50MP AI Triple Camera
📌 MediaTek Helio G88 Processor
📌 #Redmi's Biggest Display Yet - 17.2cm(6.79) FHD+ Dot Display
📌 Corning Gorilla Glass Protection
📌… pic.twitter.com/4RzIOnfoYeThe #Redmi12 is designed to amaze with its powerful specs and premium features.
— Xiaomi India (@XiaomiIndia) August 1, 2023
📌 Premium Crystal Glass Design
📌 50MP AI Triple Camera
📌 MediaTek Helio G88 Processor
📌 #Redmi's Biggest Display Yet - 17.2cm(6.79) FHD+ Dot Display
📌 Corning Gorilla Glass Protection
📌… pic.twitter.com/4RzIOnfoYe
రెడ్మీ 12 స్పెక్స్ అండ్ ఫీచర్స్..
- 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్
- మోడల్- రెడ్మీ 12
- కార్నింగ్ గొరిల్లా గ్లాస్
- డిజైన్- క్రిస్టల్ గ్లాస్ డిజైన్
- బరువు- 200 గ్రాముల్లోపే
- ఛార్జింగ్ స్పీడ్- 18 వాట్స్
- MIUI డైలర్+MIUI 14
- సెల్ఫీ కెమెరా- 8 మెగాపిక్సల్
- ఐపీ53 రేటింగ్ స్ప్లాష్ ప్రొటెక్షన్
- 3.5 ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జ్యాక్
- బ్యాటరీ కెపాసిటీ- 5000 ఎంఏహెచ్
- ప్రాసెసర్- హిలియో జీ88 ఆక్టా-కోర్ ప్రాసెసర్
- రియర్ కెమెరా- 50 మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరా
- స్టోరేజీ- 8జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- ధర- రూ15,000-రూ.20,000(ఫీచర్ల ఆధారంగా)
- డిస్ప్లే- 6.79 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే(17.2 సె.మీ)
- ఆగస్టు 4నుంచి ఆన్లైన్ అండ్ ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కొనుగోలు చేయొచ్చు.