ETV Bharat / science-and-technology

JioPhone 5G: జియోఫోన్‌ 5G సిద్ధమవుతోంది.. ఫీచర్లేంటో తెలుసా? - జియో ఫోన్ 5జీ ఫీచర్లు

JioPhone 5G: మొబైల్‌ ఫోన్‌ల విపణిలో సంచలనం జియో.. 5జీ ఫోన్‌ మీద దృష్టి పెట్టిందని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు మొదలయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఆండ్రాయిడ్‌ సెంట్రల్‌ వెబ్‌సైట్‌ ఈ మొబైల్‌కి సంబంధించి వివరాలు వెల్లడించింది.

JioPhone 5G
జియోఫోన్‌ 5G
author img

By

Published : Jan 29, 2022, 10:07 AM IST

JioPhone 5G: మొబైల్‌ ఫోన్‌ల విపణిలో మరో సంచలనానికి జియో సిద్ధమవుతోంది. ఇప్పటికే జియో నెట్‌వర్క్‌, జియో ఫీచర్‌ ఫోన్‌, జియోఫోన్‌ నెక్స్ట్‌తో అదరగొట్టిన ముకేశ్‌ అంబానీ టీమ్‌.. ఇప్పుడు 5జీ జియో ఫోన్‌ మీద దృష్టి పెట్టిందని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు మొదలయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఆండ్రాయిడ్‌ సెంట్రల్‌ వెబ్‌సైట్‌ ఈ మొబైల్‌కి సంబంధించి వివరాలు వెల్లడించింది. దీంతో ఇప్పుడు ఈ మొబైల్‌ టాక్‌ ఆఫ్‌ ది టెక్‌ ఇండస్ట్రీగా మారింది.

జియోఫోన్‌ 5జీ ఎలా ఉండొచ్చంటే..

Jio 5g Phone Features:

  1. జియోఫోన్‌ 5జీలో మొబైల్‌లో స్నాప్‌డ్రాగన్‌ 480 5జీ చిప్‌ సెట్‌ ఉంటుందట. స్నాప్‌డ్రాగన్‌ ఎక్స్‌ 51 మోడెమ్‌ ఉంటుంది. మొబైల్‌ N3, N5, N28, N40, N78 5జీ బ్యాండ్స్‌ను సపోర్టు చేస్తుందట.
  2. 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. దీని రిజల్యూషన్‌ 1600X720గా ఉండనుంది. పంచ్‌ హోల్‌ కటౌట్‌లో కెమెరా ఇస్తున్నారు. పైన, కింద బెజెల్స్‌ ఉంటాయి.
  3. 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ అంతర్గత స్టోరేజీ ఇస్తారట. మెమొరీ కార్డు వేసుకునే సదుపాయమూ ఉంటుంది. రెండు సిమ్‌లు, ఒక మెమొరీ కార్డును ఒకేసారి వాడుకునేలా స్లాట్స్‌ ఇస్తున్నారు.
  4. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. యూఎస్‌బీ - సీ పోర్టు ఉంటంఉది. 18 వాట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఇస్తున్నారట.
  5. కెమెరాల విషయానికొస్తే.. జియోఫోన్‌ నెక్స్ట్‌ తరహాలోనే ఇందులోనూ 13 ఎంపీ బ్యాక్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఉంటాయి. 2 ఎంపీ మాక్రో కెమెరా కూడా ఉంటుంది.
  6. ఆండ్రాయిడ్‌ 11తో మొబైల్‌ లాంచ్‌ చేస్తారు. అయితే దీనిని జియో కోసం కస్టమైజ్డ్‌గా సిద్ధం చేస్తున్నారట. ఆండ్రాయిడ్‌ గో ఎడిషన్‌ మాదిరిగానే ఉంటుందట. గూగుల్‌ ప్లే సర్వీసులు, జియో డిజిటల్‌ సూట్‌ ఉంటాయి.
  7. ఆల్వేస్‌ ఆన్‌ గూగుల్‌ అసిస్టెంట్‌, గూగుల్‌ లెన్స్‌, ట్రాన్స్‌లేట్‌ లాంటి గూగుల్‌ యాప్స్‌ ఇన్‌బిల్ట్‌ ఉంటాయి. అలాగే మై జియో, జియో టీవీ, జియో సినిమా, జియో సావన్‌ లాంటి జియో ప్రత్యేక యాప్స్‌ కూడా ఇస్తారు.
  8. ప్రస్తుతం ఈ మొబైల్‌ ప్రోటో టైప్‌లోనే ఉందట. అయితే ఈ ఏడాదిలోనే ఫోన్‌ను లాంచ్‌ చేయాలని టీమ్‌ భావిస్తోందట. ప్రస్తుతం 5జీ నెట్‌వర్క్‌ ట్రయల్స్‌ దేశంలో జరుగుతున్నాయి. వాటిపై స్పష్టత వచ్చాక ఈ మొబైల్‌ లాంచ్‌ ఉండొచ్చు.
  9. జియో గత బిజినెస్‌ ప్లాన్స్‌ బట్టి చూస్తే.. జూన్‌లో ఈ మొబైల్‌ను అనౌన్స్‌ చేసి.. నవంబరులో సేల్స్‌ ప్రారంభించొచ్చు అని అంటున్నారు. గతంలో జియోఫోన్‌ నెక్స్ట్‌ కూడా ఇలానే తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
  10. ఇక ధర విషయానికొస్తే.. రూ. 9 వేలు నుంచి రూ. 12 వేల మధ్యలో ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే మొబైల్‌ సిద్ధమయ్యాక ధర విషయం తుది నిర్ణయం తీసుకుంటారట.

గమనిక: ఈ మొబైల్‌కు సంబంధించి జియో నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: బడ్జెట్‌ శ్రేణిలో శాంసంగ్ కొత్త ట్యాబ్‌..ధర, ఫీచర్లివే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.