ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్.. తన వీడియో కాలింగ్ అప్లికేషన్ 'టీమ్స్' వ్యక్తిగత వెర్షన్‌ను విడుదల చేసింది. ఇకపై 24గంటల పాటు 300మంది ఒకేసారి వీడియో కాల్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చని ప్రకటించింది. కరోనా నేపథ్యంలో.. స్నేహితులు, కుటుబాల మధ్య రోజంతా ఉచిత వీడియో కాలింగ్‌ను అందించాలని నిర్ణయించింది. సంవత్సరం క్రితం ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందీ మైక్రోసాఫ్ట్.
వెబ్, మొబైల్, డెస్క్‌టాప్ వెర్షన్లో పనిచేయనున్న 'టీమ్స్ పర్సనల్' ఫీచర్.. వ్యాపారపరంగా అందించే సేవకు ఏమాత్రం తీసిపోదని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఫైల్స్‌ను సులభంగా ఓపెన్ చేయడం, వీడియో కాల్ సమయంలో చాట్ ఆప్షన్ సహా.. వ్యక్తులను సులువుగా యాడ్ చేసేందుకు అనుమతిస్తుందని పేర్కొంది.
కరోనా తరువాత 60నిమిషాలే.!
అయితే.. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన అనంతరం కేవలం 100 మందికి.. 60 నిమిషాల పాటు గ్రూప్ కాల్ సదుపాయం కల్పించనున్నట్లు మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. ఇద్దరికి మాత్రం(1: 1) 24 గంటలు వీడియో కాల్ చేసుకునే వెసులుబాటు ఉండనుంది. అయితే.. మరో వీడియో కాలింగ్ యాప్ స్కైప్‌ను.. టీమ్స్‌తో కలిపే అంశాన్ని మైక్రోసాఫ్ట్ ప్రస్తుతానికి ధ్రువీకరించలేదు.
కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 145 మిలియన్ల క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది టీమ్స్. గతేడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో వినియోగదారులు 'టీమ్స్'కు చేరినట్లు కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు.
ఇవీ చదవండి: శబ్దాలు నియంత్రించే ఏఐ ఫీచర్‌తో 'గూగుల్ మీట్'