ఈ యాప్ పేరు యాక్టివిటీ బబుల్స్. గూగుల్ సంస్థ ఈ యాప్‌ని ప్రవేశపెట్టింది. యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకుని తెరపై వచ్చిన వాల్‌పేపర్‌ని సెట్ చేసుకుంటే చాలు. మీ స్క్రీన్‌పైకి ఓ బుడగ వస్తుంది. ఫోన్‌ని అన్‌లాక్ చేసిన ప్రతీసారి ఇంకో బుడగ తెరపై పడుతుంది. అలా రోజులో మీరెన్ని సార్లు అన్‌లాక్ చేస్తే అన్ని బుడగలు వచ్చి పడతాయ్. మీరు చేయాల్సిందేంటంటే.. ఇలా బుడగలతో మీ స్క్రీన్ నిండిపోకుండా చూసుకోవడమే..! అది ఫోన్‌ని పక్కన పెడితేనే చేయగలం ఇలా మెల్లమెల్లగా ఫోన్ వాడకం తగ్గించొచ్చు.
ETV Bharat / science-and-technology
ఫోన్ వాడకం తగ్గించుకోలేకపోతున్నారా... అయితే ఈ యాప్ వాడండి...! - google apps
మీరు రోజులో ఎక్కువ సమయం ఏం చేస్తున్నారు? అని అడిగితే ఎక్కువగా చెప్పే సమాధానం నా స్మార్ట్‌ఫోన్‌తో గడుపుతున్నా అని. ఇప్పుడు లాక్‌డౌన్‌తో అది మీ బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. చేతిలో ఫోన్ లేనిదే క్షణం గడవని పరిస్థితి. ఇలాగే కొనసాగితే రోజులు గడుస్తున్న కొద్దీ దానికి బానిసైపోతారు. మరి కొద్దికొద్దిగా ఫోన్‌ని పక్కన పెట్టి డిజిటల్ వెల్‌బీయింగ్‌లో భాగస్వామ్యమవ్వాలంటే..! ఈ యాప్ ప్రయత్నించండి.