లగ్జరీ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ యాపిల్.. తమ వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఫోన్ 13 సిరీస్‌ను(iPhone 13 Series) ఆవిష్కరించింది. కాలిఫోర్నియా స్ట్రీమింగ్ పేరుతో గ్రాండ్‌గా నిర్వహించిన ఈవెంట్లో మంగళవారం ఈ ఫోన్ మోడళ్లను విడుదల చేసింది. యాపిల్ ప్రియులు నభూతో నభవిష్యత్ అనేలా సరికొత్త అనుభూతిని ఈ మోడళ్లు అందిస్తాయని స్పష్టం చేసింది. ప్రారంభ ధర రూ.69,900గా ఉన్న ఈ ఫోన్ల ప్రత్యేకతలు ఇతర వివరాలు ఓసారి చూద్దాం.
- ఐఫోన్ 13 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 13(iPhone 13), ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ మోడళ్లను యాపిల్ సంస్థ విడుదల చేసింది.
- భారత్, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, బ్రిటన్, అమెరికా సహా మరో 30 దేశాల్లోని స్మార్ట్‌ఫోన్ లవర్స్ ఈ ఫోన్లను సెప్టెంబర్ 17 నుంచి ప్రీ ఆర్డర్ చేయవచ్చు. సెప్టెంబర్ 24 నుంచి అందుబాటులోకి వస్తాయి.
- ఐఫోన్ 13(6.1 అంగుళాలు) ప్రారంభ ధర(iPhone 13 Price in India) రూ.79,900గా ఉంది. ఐఫోన్ 13 మినీ(5.4 అంగుళాలు) ప్రారంభ ధర రూ.69,900గా నిర్ణయించారు. గులాబీ, నీలం, నలుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. స్టోరేజీ వేరియంట్లను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.
- ఐఫోన్ 13 ప్రో(6.1 అంగుళాలు) ప్రారంభ ధర(iPhone 13 Pro Price in India) రూ.1,19,900 కాగా.. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్(6.7 అంగుళాలు) ప్రారంభ ధర రూ.1,29,900గా ఉంది. సియారా బ్లూ, సిల్వర్, గోల్డ్, గ్రాపైట్ రంగుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ బ్యాండ్, బెటర్ కవరేజ్‌తో వీటిలో 5జీ సదుపాయం కల్పించారు.
- యాపిల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ మోడళ్లలో అత్యాధునిక కెమెరా వ్యవస్థను అమర్చినట్లు సంస్థ తెలిపింది. బ్యాటరీ లైఫ్ కూడా గతంలో కంటే బెస్ట్‌గా ఉంటుందని పేర్కొంది. ఇప్పటివరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ ఇదేనని చెప్పుకొచ్చింది.
- ఈ ఫోన్లలో ఉన్న కొత్త కెమెరా వ్యవస్థ అత్యాధునిక ఫొటోగ్రఫీ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. మెరుగైన టెలిఫొటో జూమ్, మాక్రో ఫొటోగ్రఫీ, ఫొటోగ్రఫిక్ స్టైల్స్, సినీమేటిక్ మోడ్, ప్రోరిజల్యూషన్, డాల్బీ విజన్ వీడియో వంటి ఫీచర్లు ఉన్నాయి.
- ఈ మోడళ్లలో ఉపయోగించిన 'సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే విత్ ప్రో మోషన్' అత్యత్తమ డిస్ప్లే అని సంస్థ తెలిపింది. స్క్రీన్‌పై కంటెంట్‌కు ఇంటెలిజెన్స్ రెస్పాన్స్‌తో పాటు అధ్బుత గ్రాఫిక్స్‌తో సరికొత్త అనుభూతి పొందుతారని చెప్పింది.
- ఐఫోన్ 13 సిరీస్‌తో పాటు కొత్త ఐపాడ్(9వ జనరేషన్) మోడల్‌ను కూడా యాపిల్ ప్రకటించింది. ఏ13 బయోనిక్ చిప్‌లతో రూపొందించిన వీటి బ్యాటరీ లైఫ్ రోజంతా ఉంటుంది. ధర రూ.30,900గా ఉంది.
- యాపిల్ వాచ్ సిరీస్ 7 కూడా ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి వస్తుంది. ఈ వాచ్ డిస్‌ప్లేను పూర్తిగా మార్చారు. కొత్త తెర పెద్దగా, మరింత టెక్స్ట్‌ను చూపించడానికి వీలుంది. పూర్తి స్థాయి కీబోర్డును సపోర్ట్ చేయనుంది. ఈ వాచ్‌లు అయిదు రంగుల్లో లభించనున్నాయి. 399 డాలర్ల నుంచి వీటి ధరలు ప్రారంభమవుతాయి.
- యాపిల్ సంస్థకు భారత విపణి కీలకంగా మారింది. లాటిన్ అమెరికా దేశాలతో పాటు ఇక్కడ లభించే ఆదరణలో ఆ సంస్థ జూన్ త్రైమాసిక వృద్ధి రెండంకెలు దాటి 81.4 బిలయన్ డాలర్లకు చేరింది. అందుకే భారత్‌తో శాంసంగ్, వన్‌ప్లస్‌కు పోటీగా అవతరించాలని వినియోగదారుల కోసం కొత్త మోడళ్లను తీసుకొస్తోంది.
ఇదీ చదవండి: రూ.20 వేల లోపు బెస్ట్ గేమింగ్ స్మార్ట్ఫోన్లు ఇవే!