జపాన్ శాస్త్రవేత్తలు ఓ అరుదైన ఘనత సాధించారు. రెండు మగ ఎలుకల నుంచి ఓ సంతానాన్ని ఉత్పత్తి చేశారు. జపాన్‌లోని క్యుషు, ఒసాకా విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల బృందం ఈ ఘనతను సాధించింది. పురుష జీవుల చర్మ కణాలలో నుంచి.. అండాలను సేకరించి ఈ ఎలుకలను రూపొందించినట్లు ది గార్డియన్ వార్తా పత్రిక నివేదించింది. మానవులలో కొత్త సంతానోత్పత్తి చికిత్సలకు ఇది దోహదపడే అవకాశం ఉందని పేర్కొంది.
'ఈ పద్ధతిలో ఇద్దరు పురుషులు కలిసి.. పిల్లల్ని కనేందుకు దోహాదపడుతుంది. టర్నర్స్ సిండ్రోమ్ వంటి సంతానోత్పత్తి చికిత్సకు ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఎక్స్ క్రోమోజోమ్ పూర్తిగా, పాక్షికంగా మిస్ అయిన ఈ పద్ధతిలో విజయవంతంగా చికిత్స చేయవచ్చు. పురుష అండాలను ఉపయోగించి ఓ బలమైన క్షీరదాన్ని సృష్టించడం ఇదే మొదటిసారి.' క్యుషు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త.. కట్సుహికో హయాషి తెలిపారు.
హ్యూమన్ జీనోమ్ ఎడిటింగ్‌పై జరిగిన మూడవ అంతర్జాతీయ సమ్మిట్‌లో ఈ కీలక పురోగతిని.. హయాషి సమర్పించారు. లండన్‌లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్.. బుధవారం ఈ సమ్మిట్ జరిగింది. గతంలోనూ శాస్త్రవేత్తలు సాంకేతికంగా ఇద్దరు బయెలాజికల్గా ఫాదర్స్ నుంచి ఎలుకను సృష్టించారు. తల్లుల నుంచి కూడా సృష్టించారు. కానీ రెండు మగ ఎలుకల కణాల నుంచి అండాలను సృష్టించడం ఇదే మొదటి సారి.
"ఇండుసెడ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ (ఐపీఎస్) కణాలను సృష్టించడానికి మగ చర్మ కణాలను స్టెమ్ సెల్ లాంటి స్థితికి రీప్రోగ్రామ్ చేసింది పరిశోధన బృందం. తరువాత వై క్రోమోజోమ్‌ను డిలీట్ చేసింది. ఆ తరువాత ఎక్స్ క్రోమోజోమ్‌తో రీప్లేస్ చేసింది. ఈ ఎక్స్ క్రోమోజోమ్‌ను మరొక సెల్ నుంచి తీసుకుంటారు. రెండు ఒకేలా ఎక్స్ క్రోమోజోమ్‌లతో ఐఫీఎస్ కణాలను ఉత్పత్తి చేసేందుకు దీన్ని తీసుకుంటారు." అని రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. అంటే పరిశోధనలో మగ ఎలుక చర్మ కణం నుంచి ఒక మూలకణాన్ని సృష్టిస్తారు. ఆపై వై క్రోమోజోమ్‌ను తొలగిస్తారు. ఎక్స్ క్రోమోజోమ్‌ను డూప్లికేట్ చేసి.. అది గుడ్డుగా మారేలా చేస్తారు.
"మేము ఎక్స్ క్రోమోజోమ్‌ను నకిలి చేయడానికి ఓ కొత్త వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. ఈ టెక్నిక్‌లను ఉపయోగించి 600 ఇంప్లాంట్‌లను రూపొందించాం. అయితే అందులో అయితే ఏడు పిల్లలు మాత్రమే జన్మించాయి. అవి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపున్నాయని ." అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదే టెక్నిక్‌ను మానవులపై ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త హయాషి తెలిపారు. రాబోయే పది సంవత్సరాలలో ఇది సాధ్యం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అవి పునరుత్పత్తికి ఉపయోగపడతాయో లేదా అన్నది మాత్రం తనకు తెలియదన్నారు.