ETV Bharat / science-and-technology

సరికొత్త ఓఎస్​తో జియోఫోన్​ నెక్స్ట్.. ప్రత్యేకతలు ఇవే... - జియెఫోన్​ నెక్స్ట్ వార్తలు

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియోఫోన్ నెక్స్ట్​​ అప్​డేట్స్​(JioPhone Next update) వచ్చేశాయి. ఈ ఫోన్​ కోసం జియో, గూగుల్ సంయుక్తంగా 'ప్రగతి' ఆపరేటింగ్​ సిస్టమ్​ను అభివృద్ధి చేశాయి. కేవలం భారత్​ కోసమే ఈ ఓఎస్​ను రూపొందించినట్లు జియో పేర్కొంది. అలాగే ఈ స్మార్ట్​​ఫోన్ తయారీ, లాంచింగ్​ వెనుకున్న ఉద్దేశాన్ని తెలియచేస్తూ.. 'మేకింగ్​ ఆఫ్​ జియోఫోన్​ నెక్స్ట్​' పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది జియో.

JioPhone Next
జియెఫోన్​ నెక్ట్స్
author img

By

Published : Oct 25, 2021, 6:14 PM IST

Updated : Oct 25, 2021, 6:27 PM IST

జియో, గూగుల్‌ కలిసి తక్కువ ధరలో మంచి ఫీచర్లతో స్మార్టఫోన్‌ను తీసుకొస్తామని ప్రకటించిన నాటి నుంచి.. ఆ ఫోన్ ఎప్పుడెప్పుడొస్తుందా అని అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు టెక్​ ప్రియులు. దాని అప్​డేట్స్(JioPhone Next update)​ కోసం నెట్లో వెతుకుతూనే ఉన్నారు. అలాంటి వారికోసం దీపావళికి ముందే.. జియోఫోన్​ నెక్స్ట్​కు సంబంధించి అప్​డేట్స్​ను(JioPhone Next latest news) వీడియో రూపంలో ​విడుదల చేసింది జియో. 'మేకింగ్​ ఆఫ్​ జియోఫోన్​ నెక్స్ట్​' పేరుతో విడుదల చేసిన ఈ వీడియోలో ఫోన్​ ఫీచర్లు, తయారీ వెనుకున్న ఉద్దేశం గురించి వివరించారు. దీపావళికే(jio phone next launch date) దీనిని వినియోగదారులకు మార్కెట్​లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

సరికొత్త ఓఎస్​తో..​

జియోఫోన్​ నెక్స్ట్​(JioPhone Next news) కోసం గూగుల్​, జియో సంయుక్తంగా సరికొత్త ప్రగతి ఆపరేటింగ్​ సిస్టమ్​ను(ఓఎస్​) రూపొందించాయి. తక్కువ ధరకు గొప్ప అనుభూతిని అందిస్తూనే.. అందరినీ 'ప్రగతి'లోకి తీసుకురావాలనే లక్ష్యంతో జియో, గూగుల్‌లోని అత్యుత్తమ టెకీలు దీనిని అభివృద్ధి చేశారని జియో ప్రతినిధులు వెల్లడించారు. ఈ ఓఎస్​ను కేవలం భారత్​ కోసమే ​అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు.

జియోఫోన్​ నెక్స్ట్ లో​.. క్వాల్కామ్ ​ప్రాసెసర్​ను అమర్చారు. దీంతో ఫోన్​ ​పనితీరు, ఆడియో, బ్యాటరీలో ఆప్టిమైజేషన్‌లతో పాటు కనెక్టివిటీ, లొకేషన్ టెక్నాలజీ వంటివి సమర్థంగా పని చేస్తాయని జియో ప్రతినిధులు తెలిపారు.

ఫీచర్ల వివరాలు

వాయిస్​ అసిస్టెంట్​

వాయిస్​ అసిస్టెంట్​.. ఫోన్​ను ఆపరేట్​ చేయడం, యాప్స్​ను తెరవడం సహా ఎన్నో రకాలుగా యూజర్​కు ఉపయోగపడుతుంది. దీని సాయంతో వినియోగదారుడికి తెలిసిన భాషలో ఇంటర్నెట్​ నుంచి సమాచారం/కంటెంట్‌ను సులభంగా పొందవచ్చు.

గట్టిగా చదవడం..

స్కీన్​​పై ఉన్న కంటెంట్​ను స్పష్టంగా, గట్టిగా చదివి వినిపించే సౌకర్యం ఈ ఫోన్​లో ఉంది. ఫలితంగా అంధులు సైతం ఈ ఫోన్​ను వినియోగించుకోవచ్చు.

అనువాదం

యూజర్​కు కావాల్సిన భాషలో అత్యంత సులభంగా, సమర్థంగా ఒక భాష నుంచి మరొక భాషలోకి అనువాదించేలా జియోఫోన్​ నెక్స్ట్​ను రూపొందించారు. దీంతో వినియోగదారుడికి అనువైన భాషలో కంటెంట్ చదువుకోవడానికి ఉపయోగపడుతుంది.

స్మార్ట్​ కెమెరా..

ఈ ఫోన్​కు శక్తిమంతమైన, స్మార్ట్​ కెమెరాను అమర్చారు. దీంతో నచ్చిన మోడ్​లలో అద్భుతమైన ఫొటోలు తీసుకోవచ్చు. అలాగే ఆటోమెటిక్​గా బ్యాగ్రౌండ్​ బ్లర్​ అయ్యే సౌకర్యం ఉంది. నైట్​ మోడ్​ ద్వారా తక్కువ కాంతిలో కూడా హైక్వాలిటీ ఫొటోలు తీసుకోవచ్చు.

ప్రీలోడెడ్​గా జియో, గూగుల్​ యాప్​లు

గూగుల్​ ప్లేస్టోర్​లో​ అందుబాటులో ఉన్న అన్ని ఆండ్రాయిడ్​ యాప్​లను ఈ ఫోన్​ సపోర్ట్​ చేస్తుంది. జియో, గూగుల్ యాప్‌లను కొన్నింటిని డిఫాల్ట్​గా లోడ్​ చేశారు.

ఆటోమెటిక్​ సాఫ్ట్​వేర్​ అప్​డేట్​

జియోఫోన్ నెక్స్ట్​ సాఫ్ట్‌వేర్ ఎప్పటికప్పుడు ఆటోమేటిక్​గా అప్‌డేట్‌ అయ్యే ఆప్షన్​ను ఇందులో ఉంది. ఫలితంగా ఫోన్​.. తాజా ఫీచర్‌లతో వేగంగా పని చేస్తుంది.

బ్యాటరీ

ఈ ఫోన్​ను ప్రత్యేక ప్రగతి ఓఎస్​ను ఆండ్రాయిడ్​తో రూపొందించారు. ఇది బ్యాటరీ జీవితకాలానికి భరోసానిస్తూ.. పనితీరును మెరుగుపరుస్తుంది.

ఇదీ చూడండి: వాట్సాప్​లో మన డీపీని ఎవరు చూశారో తెలుసుకోవచ్చా?

Last Updated : Oct 25, 2021, 6:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.