ETV Bharat / science-and-technology

రోదసిలో టైం మెషీన్- ఖగోళ రహస్యాలను ఛేదించే దర్శిని!

James Webb Telescope: సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రయత్నం త్వరలో సాకారం కానుంది. విశ్వ ఆవిర్భావం తొలినాళ్లను చూడటానికి తోడ్పడే అంతరిక్ష చక్షువు ఆవిష్కృతం కానుంది. అవును.. అసలు సాధ్యమే కాదన్న అనుమానాలను దాటుకొని, టైమ్‌మెషీన్‌ తరహాలో ఖగోళ రహస్యాలను ఛేదించటానికి మహా విశ్వ దర్శిని 'జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌' మరో రెండు రోజుల్లో నింగికెగరనుంది. నాలుగు శతాబ్దాల ఆవిష్కరణలను కేవలం పదేళ్లలోనే మన ముందుంచగలదని భావిస్తున్న ఈ అద్భుత టెలిస్కోప్‌ వివరాలేంటో చూద్దాం.

James Webb Telescope
James Webb Telescope
author img

By

Published : Dec 22, 2021, 10:34 AM IST

James Webb Telescope: అది 1995. ప్రస్తుతం అత్యంత ఆసక్తి కలిగిస్తున్న జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ (జేడబ్ల్యూఎస్‌టీ) ఆలోచనకు బీజం పడిన సంవత్సరం. ఖగోళాన్వేషణలో సరికొత్త చరిత్ర సృష్టించిన హబుల్‌ టెలిస్కోప్‌ పంపించిన ఓ దృశ్యంతోనే దీని కథ ఆరంభమైంది. 'హబుల్‌ డీప్‌ ఫీల్డ్‌ ఇమేజ్‌'గా పేరొందిన అందులో 3వేల నక్షత్ర మండలాల జాడలున్నాయి! వీటి రహస్యాన్ని ఛేదించాలనే ప్రయత్న ఫలితమే జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌.

Space time machine James Webb

ఒకరకంగా దీన్ని గత కాల ప్రయాణాన్ని సుసాధ్యం చేసే టైం మెషీన్‌ అనీ అనుకోవచ్చు. కాంతి అత్యంత వేగంగా ప్రసరిస్తుండొచ్చు. కానీ అది విశ్వం గుండా ప్రయాణిస్తూ మనకు చేరటానికి చాలా కాలమే పడుతుంది. అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న నక్షత్ర కాంతి ఈనాటిది కాదన్నమాట. కాబట్టే సుదూర ఖగోళ వస్తువుల నుంచి వెలువడే కాంతి పురాతనమైందనీ భావిస్తుంటారు. మరి ఈ నక్షత్రాలు, నక్షత్ర మండలాల వయసును గుర్తించటమెలా? ఇక్కడే మనకు నక్షత్ర కాంతి సాయం చేస్తుంది. మహా విస్ఫోటనం (బిగ్‌ బ్యాంగ్‌) సంభవించినప్పట్నుంచీ విశ్వం విస్తరిస్తూనే ఉంది. సుదూరాల నుంచి కాంతి ప్రయాణం కొనసాగుతూనే వస్తోంది. ఇలా చాలా దూరం ప్రయాణించటం వల్ల కాంతి తరంగధైర్ఘ్యమూ మారిపోతుంటుంది. ఇది పరారుణ కాంతిగా మారేలానూ పురికొల్పుతుంది. కొన్ని నక్షత్ర మండలాల్లో ఇలాంటి కాంతి చాలా ఎక్కువగా ఉంటున్నట్టు హబుల్‌ టెలిస్కోప్‌ గుర్తించటం గమనార్హం. వీటి వయసు 1000 కోట్ల సంవత్సరాల కన్నా ఎక్కువేననీ తేలింది.

Space secrets James Webb Telescope

ఇంత పురాతన నక్షత్ర మండలాల జాడను, అదీ ఇంత ఎక్కువ సంఖ్యలో చూడగలమని శాస్త్రవేత్తలు ఎన్నడూ ఊహించలేదు. దీంతో ఖగోళ రహస్యాలను ఇంకాస్త లోతుగా శోధించాలనే ఆసక్తి పెరిగింది. అయితే ఇందుకు హబుల్‌ టెలిస్కోప్‌ దృశ్యాల స్పష్టత సరిపోదు. దీంతో కొందరు శాస్త్రవేత్తలు 'నెక్స్ట్‌ జనరేషన్‌ స్పేస్‌ టెలిస్కోప్‌' తయారీకి నడుం బిగించారు. అదే చివరికి జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌గా మారింది. అపోలో అంతరిక్ష ప్రయోగ రూపకల్పనలో పాలు పంచుకున్న జేమ్స్‌ ఇ.వెబ్‌ పేరునే దీనికి పెట్టారు. హబుల్‌ టెలిస్కోప్‌ వారసత్వాన్ని కొనసాగించటానికి రంగంలోకి దిగుతున్న దీన్ని పొట్టిగా 'వెబ్‌' అనీ పిలుచుకుంటున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, యూరోపియన్‌ స్పేస్‌ అకాడమీ, కెనడియన్‌ స్పేస్‌ ఏజెన్సీలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. ఇది ఇన్‌ఫ్రారెడ్‌ విజన్‌తో 1350 కోట్ల సంవత్సరాల వెనక్కి చూడగలదు. విశ్వం తొలి నాళ్లలో చీకట్లోంచి నక్షత్రాలు, నక్షత్ర మండలాలు పుట్టు కొస్తున్న తీరును కళ్లకు కట్టగలదు. వందల కోట్ల ఏళ్లుగా నక్షత్ర మండలాలు ఎలా కలిసిపోతున్నాయనేది అర్థం చేసుకోవటానికీ ఉపయోగపడగలదు.

మూడు దశాబ్దాల కల

వెబ్‌ టెలిస్కోప్‌ పురుడు పోసుకున్నప్పట్నుంచీ దీని సాకారం ఊగిసలాటలోనే ఉండిపోయింది. దీన్ని 2007లోనే ప్రయోగించాలని అనుకున్నా ఏళ్లకేళ్లుగా వాయిదా పడుతూనే వచ్చింది. అసలు ఇలాంటి టెలిస్కోప్‌ ప్రయోగం సాధ్యమే కాదని చాలామంది అనుమానించారు. దీన్ని విశ్వం ఏర్పడినప్పటి తొలి నక్షత్రాలను చూసేలా టైమ్‌మిషిన్‌ తరహాలో రూపొందించటమూ కాలయాపనకు దారితీసింది. దీని నిర్మాణానికి 50కోట్ల డాలర్ల ఖర్చు అవుతుందని మొదట్లో భావించారు. అత్యంత సంక్లిష్టమైన, వినూత్న డిజైన్‌తో కూడిన దీన్ని పూర్తి చేయటానికి సుమారు 730 కోట్ల డాలర్లు ఖర్చయ్యింది. అయితేనేం? ఖర్చు పెట్టిన దాని కన్నా వెబ్‌ ఎన్నో రెట్లు ఎక్కు ఫలితాలు సాధిస్తుందని శాస్త్రవేత్తలు గట్టిగా నమ్ముతున్నారు. 400 ఏళ్లలో కనుగొనే విషయాలను ఒక దశాబ్దంలోనే గుర్తించొచ్చని ఆశిస్తున్నారు. అందుకే సమయం ఎక్కువ తీసుకున్నా, ఖర్చు ఎక్కువైనా వెనకాడకుండా అధునాతన పరిజ్ఞానంతో వెబ్‌ను రూపొందించారు.

James Webb Telescope
.

James Webb Telescope Telescope features

  • వెబ్‌ టెలిస్కోప్‌ వినూత్నమైన, విశిష్టమైన పరికరం అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతరిక్షంలోకి ప్రయోగించనున్న అతి పెద్ద టెలిస్కోప్‌ ఇదే. హబుల్‌ టెలిస్కోప్‌ కన్నా దీని విస్తీర్ణం రెండున్నర రెట్లు ఎక్కువ. కాంతిని గ్రహించటానికి తోడ్పడే దీని ప్రధాన అద్దం 6.5 మీటర్ల వెడల్పుంటుంది. విస్తీర్ణంతో పోలిస్తే దీనికి కాంతిని గ్రహించే శక్తి చాలా ఎక్కువ.
  • సూర్యుడి వైపు ఉండే టెలిస్కోప్‌ భాగం 85 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు వెడెక్కే అవకాశముంది. అందుకే టెలిస్కోప్‌ దెబ్బతినకుండా ఐదు పొరలతో ప్రత్యేక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు. ఇది 22 మీటర్ల పొడవుంటుంది. ఇక సూర్యుడికి అటువైపున ఉండే టెలిస్కోప్‌ భాగం అతి చల్లగా (మైనస్‌ 233 డిగ్రీల సెంటీగ్రేడ్‌) ఉంటుంది.
    James Webb Telescope
    .
  • పరారుణ కాంతిని వీలైనంత ఎక్కువగా గ్రహించటానికి వెబ్‌ టెలిస్కోప్‌ అద్దానికి బంగారు పూత పూశారు. ఇందుకోసం 49.25 గ్రాముల బంగారాన్ని వాడారు. బంగారం పూత దెబ్బతినకుండా దాని మీద అతి పలుచటి గ్లాసు పొరనూ ఏర్పాటు చేశారు.
  • వెబ్‌ టెలిస్కోప్‌ అంతరిక్షంలో తన స్థానానికి చేరుకోవటానికి నెల పడుతుంది. ఇది భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో.. లాగ్రాంగే పాయింట్‌ ఎల్‌2 వద్ద స్థిర పడుతుంది. పరారుణ కాంతికి దెబ్బతినకుండా.. భూమికి వీలైనంత దూరంలో, అవాంఛిత వేడిని పుట్టించేవేవీ లేనిచోట భద్రంగా ఉండటానికే టెలిస్కోప్‌ను ఇక్కడ ఉండేలా చూస్తున్నారు. పైగా ఇక్కడ్నుంచి విశ్వాన్ని మరింత స్పష్టంగా వీక్షించటానికీ వీలుంటుంది. కాకపోతే ఏదైనా భాగం చెడిపోతే మరమ్మతు చేయటానికి దీని వద్దకు వ్యోమగాములను పంపటానికి కుదరదు.
  • ప్రధానమైన అద్దం చాలా పెద్దగా ఉంటుంది. ఆయా వస్తువుల నుంచి వచ్చే కాంతిని వీలైనంత ఎక్కువగా ఒడిసి పట్టుకోవటంలో ఇదే కీలకం. దీన్ని పద్దెనిమిది షడ్భుజి భాగాలుగా నిర్మించారు. ప్రయోగించటానికి ముందు మడిచి పెట్టటానికి, రోదసిలోకి వెళ్లాక తిరిగి తెరుచుకోవటానికిది వీలు కల్పిస్తుంది.
  • వెబ్‌ టెలిస్కోప్‌ అతి స్పష్టంగా దృశ్యాలను తీస్తుంది. ఇది 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాణాన్ని సైతం స్పష్టంగా చూపగలదు.
  • ఇన్‌ఫ్రారెడ్‌ రేడియేషన్‌ సాయంతో నక్షత్రాలకు సమీపంలోని గ్రహాలను గుర్తిస్తుంది. నక్షత్ర కాంతి ప్రసరించే తీరును బట్టి సౌర మండలం ఆవలి గ్రహాల వాతావరణాలనూ లెక్కించగలదు. ఇలా వాటి మీద నీటి జాడలనూ పసిగడుతుంది. దీంతో జీవుల ఉనికి సైతం బయటపడుతుంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.