స్మార్ట్ ఫోన్లలో ఒకప్పుడు ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం ఉన్నవి ఎంచుకునేవారు. 5,000 ఎంఏహెచ్, 6,000 ఎంఏహెచ్.. ఇలా ఉండేవి. ఎందుకంటే.. ఎక్కువ సమయం పాటు ఫోన్‌ని వాడుకోవచ్చని. కానీ, గత కొంత కాలంగా ఫోన్ తయారీ సంస్థలు వినూత్న టెక్నాలజీలతో ముందుకొస్తున్నాయి. అదే 'ఫాస్ట్ ఛార్జింగ్ 100 కంటే ఎక్కువ వాట్స్‌తో బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నాయి.
ఈ మధ్యే మార్కెట్లోకి వచ్చిన 'ఎంఐ 10 ఆల్ట్రా మోడల్ ఫోన్ 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ని సపోర్టు చేస్తుంది. దీంతో 30 నిమిషాల్లోనే ఫోన్ బ్యాటరీ సున్నా నుంచి 100కి వచ్చేస్తుంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అదే ఎంఐ కంపెనీ 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ని పరిచయం చేసేందుకు సిద్ధం అవుతోంది.
ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ టెక్నాలజీతో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని కేవలం 15 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. మరో విషయం ఏంటంటే.. ఎంఐ వైర్లెస్ ఛార్జింగ్‌ని కూడా మెరుగుపరుస్తోంది. 80వాట్ సపోర్టుతో వైర్‌లెస్‌గా ఛార్జ్ చేసేందుకు సిద్ధం అవుతోంది. దీంతో 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఒక్క నిమిషంలో 10 శాతం ఛార్జ్ చేయవచ్చట. పుల్ ఛార్జ్ పట్టే సమయంలో 19 నిమిషాలుగా షామీ చెబుతోంది. సరికొత్త బ్యాటరీ ఛార్జింగ్ టెక్నాలజీతో బ్యాటరీ మన్నికను కాపాడుతూ వేగంగా ఛార్జ్ చేయగలగడం కచ్చితంగా ఓ సవాల్ అని టెక్నాలజీ ప్రియులు విశ్లేషిస్తున్నారు.
- ఇదీ చూడండి: 'నౌక, విమానాశ్రయాల్లో ప్రభుత్వ వాటాను అమ్మబోం'