ETV Bharat / science-and-technology

మాంసం 'సాగు'.. స్టీలు రియాక్టర్ల నుంచి చికెన్ ముక్కలు! - meat produced in labs

పంటలను సాగు చేస్తాం. మరి మాంసాన్ని? అదేంటని విస్తుపోయే రోజులు పోయాయి. జంతు మాంసానికి బదులు ప్రయోగశాలలో వృద్ధి చేసిన మాంసం మీద రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. మన పళ్లెంలోని మాంసం భారీ స్టీలు బయోరియాక్టర్ల నుంచి వస్తుందన్న ఆలోచనే ఒకప్పుడు సైన్స్‌ ఫిక్షన్‌లా అనిపించేది. ఇప్పుడదే నిజమవుతోంది. ప్రయోగశాలలో మాంసాన్ని 'పండించటానికి', దీన్ని అసలు మాంసం కన్నా ఆకర్షణీయంగా కనిపించేలా చేయటానికి, వివిధ రూపాల్లోకి మార్చటానికి, మంచి రుచికరంగా రూపొందించటానికి ఎన్నో సంస్థలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు అమ్మకానికీ తీసుకొచ్చాయి. ఇంతకీ జంతువులతో ప్రమేయం లేని ఈ మాంసం ఎలా తయారవుతుంది?

meat-prepare-in-labs-for-steel-reactors
meat-prepare-in-labs-for-steel-reactors
author img

By

Published : Aug 3, 2022, 9:07 AM IST

Cultured Meat: మాంసం కాని మాంసం. ఒకరకంగా కృత్రిమ మాంసం. అలాగని పూర్తిగా కృత్రిమమైనదని అనుకోవటానికి లేదు. అందుకే ప్రయోగశాలలో వృద్ధి చేసే మాంసం రకరకాల పేర్లతోనే ఆవిష్కృతమైంది. మొదట్లో 'వ్యాట్‌ మీట్‌' అన్నారు. పెద్దగా ఎవరికీ రుచించలేదు. తర్వాత 'ల్యాబ్‌ మీట్‌' పేరు ముందుకొచ్చింది. బాగానే ఆకర్షించింది. అనంతరం 'కల్చర్డ్‌ మీట్‌' పదం పుట్టుకొచ్చింది. ఇదింకాస్త బాగుందనీ తోచింది. బడా బడా సంస్థలు, వ్యక్తులు ముందుకు రావటం.. బీరు మాదిరిగా మాంసాన్నీ వృద్ధి చేసే ప్రక్రియ మరింత ఊపందుకోవటంతో ఇది కాస్తా 'కల్టివేటెడ్‌ మీట్‌'గా మారిపోయింది. నిజమే పంటల మాదిరిగా మాంసాన్ని సాగు చేయొచ్చనే కల నిజమైందిగా. పేరు ఏదైతేనేం? ఉద్దేశం మాత్రం ఒక్కటే. జంతువులను వధించకుండా ప్రయోగశాలలో మాంసాన్ని వృద్ధి చేయటం. మున్ముందు ఆహార భద్రత ప్రశ్నార్థకంగా మారే సూచనలు కనిపిస్తుండటం, జంతువుల పెంపకం పర్యావరణానికి శత్రువుగా పరిణమిస్తుండటంతో భవిష్యత్‌ ఆహారంగా ఇది గొప్ప పేరు కొట్టేస్తోంది.

ఎలా తయారవుతుంది?
ఒక్కమాటలో చెప్పాలంటే- టెస్ట్‌ ట్యూబ్‌ నుంచి బయోరియాక్టర్ల వరకు సాగే ప్రక్రియ. మాంసాన్ని వృద్ధి చేసే ప్రక్రియకు మూలం పునరుత్తేజిత ఔషధరంగమే. దీని తయారీలో కీలకమైంది జంతువుల కణాలను సేకరించటం. హాని చేయని బయాప్సీ పద్ధతిలో వీటిని సంగ్రహిస్తారు. తర్వాత గోరువెచ్చటి, పరిశుభ్రమైన పాత్రలో వేస్తారు. ఈ పాత్రలో కణాలు వృద్ధి చెందటానికి అవసరమైన ఉప్పులు, ప్రొటీన్లు, పిండిపదార్థాలతో కూడిన ద్రావణం ఉంటుంది. వీటి సాయంతో కణాలు విభజన చెందుతూ వస్తాయి. ప్రతి 24 గంటలకు కణాలు రెట్టింపు అవుతాయి.

నిజం మాంసం మాదిరిగానే ఉంటుందా?
ప్రయోగశాలలో కణాల నుంచి తయారయ్యే మాంసం ముక్కలు ముక్కలుగా ఏమీ వృద్ధి చెందదు. ఎముకలు, చర్మం, కొవ్వు వంటివేవీ ఉండవు. కొవ్వు కణాలుగా మారటానికి కండర కణాలకు ప్రత్యేకమైన పరిస్థితులు, వేర్వేరు పోషకాలు కావాలి. అందువల్ల కొవ్వు కణాలను విడిగానే వృద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రయోగశాలలో వృద్ధి చేసినప్పుడు మాంసానికి గానీ కొవ్వుకు గానీ ఎలాంటి రూపమూ ఉండదు. కణాల ముద్దలా మాత్రమే ఉంటుంది. అందుకే తొలి ప్రయోగశాల మాంసం పదార్థాలను బర్గర్లుగానో, చికెన్‌ నగెట్స్‌గానో వడ్డించారు. అయితే రుచి మాత్రం మాంసం మాదిరిగానే ఉంటుంది. పరిశుభ్రమైన వాతావరణంలో పెంచటం వల్ల జబ్బులు, రసాయనాలతో కలుషితమయ్యే ముప్పు తక్కువ. సంప్రదాయ మాంసంతో పోలిస్తే ఇదో గొప్ప ప్రయోజనం. జంతువులను కోసి నేల మీద వేసినప్పుడు సాల్మొనెల్లా, ఇకొలి వంటి బ్యాక్టీరియాతో.. జంతు వ్యర్థాలతో కలుషితమయ్యే ప్రమాదముంటుంది. ఈ దృష్టితో చూస్తే సాగు మాంసం ఒక మెట్టు మీదే ఉంటుంది!

పోషకాల మాటేమిటి?
పోషకాల విషయంలో సాగు మాంసం జంతు మాంసంతో సమానంగానే తులతూగుతుంది. కావాలంటే పోషకాల మోతాదులను పెంచుకోవచ్చు. ఆయా వ్యక్తుల ఆరోగ్యానికి, అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు కూడా. ఆరోగ్యానికి హాని చేసే సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వుల మోతాదులను పెంచుకోవచ్చు. ఉదాహరణకు- సాల్మన్‌ చేపల్లో ఉండే కొవ్వు ఆమ్లాలతో కూడిన మాంసాన్ని తయారుచేశారనుకోండి. గుండె ఆరోగ్యానికి మేలు చేసేలా చూసుకోవచ్చు. ప్రస్తుతం సాగు మాంసం పదార్థాల ప్యాకెట్ల మీద పోషకాలను అంతగా వివరించటం లేదు. మున్ముందు విరివిగా అందుబాటులోకి వస్తే వీటి గురించి బాగా తెలుస్తుంది.

పర్యావరణానికి మేలేనా?
కల్చర్డ్‌ మాంసం విస్తృతంగా ఉత్పత్తి అయ్యేంతవరకూ దీని పరిణామాలు ఎలా ఉంటాయన్నది కచ్చితంగా చెప్పలేం. పశువులు, కోళ్ల పెంపకంతో పోలిస్తే ప్రయోగశాలలో వృద్ధి చేసే మాంసంతో ఎక్కువ హరిత వాయువులు విడుదలవుతాయని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అధ్యయనం ఒకటి హెచ్చరిస్తోంది. అయితే ఇది విద్యుత్‌ తయారీకి వాడే ఇంధనాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. స్వచ్ఛ ఇంధనాలతో తయారైన విద్యుత్‌ వాడకంతో అంత ఎక్కువగా గ్రీన్‌ హౌజ్‌ వాయువులు వెలువడకపోవచ్చు. సంప్రదాయ మాంసం ఉత్పత్తులకు సుస్థిర ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే అవకాశం ఉండటం వల్ల మున్ముందు ఇది మంచి ప్రభావమే చూపొచ్చని నిపుణులు ఆశిస్తున్నారు.

meat-prepare-in-labs-for-steel-reactors
.

మాస్ట్రిచ్ట్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ మార్క్‌ పోస్ట్‌ 2013లో ప్రపంచంలోనే తొలిసారిగా కల్చర్డ్‌ బీఫ్‌ బర్గర్‌ను సృష్టించారు. 20వేలకు పైగా కండరపోచలతో కూడిన దీన్ని తయారుచేయటానికి రెండేళ్లు పట్టింది! దీని ధరెంతో తెలుసా? 30లక్షల డాలర్లకు పైనే! ఈ బర్గర్‌ను లండన్‌లో పరీక్షించారు. దీన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అనంతరం ఎన్నెన్నో కంపెనీలు కల్చర్డ్‌ మాంసం మీద దృష్టి సారించాయి. మనదేశానికి చెందిన కంపెనీలూ వీటిని అందుబాటులోకి తెస్తున్నాయి.

సవాళ్లు లేకపోలేదు
ప్రస్తుతం కణ వృద్ధి కోసం ఉపయోగించే మాధ్యమంలో 20% వరకు ఆవు పిండం నుంచి తీసిన రక్తాన్ని వాడుతున్నారు. దీని ఖరీదు ఎక్కువ. పైగా శాకాహారం కాదు. అందుకే దీనికి ప్రత్యామ్నాయాన్ని రూపొందించారు. ఈస్ట్‌ను జన్యుపరంగా మార్చి, అత్యవసర ప్రొటీన్లను ఉత్పత్తి చేసేలా తీర్చి దిద్దారు. దీన్ని ప్రిసిషన్‌ ఫర్మెంటేషన్‌గా పిలుస్తున్నారు. వైద్య అవసరాలకు ఇన్సులిన్‌ను ఈ పద్ధతిలోనే తయారుచేస్తున్నారు.

పెద్దఎత్తున కల్చర్డ్‌ మాంసాన్ని ఉత్పత్తి చేయటమూ సమస్యే. ఇందుకోసం కనీసం 2లక్షల లీటర్ల సామర్థ్యం గల బయోరియాక్టర్లు అవసరం. సింగపూర్‌లో ప్రతివారం ఇలాంటి మాంసాన్ని తింటున్నారు. అక్కడ వినియోగిస్తున్న అతిపెద్ద బయోరియాక్టర్‌ సామర్థ్యం 1,200 లీటర్లు మాత్రమే. వీటి సామర్థ్యాన్ని పెంచగలిగితే పెద్ద ఎత్తున ఉత్పత్తి సాధ్యమవుతుంది. అప్పుడు ధరలూ తగ్గుతాయి. ప్రస్తుతం సాగు చేసిన మాంసాన్ని బర్గర్లు, నగెట్స్‌, సాసేజ్‌ల రూపంలోనే అందుబాటులో ఉన్నాయి. మరి ముక్కల రూపంలో వాడుకోవాలంటే? రూపాన్ని మార్చాల్సిందే. ఇందుకోసం వృక్ష ప్రొటీన్ల సాయం తీసుకుంటున్నారు. అచ్చం మాంసం ముక్కల్లా కనిపించేలా తీర్చిదిద్దుతున్నారు.

మాంసం మాత్రమే కాదు..
ఆవులు, బర్రెలతో పనిలేకుండా పాలు, పాల పొడులను తయారుచేస్తే? ఇప్పటికే అమెరికాకు చెందిన పర్‌ఫెక్ట్‌ సంస్థ ఇలాంటి పాల ప్రొటీన్‌ను తయారుచేస్తోంది. జన్యుపరంగా మార్చిన ఫంగస్‌ నుంచి ఆవు వీ ప్రొటీన్‌ను సంగ్రహించటం ఇందులోని కీలకాంశం. పైగా ఇందులో ల్యాక్టోజ్‌ ఉండదు. ప్రైమీవల్‌ ఫుడ్స్‌ అనే అంకురసంస్థ మరో అడుగు ముందుకేసి పులి, సింహం, జీబ్రా వంటి వాటి మాంసాన్ని తయారుచేయటంపైనా దృష్టి సారించింది. ఇప్పటికే పులి స్టీక్‌, జీబ్రా సుషి రోల్స్‌ రుచులను అందిస్తోంది. ఫిన్‌లెస్‌ ఫుడ్స్‌ అనే సంస్థ చేప మాంసాన్ని వృద్ధి చేసింది. మైక్రోబ్రీవరీ తరహాలో టూనా చేపల కణాలతో దీన్ని తయారుచేసింది. ప్రిసిషన్‌ ఫర్మెంటేషన్‌ సాయంతో ఎవ్రీ కంపెనీ గుడ్డు తెల్లసొనను తయారుచేయటంలో విజయం సాధించింది. రుచి కూడా అచ్చం అలాగే ఉండం విశేషం.

చిరకాల ప్రయత్నం
సిద్ధాంతపరంగా పరిశ్రమల్లో మాంసాన్ని 'పండించటం' సాధ్యమేననే భావన చాలాకాలంగా ఆకర్షిస్తూనే వచ్చింది. కోడి కాలునో, రెక్కనో తినటానికి మొత్తం కోడిని పెంచటమేంటి? తగిన మాధ్యమంలో ఆయా భాగాలనే పెంచితేనో? అని ఒకప్పటి బ్రిటన్‌ ప్రధానమంతి విన్‌స్టన్‌ చర్చిల్‌ 1931లోనే ఒక వ్యాసంలో పేర్కొన్నారు.

meat-prepare-in-labs-for-steel-reactors
.
  • డచ్‌ శాస్త్రవేత్త విలీమ్‌ వ్యాన్‌ ఎలెన్‌ 50ల్లో కల్చర్డ్‌ మీట్‌ భావనను ముందుకు తెచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధ ఖైదీగా ఆయన ఆకలి బాధలను అనుభవించారు. ఇదే ఆయనను ఆహార ఉత్పత్తి, ఆహార భద్రతకు కృషి చేసేలా పురికొల్పింది.
  • ప్రొఫెసర్‌ రసెల్‌ రాస్‌ 1971లో తొలిసారి ప్రయోగశాలలో కండర పోచలను సృష్టించొచ్చని నిరూపించారు. ఆయన పంది గుండె బృహద్ధమనిని సృష్టించి ఔరా అనిపించారు. అమెరికాకు చెందిన జాన్‌ ఎఫ్‌ వీన్‌ 1991లో కణజాలంతో వృద్ధి చేసే మాంసం ఉత్పత్తి కోసం పేటెంట్‌ తీసుకున్నారు.
  • అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వ్యోమగాముల అవసరాలను దృష్టిలో పెట్టుకొని 2001లో కల్చర్డ్‌ మాంసం మీద ప్రయోగాలు ఆరంభించింది. మరో సంస్థ సాయంతో చేప, టర్కీ కోడి మాంసం ముక్కలను వృద్ధి చేయటంలో విజయం సాధించింది కూడా.
  • టిష్యూ కల్చర్‌ అండ్‌ ఆర్ట్‌ ప్రాజెక్టు, హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ 2003లో కప్ప మూలకణాల నుంచి వృద్ధి చేసిన చిన్న మాంసం ముక్కను ప్రదర్శించాయి.
  • 2012కల్లా కల్చర్డ్‌ చికెన్‌ను అందుబాటులోకి తెచ్చినవారికి 10 లక్షల డాలర్లు బహుమతి ఇస్తామని పెటా సంస్థ 2008లో ప్రకటించింది. దీనికోసం చాలామంది ప్రయత్నించినా సఫలం కాలేదు. కానీ కల్చర్డ్‌ మీట్‌కు విశేష ప్రాచుర్యం లభించింది.

ఇదీ చదవండి: మనం ఎందుకు నిద్రించాలి? జ్ఞాపకాలు ఎలా ఏర్పడతాయో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.