ETV Bharat / science-and-technology

ISRO To Launch Venus Mission : శుక్రగ్రహంపై ప్రయోగాలకు ఇస్రో రెడీ.. రెండు పేలోడ్లు సిద్ధం

ISRO To Launch Venus Mission : జాబిల్లిపైకి చంద్రయాన్​-3ని పంపి విజయవంతమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. ఇప్పుడు శుక్రగ్రహంపై ప్రయోగానికి సిద్ధమవుతోంది. సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం అయిన శుక్రుడిపై భారత్ ప్రయోగం చేపట్టనుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు.

ISRO To Launch Venus Mission
ISRO To Launch Venus Mission
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2023, 12:26 PM IST

Updated : Sep 27, 2023, 12:33 PM IST

ISRO To Launch Venus Mission : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రుడిపై పరిశోధనలు చేసేందుకు సిద్ధమైంది. చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతమైన నేపథ్యంలో త్వరలోనే వీనస్ మిషన్‌ను చేపట్టనున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం అయిన శుక్రుడిపై భారత్​ ప్రయోగాలు చేపట్టనుందని ఆయన మంగళవారం ప్రకటించారు. ఇప్పటికే వీనస్​ మిషన్​కు సంబంధించి రెండు పేలోడ్లు అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు.

Venus Mission ISRO With Which Country : దిల్లీలోని ఇండియన్​ నేషనల్​ సైన్స్​ అకాడమీని ఉద్దేశించి సోమ్​నాథ్​ మాట్లాడారు. శుక్రుడిపై అధ్యయనం చేయడం వల్ల అంతరిక్ష శాస్త్ర రంగంలోని అనేక ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. "శుక్రగ్రహం చాలా ఆసక్తికరమైన గ్రహం. దాని పైవాతావరణం చాలా మందంగా ఉంటుంది. వాతావరణ పీడనం భూమి కంటే 100 రెట్లు ఎక్కువగా ఆమ్లాలతో కూడి ఉంటుంది. భూమి ఏదో ఒకరోజు శుక్రుడు కావచ్చు. 10,000 సంవత్సరాల తర్వాత భూమి లక్షణాలు మారిపోవచ్చు" అని ఆయన అన్నారు.

Venus Mission ISRO Update : చంద్రయాన్-3 విజయవంతమైన తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ 2న సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు భారతదేశపు తొలి అంతరిక్ష ఆధారిత మిషన్ ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌకను ఇస్రో ప్రయోగించింది. అనంతరం ఇస్రో వీనస్ మిషన్​పై దృష్టి సారించనుంది.

ల్యాండర్‌, రోవర్‌పై సన్నగిల్లుతున్న ఆశలు
Lander Rover Wake Up : ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 మిషన్‌లోని ల్యాండర్‌, రోవర్‌లు మేల్కొంటాయన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ నెల 22న చంద్రుని దక్షిణ ధ్రువంపై సూర్యోదయం కావడం వల్ల శాస్త్రవేత్తలు వాటితో అనుసంధానమయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. అయినా సానుకూల ఫలితాలు రాలేదు. మిషన్‌లో ఉపయోగించిన పరికరాలు అక్కడి అతిశీతల పరిస్థితులను తట్టుకోలేకపోయాయని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సమయం గడిచేకొద్దీ అవకాశాలు మందగిస్తున్నాయని వెల్లడించారు. ల్యాండర్‌, రోవర్‌లతో ఇక అనుసంధానం కాలేకపోయినప్పటికీ ఈ మిషన్‌ ఓ అఖండ విజయమని ఇస్రో మాజీ అధిపతి ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ అభివర్ణించారు.

Last Updated : Sep 27, 2023, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.