ETV Bharat / science-and-technology

ఇన్​స్టాగ్రామ్​లో మీ లైకులను దాచుకోవచ్చు! - ఇన్​స్టాగ్రమాల్లో లైక్​లు

సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు అప్​డేట్​ అవుతుండే సామాజిక మాధ్యమం ఇన్​స్టాగ్రామ్​. మొదట కేవలం ఫోటోలకే పరిమితమైన ఈ యాప్ ప్రస్తుతం వీడియోలు, రీల్స్​లతో అదరగొడుతోంది. అయితే ఈ సారి వాటికి వచ్చే లైక్​ల ఫీచర్​ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది ఇన్​స్టాగ్రామ్​. లైక్​ కౌంట్​కు సంబంధించిన నంబర్​.. కనిపించాలా? వద్దా? అనే సదుపాయాన్ని వినియోగదారునికి కల్పించనుంది.

Instagram ,  new 'like' options
ఇన్​స్టాగ్రామ్​లో మీ లైకులను దాచుకోవచ్చు!
author img

By

Published : Apr 17, 2021, 4:41 PM IST

ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ఇన్​స్టాగ్రామ్​ లైక్​ల కౌంట్​ను హైడ్​ చేసేందుకు అవకాశం కల్పించనుంది. అయితే అది పూర్తిగా యూజర్​కు సంబంధించిన విషయమని తెలిపింది. దీంతో వినియోగదారుడు..​ తనకు కావాలంటే లైక్​లను ఇతరులకు కనిపించకుండా హైడ్​ చేయవచ్చు, లేకుంటే ఓపెన్​లో అయినా పెట్టుకోవచ్చు.

ప్రస్తుతానికి ఈ సౌకర్యాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్​ మరింత ప్రజాదరణ పొందితే.. ఫేస్​బుక్​ కూడా అమలు చేసే అవకాశం లేకపోలేదని మాషబుల్​ ఇండియా ఏఎఫ్​పీ రిపోర్ట్​లో తెలిపింది.

"ప్రస్తుతానికి లైక్​ కౌంట్​ను హైడ్​ చేసే ఫీచర్​ను ఇన్​స్టాగ్రామ్​లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నాం. ఇదే మంచి ఆదరణ పొందితే.. ఫేస్​బుక్​లో కూడా పరిచయం చేస్తాం. ఇది వ్యక్తుల మధ్య అసమానతలను తొలగిస్తుందని అనుకుంటున్నాం. లైక్​ కౌంట్​ కనిపిస్తే ఏది ఎంత పాపులర్​ అయ్యిందో తెలుస్తుంది."

-ఫేస్​బుక్​ అధికార ప్రతినిధి.

లైక్​ కౌంట్​ను తీసివేయడానికి గల ముఖ్యకారణం వ్యక్తుల మధ్య పోటీని, పోలికను తొలగించడమని మాషబుల్​ ఇండియా అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: ఇన్​స్టా​ సీఈఓ చెప్పిన హిడెన్​ ఫీచర్లు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.