Motorola Flexible Phone : ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు క్రమక్రమంగా డిమాండ్ పెరుగుతోంది. వినియోగదారులు వీటిని కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో అన్ని బ్రాండెడ్ మొబైల్ కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను లాంఛ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా.. సరికొత్త కాన్సెప్ట్‌తో ముందుకొచ్చింది. ఫుల్ ఫ్లెక్సిబుల్ ఫోన్ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టింది. అందులో ఫోన్ చేతికి వాచ్‌లా చుట్టుకున్నట్లు చూపించింది.
Motorola Flexible Smart Phone Concept : గత వారం జరిగిన లెనోవా టెక్ వరల్డ్‌లో మోటోరోలా.. ఫుల్ ఫ్లెక్సిబుల్ ఫోన్ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టింది. 6.9 అంగుళాల ఎల్ఈడీ స్కీన్ ఉన్న ఫోన్‌ను అన్నింటిలా సాధారణంగా వాడొచ్చని చూపించింది. ముందు వైపే కాకుండా వెనుకకు కూడా మడవవచ్చని తెలిపింది. టేబుల్‌పై స్టాండ్‌లా మడిచి ఫోన్ వాడుకోవచ్చని పేర్కొంది. పెద్ద సైజు స్మార్ట్ వాచ్‌ల చేతికి పెట్టుకోవచ్చని కూడా చెప్పింది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించి మిగతా ఫీచర్లు, బ్యాటరీ కెపాసిటీ కోసం మోటోరోలా వెల్లడించలేదు.
-
Your smartphone is about to get smarter. Check out the new ways Motorola is integrating AI to make every day a little easier. Learn more: https://t.co/Vbzijkvnj4 | #LenovoTechWorld📷 pic.twitter.com/xN4K1SV3I5
— motorola (@Moto) October 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Your smartphone is about to get smarter. Check out the new ways Motorola is integrating AI to make every day a little easier. Learn more: https://t.co/Vbzijkvnj4 | #LenovoTechWorld📷 pic.twitter.com/xN4K1SV3I5
— motorola (@Moto) October 25, 2023Your smartphone is about to get smarter. Check out the new ways Motorola is integrating AI to make every day a little easier. Learn more: https://t.co/Vbzijkvnj4 | #LenovoTechWorld📷 pic.twitter.com/xN4K1SV3I5
— motorola (@Moto) October 25, 2023
మరోవైపు, చేతికి వాచ్‌లా పెట్టుకున్నప్పుడు ఫోన్ జారిపడిపోయే అవకాశం ఉన్నట్లు పలువురు నెటిజన్లు అంటున్నారు. కానీ అత్యాధునిక టెక్నాలజీ వచ్చే ఫుల్ ఫోల్డబుల్ ఫోన్ ప్రత్యేకంగా ఆకర్షిస్తుందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో మార్కెట్లో ఈ ఫోన్ లాంఛ్ అవుతుందో లేదో చూడాలని ఇంకొందరు అంటున్నారు.
మోటోరోలో ఫోన్లలో AI!
కొత్త స్మార్ట్ ఫోన్ కాన్సెప్ట్‌తో పాటు మోటోరోలా.. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్‌ను తమ కంపెనీ ఫోన్ల, ల్యాప్‌ట్యాప్‌లలో ప్రవేశపెట్టనునట్లు చెప్పింది. క్లౌడ్‌లో మనకు కావాల్సిన డేటా వెతకడం వంటి పనులు చేసేందుకు వీలుగా ఆ ఫీచర్ రూపొందించనున్నట్లు పేర్కొంది. మెరుగైన డాక్యుమెంట్ స్కానింగ్ కోసం ఇటీవలే కొత్త ఫీచర్‌ను ప్రారంభించినట్లు చెప్పింది.
మోటోరోలా.. ప్రపంచంలో తొలి మొబైల్ ఫోన్‌ను అందించిన సంస్థ. 90వ దశకంలో ఫోన్ మార్కెట్లో నోకియా తర్వాత స్థానం మోటోరోలాదే. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త ఆవిష్కరణలతో అగ్రస్థానంలో ఉన్న శాంసంగ్, షావోమి కంపెనీలతో పోటీ పడుతోంది.