ETV Bharat / science-and-technology

ఇన్​స్టాలో ఫాలోవర్స్​ను పెంచుకోవాలా.. అయితే ఈ సరికొత్త ఫీచర్​ మీకోసమే! - టెలిగ్రామ్ ఛానల్

సోషల్​మీడియా యూజర్లకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్​ అందించడంలో ముందుండే సంస్థ మెటా. అదేనండీ.. ఫేస్​బుక్​, వాట్సప్​, ఇన్​స్టాగ్రామ్​ల మాతృ సంస్థ. ప్రస్తుతం ఈ కంపెనీ ఇన్​స్టాగ్రామ్​లో సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తీసుకురానుంది. టెలిగ్రామ్​లో మాదిరిగా ఇన్​స్టాలో కూడా 'ఛానల్' ఆప్షన్​ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఫీచర్​ అందుబాటులో వస్తే యూజర్స్​ తమ ఫాలోవర్స్​ను మరింత పెంచుకునే అవకాశం ఉంటుందని వెల్లడించింది. అయితే ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందామా మరి!

new feature on instagram
new feature on instagram
author img

By

Published : Feb 18, 2023, 3:14 PM IST

ఫేస్​బుక్​, వాట్సప్​, ఇన్​స్టాగ్రామ్​ల మాతృ సంస్థ మెటా.. తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందించడంలో ముందుంటుంది. దీనిలో భాగంగా ఇన్​స్టాగ్రామ్​లో మరో కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. టెలిగ్రామ్​ తరహాలో ఇన్​స్టాగ్రామ్​లో కూడా 'ఛానల్స్​'ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఫీచర్​తో ఛానల్ క్రియేటర్స్​ ఫొటోలు, వీడియోలు, కంటెంట్​ను సభ్యులతో షేర్​ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇది టెస్టింగ్​ దశలో ఉందని మెటా సంస్థ వెల్లడించింది.

ఎలా పనిచేస్తుందంటే..?
గత కొన్ని సంవత్సరాల నుంచి టెలిగ్రామ్​లో 'ఛానల్' సదుపాయం ఉంది. టెలిగ్రామ్​లో ఎలా పనిచేస్తుందో ఇన్​స్టాగ్రామ్​లో కూడా దాదాపు అలానే ఉంటుందని మెటా సంస్థ వెల్లడించింది. టెలిగ్రామ్​లో మనకు నచ్చిన ఛానల్​ పేరును సెర్చ్​ చేసి లేదా మనకు వచ్చిన లింక్​ను ఓపెన్​ చేసి అందులో చేరవచ్చు. అలా చేరిన తర్వాత అడ్మిన్​లు పంపిన ఫొటోలు, ఆడియోలు, వీడియోలు, సందేశాలు మనకూ అందుతాయి. దానికి మనం రిప్లై ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అచ్చం అలాగే.. ఇన్​స్టాగ్రామ్​లో కూడా ఛానల్​ అడ్మిన్​ నుంచి వచ్చిన లింక్​ ద్వారా మనం అందులో సభ్యులుగా చేరవచ్చు. దీంతో ఆ ఛానల్​లో వచ్చే అప్​డేట్స్​ తెలుస్తాయి. ఇందులో వచ్చిన సందేశాలను చదవడం, చూడటమే కాకుండా.. రిప్లై ఇచ్చే సదుపాయం కూడా ఉంది. ఇవే కాకుండా యూజర్​కు నచ్చిన ఛానల్​లో చేరి.. ఎప్పుడైనా ఎగ్జిట్​ అయ్యే అవకాశం ఉంటుందని మెటా సంస్థ తెలిపింది.

new feature on instagram
ఇన్​స్టాలో త్వరలోనే అందుబాటులోకి రానున్న 'ఛానల్​' ఫీచర్​

ఇన్​స్టాగ్రామ్​లో తమ ఫాలోవర్స్​ను పెంచుకోవడానికి ఈ సరికొత్త ఫీచర్​ ఎంతగానో ఉపయోగపడుతుందని మెటా తెలిపింది. దీంతో పాటుగా ఛానల్​లో చేరిన సభ్యులకు పూర్తి సమాచారాన్ని అందించడానికి వీలవుతుందని కంపెనీ తెలిపింది. దీని ద్వారా తాజా అప్​డేట్​లను కూడా షేర్​ చేసుకోవడానికి వీలవుతుందని మెటా సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ మెటా సీఈఓ జుకర్​బర్గ్ సహా కొందరు సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్లకు అందుబాటులో ఉంది. ఈ ఫీచర్​ను వేగంగా తమ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది మెటా. ఈ ఫీచర్​పై ఆసక్తి ఉన్న వారు కంపెనీ వెబ్​సైట్​లో ముందుగా సైన్​ అప్​ అవ్వాలని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.