ETV Bharat / science-and-technology

'మోటో వాచ్​ 100' ఫొటోలు లీక్​.. అదిరే ఫీచర్లు! - సైన్స్ టెక్నాలజీ వార్తలు

మొటో వాచ్ 100(moto watch 100) డిజైన్, ఫీచర్లు లీక్​ అయ్యాయి. నల్ల రంగులో వృత్తాకారంగా ఉన్న ఈ స్మార్ట్​వాచ్ ఆకర్షణీియంగా ఉంది. ఇన్​బిల్ట్​ జీపీఎస్​తో రాబోతున్నట్లు తెలుస్తోంది(moto watch 100 features). మరోవైపు రెడ్​మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో(redmi smart band pro) నవంబర్ 30న మార్కెట్లోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీటి అధునాతన ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

smart watch
మోటో వాచ్​ 100 ఫీచర్స్ లీక్​.. రెడ్​మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో రిలీజ్ ఎప్పుడంటే..
author img

By

Published : Nov 14, 2021, 6:54 PM IST

మోటొరోలా నుంచి మోటో వాచ్ 100 పేరుతో(moto watch 100) స్మార్ట్ వాచ్ రాబోతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫొటోలు కూడా లీక్ అయ్యాయి. వృత్తాకార డిస్​ప్లేతో నల్ల రంగులో, చారల బెల్టు ఉన్న ఈ వాచ్​ ఆకర్షణీయంగా ఉంది. ఇది మార్కెట్​లో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియదు గానీ.. ఫొటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. ఈ అధునాత స్మార్ట్ వాచ్​లో హార్ట్ రేట్​ , స్టెప్స్ ట్రాకింగ్​ వంటి ఫీచర్స్​తో పాటు జీపీఎస్ సపోర్ట్​ కూడా ఉండనుందని తెలుస్తోంది. సింపుల్​ డిజైన్​తో ఆకర్షిణీయంగా ఉన్న ఈ వాచ్​ ఫీచర్లు(moto watch 100 features) ఓసారి చూద్దాం.

  • వృత్తాకారంలో ఉన్న ఈ స్మార్ట్​వాచ్​కు రెండు బటన్లు ఉన్నాయి.
  • ఇది వాటర్​ఫ్రూఫ్​
  • 360x360 పిక్సెల్​ రిజల్యుషన్​తో 1.3 అంగుళాల ఎల్​సీడీ డిస్​ప్లే
  • 355mAh బ్యాటరీ
  • ఇన్​బిల్ట్​ జీపీఎస్​
  • హార్ట్ రేట్ సెన్సార్​, యాక్సలెరోమీటర్​, జైరొస్కోప్, SpO2 సెన్సార్​.
  • స్లీప్​ ట్రాకింగ్, సెన్సార్ కౌంటింగ్​

29 గ్రాములు బరువుంటుందని ప్రచారం జరుగుతున్న ఈ స్మార్ట్​వాచ్ బ్యాటరీ జీవితకాలం తెలియాల్సి ఉంది. నలుపుతోపాటు ఇతర రంగుల్లోనూ అందుబాటులోకి రానుంది. అయితే ఈ వాచ్ ఎప్పుడు లాంచ్ అవుతుంది? అనే విషయంపై మోటొరోలా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అసలు స్మార్ట్​వాచ్ వస్తుందా? లేదో కూడా స్పష్టత లేదు.

త్వరలో రెడ్​మీ స్మార్ట్​ బ్యాండ్ ప్రో..

రెడ్​మీ బ్రాండ్​తో స్మార్ట్​ఫోన్లు, స్మార్ట్​ వాచ్​లు సహా ఇతర ఎలక్ట్రానిక్​ గ్యాడ్జెట్​లతో మార్కెట్​లో అదరగొడుతున్న షావోమీ.. రెడ్​మీ స్మార్ట్ బ్యాండ్​ ప్రోను(redmi smart band pro) కూడా త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానుంది. చైనాలో గత నెలలో జరిగిన ఓ కార్యక్రమంలో రెడ్​మీ వాచ్​ 2, రెడ్​మీ వాచ్​ 2 లైట్​ను లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. వీటికి భారత్​లో బీఐఎస్​ సర్టిఫికేట్​ కూడా లభించినట్లు ప్రచారం జరుగుతోంది. నవంబర్​ 30 రెడ్​మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది(redmi smart band pro features).

రెడ్​మీ స్మార్ట్​బ్యాండ్ ప్రో ఫీచర్లు

  • 194×368 పిక్సెల్​ రిజల్యుషన్​తో 1.47 అంగుళాల అమోలెడ్ టచ్ డిస్​ప్లే
  • ఆల్వేస్ ఆన్ డిస్​ప్లే ఆప్షన్​
  • 2.5డీ టెంపర్డ్ గ్లాస్​
  • 200mAh బ్యాటరీ
  • 110కిపై ట్రైనింగ్ మోడ్స్​
  • రన్నింగ్,వాకింగ్​, సైక్లింగ్​ ట్రాకింగ్​
  • నిద్రించే సమయంలో బ్లడ్​ ఆక్సిజన్​ లెవెల్స్ మానిటరింగ్​
  • 24 గంటలు హార్ట్ రేట్​ మానిటరింగ్​
  • స్ట్రెస్ లెవల్ మానిటరింగ్​

రెడ్​మీ స్మార్ట్ బ్యాండ్​ ప్రోను మాగ్నెటిక్ ఛార్జర్​తో సులభంగా ఛార్జ్ చేయవచ్చు(redmi smart band pro release date). ఒక్కసారి బ్యాటరీ ఫుల్ అయితే 14 రోజుల వరకు పని చేస్తుంది. ఈ స్మార్ట్​ బ్యాండ్​ను ఐదు నిమిషాలు ఛార్జ్​ చేస్తే రెండు రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. దీని బరువు కేవలం 15 గ్రాములు.

అయితే ధరపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు.

ఇదీ చదవండి: వాట్సాప్ డిస్​అప్పియరింగ్​ ఫీచర్​కు మెరుగులు- ఇకపై మూడు ఆప్షన్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.