ETV Bharat / science-and-technology

మైక్రోసాఫ్ట్​ విండోస్​ 11​ వచ్చేసింది! - విండోస్​ 11

విండోస్​ ఆపరేటింగ్​ సిస్టమ్​ కొత్త వర్షన్​ను మైక్రోసాఫ్ట్​ విడుదల చేసింది. ఆండ్రాయిడ్​ యాప్​లు కూడా ఆపరేట్​ అయ్యేలా విండోస్​ 11ను ఆవిష్కరించారు. ఫీచర్స్​ పరంగా విండోస్​ 10తో పోలిస్తే విండోస్​ 11 వర్షన్​ కొత్తగా ఉంది.

windows 11 features, మైక్రోసాఫ్ట్​ విండోస్ 11
మైక్రోసాఫ్ట్​ విండోస్​ 11​ వచ్చేసింది!
author img

By

Published : Jun 25, 2021, 1:47 AM IST

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గురువారం ఓ కార్యక్రమంలో ఆపరేటింగ్ సిస్టం విండోస్ 11 వర్షన్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. విండోస్ 10తో పోల్చి చూస్తే విండోస్ 11 లుక్ కొత్తగా ఉంది. స్నాప్‌ లే అవుట్​, స్నాప్‌ గ్రూప్‌ సహా మల్టీ టాస్కింగ్‌కు ఇందులో వీలు కల్పించారు. ఆండ్రాయిడ్‌ యాప్‌లు కూడా ఆపరేట్‌ అయ్యేలా ఈ విండోస్‌11ని ఆవిష్కరించారు. అదే విధంగా.. టాస్క్‌బార్‌లో ఐకాన్స్‌ స్థానాన్ని మైక్రోసాఫ్ట్​.. చివరి నుంచి మధ్యలోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్స్‌ పరంగా విండోస్‌ 10తో పోల్చితే విండోస్‌ 11 వర్షన్‌ పూర్తిగా కొత్త లుక్‌లో ఉంది. విండోస్‌ 10 నుంచి విండోస్‌ 11కి ఉచితంగానే అప్‌గ్రేడ్‌ కావచ్చని సంస్థ తెలిపింది.

గత కొన్ని సంవత్సరాలుగా స్మార్ట్‌ ఫోన్లు, ఇతర స్మార్ట్ పరికరాలు ప్రజాదరణ పొందడం వల్ల విండోస్.. ఆపిల్, గూగుల్ నుంచి గట్టి పోటీని మైక్రోసాఫ్ట్ ఎదుర్కొంటోందని సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. విండోస్ చరిత్రలో ఒక మైలురాయిని సూచిస్తుందన్న ఆయన.. ఇది కొత్త తరం ఆరంభమని వ్యాఖ్యానించారు. విండోస్ 10 ఓఎస్‌ను 2015లో అందుబాటులోకి తెచ్చిన మైక్రోసాఫ్ట్.. 6 సంవత్సరాల తర్వాత విండోస్ 11గా పిలిచే కొత్త ఓఎస్‌ను తాజాగా లాంచ్ చేసింది.

ఇదీ చదవండి : సెప్టెంబర్​ 10న మార్కెట్లోకి 'గూగుల్​-జియో' స్మార్ట్​ఫోన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.