ETV Bharat / science-and-technology

ఫొటో ఎడిటింగ్, ఫైల్ కన్వర్షన్.. అన్నీ టెలిగ్రామ్​లోనే! ఈ 'బాట్స్​'ను ట్రై చేయండి!! - telegram features

Telegram Bots: బాట్స్ ద్వారా​ యూజర్లకు అదిరిపోయే సేవలు అందిస్తోంది టెలిగ్రామ్​. ఇందులో ఫొటో బ్యాక్​గ్రౌండ్ రిమూవర్​, డ్రాప్ మెయిల్​, ఫైల్ కన్వర్టర్​ వంటి బాట్స్​కు విపరీతమైన ఆదరణ ఉంది. మరి వాటి ప్రత్యేకతలేంటి? ఎలా ఉపయోగించాలి? ఇప్పుడు చూద్దాం.

Most Useful Telegram Bots
చెలిగ్రామ్​ బోట్స్​
author img

By

Published : Jun 24, 2022, 3:58 PM IST

Most Useful Telegram Bots: ప్రపంచంలో అత్యంత ఆదరణ గల యాప్స్​లో టెలిగ్రామ్ ఒకటి. ఈ దిగ్గజ మెసెంజర్​కు 100 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. ఇందులో ఉండే ప్రత్యేక ఫీచర్లు మరే ఇతర యాప్​లోనూ అందుబాటు ఉండవు. ముఖ్యంగా బాట్స్ ద్వారా యూజర్లకు ఆకర్షణీయమైన సేవలు అందిస్తోంది టెలిగ్రామ్​. వాటి గురించి తెలిస్తే మీరు కూడా వెంటనే ఈ యాప్​ను డౌన్లో​డ్ చేసుకోని ఓసారి ట్రై చేస్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

AI Background remover bot: ఈ బ్యాక్​గ్రౌండ్ రిమూవర్ బాట్ ద్వారా మన ఫొటోలోని బ్యాక్​గ్రౌండ్​ను క్షణాల్లో తొలగించవచ్చు. దీనికోసం ఇతర యాప్​లను ప్రత్యేకంగా ఉపయోగించనక్కర్లేదు. ఈ బాట్​ చాట్​లో మనం బ్యాక్​గ్రౌండ్​ను తొలిగించాలనుకుంటున్న ఫొటోను అప్లోడ్​ చేస్తే చాలు.. వెంటనే అది బ్యాక్​గ్రౌండ్​ను తొలగించి హై రిజొల్యుషన్ ఫొటోగా మార్చి మనకు అందిస్తుంది. ఆ తర్వాత మనం దాన్ని డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

Dropmail.me: ఈ బాట్​ ద్వారా అద్భుతమైన ఫీచర్​ను అందిస్తోంది టెలిగ్రామ్​. మనం సాధారణంగా సోషల్ మీడియా ఖాతాను ఓపెన్ చేయాలన్నా, యాప్స్​లోకి లాగిన్ కావాలన్నా ఈమెయిల్ ఐడీని అడుగుతాయి. ఒక్కోసారి మెయిల్​ ద్వారానే ఓటీపీ వెరిఫికేషన్​ కూడా జరుగుతుంటుంది. అలాంటి సమయంలో మన వ్యక్తిగత ఈమెయిల్​ ఐడీని తెలియజేయవద్దనుకున్నప్పుడు.. మనకోసం ఓ ఫేక్​ మెయిల్ ఐడీని క్రియేట్​​ చేస్తుంది టెలిగ్రామ్​లోని Dropmail.me బాట్​. ఓటీపీ వెరిఫికేషన్ కూడా దీని ద్వారా చేసుకోవచ్చు. టెలిగ్రామ్​లోనే ఈ మెయిల్​ ఐడీని సులభంగా యాక్సెస్​ చేసుకోవచ్చు.

File Converter: టెలిగ్రామ్​లోని ఫైల్ కన్వర్టర్ బాట్ ద్వారా ఇమేజ్, వీడియో ఫార్మాట్​లను అత్యంత సులభంగా మార్చుకోవచ్చు. ఈ బాట్​ చాట్​లోకి మనం కన్వర్ట్ చేయాలనుకున్న ఇమేజ్​, వీడియో ఫైల్​ను అప్లోడ్​ చేసి.. అది ఏ ఫార్మాట్​లో కావాలో ఆప్షన్లో ఎంపిక చేసుకుని ఓకే చేస్తే సరిపోతుంది. క్షణాల్లోనే మనకు కావాల్సిన ఫార్మాట్​లో ఫొటో, వీడియో వచ్చేస్తుంది. అనంతరం దాన్ని డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

Babelgram: దీని ద్వారా ఒక భాషను ఇతర భాషలోకి ట్రాన్స్​లేట్ చేయవచ్చు. మనం ఇన్​పుట్ టెక్స్ట్​ ఇచ్చి దాన్ని ఓ భాషలోకి మార్చాలనుకుంటున్నామో సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
File to bot: ఈ బాట్ ద్వారా మనం ఫైల్స్​ను క్లౌడ్​లో సేవ్ చేసుకోవచ్చు. ఇందులో డ్రాప్ చేసే ఇమేజెస్, వీడియోస్, ఫైల్స్ అన్ని ఉచితంగా సేవ్ అయి ఉంటాయి. స్టోరేజీ పరిమితి కూడా ఉండదు. మనకు కావాల్సినప్పుడు వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇవేగాక ఇంకా చాలా బాట్స్ ద్వారా వినియోగదారులకు అద్భుతమైన సేవలు అందిస్తోంది టెలిగ్రామ్.

ఇదీ చదవండి: ఈ ఐదు యాప్స్‌ చాలా డేంజర్​.. వెంటనే డిలీట్‌ చేసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.