ETV Bharat / science-and-technology

'జోకర్'​ మళ్లీ వచ్చేసింది.. ఆదమరిస్తే బ్యాంకు ఖాతా ఖాళీ! - జోకర్​ మాల్వేర్​

జోకర్​ పేరుతో సైబర్​ నేరగాళ్లు వదిలిన ఓ మాల్​వేర్ ప్లేస్టోర్​​ యాప్ యూజర్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. చూస్తుండగానే బ్యాంక్​ ఖాతాలోని నగదును ఖాళీ చేసే ఈ వైరస్​.. మరోసారి ఆండ్రాయిడ్​ యూజర్లను భయపెడుతోంది. తాజాగా 24 యాండ్రాయిడ్​ యాప్స్​లలో ఈ జోకర్​ వైరస్​ను గుర్తించినట్లు సైబర్​ సెక్యూరిటీ సంస్థలు వెల్లడించాయి.

joker virus android
'జోకర్'​ మళ్లీ వచ్చేసింది.. ఈ యాప్స్​తో జాగ్రత్త!
author img

By

Published : Aug 24, 2021, 3:27 PM IST

ఆన్​లైన్​ లావాదేవీలకు డిమాండ్​ పెరుగుతున్న కొద్దీ.. సైబర్​ నేరగాళ్ల భయం కూడా పెరుగుతూ వస్తోంది. ఆన్​లైన్ లావాదేవీలకు సెక్యూరిటీ సంస్థలు భద్రతను పటిష్ఠం చేసే దిశగా చర్యలు చేపడుతున్నా.. హ్యాకర్లు కొత్త కొత్త మాల్​వేర్​లతో వినియోగదారులపై దాడికి ప్రయత్నిస్తున్నారు. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు. హ్యాకర్లు ఉపయోగించే ప్రమాదకర మాల్​వేర్​లలో 'జోకర్'​ ఒకటి. ఇప్పుడు ఈ వైరస్​ మరోసారి వెలుగులోకి వచ్చింది.

బెల్జియం పోలీసుల హెచ్చరికలు..

గతేడాది కలకలం సృష్టించిన 'జోకర్​' మాల్​వేర్..​ మరోసారి వెలుగులోకి వచ్చినట్లు బెల్జియన్​ పోలీసులు వెల్లడించారు. ఆండ్రాయిడ్​ యూజర్లే లక్ష్యంగా సైబర్​ నేరగాళ్లు ప్రయోగించే ఈ జోకర్​.. గూగుల్​ ప్లే స్టోర్​లోని ఎనిమిది యాప్​లలో గుర్తించినట్లు తెలిపారు. ఈ వైరస్​ కనుక ఫోన్​లోకి చొరబడితే వినియోగదారుడి ప్రమేయం లేకుండా, వారికి ఎలాంటి అలర్ట్స్​ లేకుండానే వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయని హెచ్చరించారు.

అసలు ఏంటీ వైరస్​?

'జోకర్'​.. 2017లో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్​.. యాప్​ యూజర్లను వణికించింది. వివిధ రకాల అప్లికేషన్ల ద్వారా వినియోగదారుల ఫోన్లలోకి చొరబడి వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యేలా చేసింది. ఆ సమయంలో అప్రమత్తం అయిన గూగుల్ ప్లే స్టోర్​.. యూజర్లు ఇంకా డౌన్​లోడ్​ చేసుకోని సూమారు 1700 యాప్స్​ను తొలగించింది.

2020 సెప్టెంబరులో మరోసారి జోకర్​ వచ్చింది. 24 ఆండ్రాయిడ్​ యాప్స్​లో ఈ వైరస్​ను గుర్తించి వాటిని తొలగించారు. కానీ అప్పటికే ఈ యాప్స్​కు 5 లక్షల మంది యూజర్లు ఉన్నారు. ఆ సమయంలో ఈ వైరస్ ప్రభావం​ యూఎస్​, బ్రెజిల్, స్పెయిన్​ సహా మరో 27 దేశాలపై ఉన్నట్లు అంచనా. హ్యాకర్లు.. బాధితులకు అనుమానం రాకుండా ఉండేందుకు భారీ మొత్తంలో కాకుండా.. వారానికి కొంత మొత్తంలో డబ్బును లూటీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ జోకర్​ ఎలా పనిచేస్తుంది?

బ్రెడ్​ అనే మాల్​వేర్​కు చెందిన ట్రోజన్​ వైరసే ఈ జోకర్​. వినియోగదారులకు అనుమానం రాకుండా వారి ఫోన్లలోకి చొరబడి లావాదేవీలను తన అదుపులోకి తెచ్చుకోవడమే దీని లక్ష్యం.

యాప్​ ద్వారా ఫోన్​లోకి ప్రవేశించే ఈ జోకర్​.. క్రమంగా టెక్స్ట్​​ మెసేజెస్​, కాన్టాక్ట్స్​ సహా ఇతర అప్లికేషన్లకు పాకుతుందని 'క్విక్​ హీల్'​ సైబర్​ సెక్యురిటీ పరిశోధకులు వెల్లడించారు. ఆందోళనకర విషయం ఏంటంటే.. ఈ వైరస్​ ఫోన్​లోకి ప్రవేశిస్తే బాధితుడికి ఎలాంటి సమాచారం తెలియకుండానే అతని బ్యాంక్​ అకౌంట్​ సహా ఇతర ప్రీమియం సర్వీసులను ప్రభావితం చేస్తుంది.

రూటు​ మారింది..

హ్యాకర్లు మొదట ఎస్ఎంఎస్​ ద్వారా ఈ వైరస్​ను బాధితుల ఫోన్లకు పంపించేవారు. కానీ ఆ తర్వాత ఆన్​లైన్​ పేమెంట్స్​పైన దృష్టి సారించడం మొదలు పెట్టారు. ఈ రెండు విధానాల్లో వినియోగదారుడు గుర్తించే వీలు లేకుండా లావాదేవీలు జరిపేందుకు అవకాశం ఉంది. టెలిఫోన్​ ఆపరేటర్లను విక్రేతలతో అనుసంధానం చేయడం ద్వారా బాధితుడు గుర్తించకుండానే హ్యాకర్లు లావాదేవీలు జరుపుతారు.

భారీ మొత్తంలో కాకుండా కొంత మొత్తంలోనే లూటీ చేస్తుండటం వల్ల బ్యాంకులకు కూడా ఎలాంటి అనుమానం రావడం లేదనే వాదన వినిపిస్తోంది.

ఈ యాప్స్​తో డేంజర్​..

జోకర్​ వైరస్​ ఉన్నట్లు గుర్తించి గూగుల్​ ప్లేస్టోర్​ తొలగించిన యాప్స్​ జాబితా ఇదే..

  • ఆక్సిలరీ మెసేజ్
  • ఎలిమెంట్​ స్కానర్​
  • ఫాస్ట్​ మ్యాజిక్​ ఎస్​ఎంఎస్​
  • ఫ్రీ క్యామ్​ స్కానర్
  • గో మెసేజెస్
  • సూపర్​ మెసేజ్
  • సూపర్​ ఎస్​ఎంఎస్​
  • ట్రావెల్​ వాల్​పేపర్స్​

అయితే.. సైబర్​ సెక్యూరిటీ సంస్థ జెడ్​స్కేలర్​.. వీటిల్లో కూడా జోకర్​ వైరస్​ ఉందని పేర్కొంటూ మరో 16 యాప్స్​ పేర్లను ప్రకటించింది.

  • ప్రైవేట్​ ఎస్​ఎంఎస్​
  • హమ్మింగ్​ బర్డ్​ పీడీఎఫ్​ కన్వర్టర్​- ఫొటో టు పీడీఎఫ్
  • స్తైల్​ ఫొటో ఎడిటర్​- బ్లర్​ ఫోకస్​
  • పేపర్​ డాక్​ స్కానర్​
  • ఆల్​ గుడ్​ పీడీఎఫ్​ స్కానర్​
  • కేర్​ మెసేజ్​
  • పార్ట్​ మెసేజ్​
  • బ్లూ స్కానర్​
  • డైరక్ట్​ మెసేంజర్
  • వన్​ సెంటెన్స్​ ట్రాన్స్​లేటర్- మల్టీఫంక్షనల్​ ట్రాన్స్​లేటర్​
  • మింట్​ లీఫ్​ మెసేజ్​- యువర్​ ప్రైవేట్​ మెసేజ్
  • యూనిక్​ కీ బోర్డ్​- ఫాన్సీ ఫాన్ట్స్​ అండ్​ ఫ్రీ ఎమోటికాన్స్​
  • ​టాన్​గ్రామ్​ యాప్​ లాక్​
  • డిజైర్​ ట్రాన్స్​లేట్​
  • మెటిక్యులస్​ స్కానర్​

ఈ ప్రమాదకర యాప్స్​ ఏవైనా మీ ఫోన్లో ఉన్నాయా?.. ఉంటే వెంటనే తొలగించండి. గూగుల్​ ప్లేస్టోర్​ తొలగించింది కదా.. ఇవి మన ఫోన్​పై ప్రభావం చూపవు అనుకుంటే పొరపాటే. యాప్​ను తొలగించే వరకు వైరస్​ ప్రభావం మీ డివైజ్​పై తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఈ 'జోకర్'​తో జర జాగ్రత్త.​​

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.