Techno Smartphones: టెక్న కంపెనీ తన తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 'టెక్నో పోవా 5జీ' పేరుతో ఈ ఫోన్‌ను పరిచయం చేసింది. మిడ్-రేంజ్ ధర, ఆధునిక ఫీచర్స్‌తో తీసుకొస్తున్న ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లున్నాయి.. ధరెంత, ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయనేది చూద్దాం.
టెక్నో పోవా 5జీ ఫీచర్లు
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత హెచ్‌ఐఓఎస్ ఓఎస్‌తో పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్జ్ టచ్ శాంప్లింగ్‌తో 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. టెక్నో పోవా 5జీలో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనుకవైపు మూడు 50 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ముందు భాగంలో డ్యూయల్ ఫ్లాష్‌తో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. ఫోన్ వెనుక భాగంలో పాపులర్ ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ సిటీ ఫ్యాన్ క్లబ్ లొగోను ఇస్తున్నారు. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 8జీబీ ర్యామ్/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999. ఫిబ్రవరి 14 నుంచి టెక్నో, అమెజాన్ వెబ్‌సైట్ల నుంచి కొనుగోలు చేయొచ్చు.
ఇదీ చదవండి: