ETV Bharat / science-and-technology

స్వదేశీ పరిజ్ఞానంతో ఆసియాలోనే అతిపెద్ద 'స్పెక్ట్రోగ్రాఫ్​' - ఖగోళ శాస్త్రవేత్తలు

అత్యంత తక్కువ ఖర్చుతో ఆసియాలోనే అతిపెద్ద స్పెక్టోగ్రాఫ్​ను తయారు చేశారు భారత శాస్త్రవేత్తలు. అత్యంత తక్కువ ఫోటాన్​ రేటుతో కాంతిపుంజాలను గుర్తిస్తుంది. ఖగోళ, భౌతిక శాస్త్రంలో ఆత్మనిర్భరత సాధించే లక్ష్యంతో.. ఇలాంటి క్లిష్టమైన పరికరాలు భారత్​లో తయారు చేయటం కీలక ముందడుగుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Optical Spectrograph
స్వదేశీ పరిజ్ఞానంతో ఆసియాలోనే అతిపెద్ద 'స్పెక్ట్రోగ్రాఫ్​'
author img

By

Published : Mar 5, 2021, 7:17 PM IST

అన్ని రంగాల్లో స్వదేశీ పరిజ్ఞానంతో సాంకేతికతను అభివృద్ధి చేయాలన్న ప్రధానమంత్రి పిలుపుతో.. భారత శాస్త్రవేత్తలు ముందుకు సాగుతున్నారు. అతితక్కువ ఖర్చుతో స్వదేశీ స్పెక్ట్రోగ్రాఫ్​ను అభివృద్ధి చేశారు. ఇది విశ్వంలోని సుదూర గెలాక్సీల నుంచి కాంతి వనరులు, నక్షత్ర మండలాల చుట్టూ ఉండే భారీ కృష్ణబిలాల వంటి వాటిని అత్యంత స్పష్టతతో గుర్తిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ​

డాట్​ టెలిస్కోప్​లో ఏర్పాటు

దిగుమతి చేసుకునే వాటితో పోలిస్తే సూమారు 2.5 రెట్లు తక్కువగా రూ.4 కోట్ల వరకు ధర ఉంటుంది. అత్యంత తక్కువ ఫోటాన్​ రేటుతో ఫోటాన్​/సెకండ్​తో కాంతిని గుర్తిస్తుంది. భారత్​లో ఇప్పటికే ఉన్న ఖగోళ స్పెక్ట్రోగ్రాఫ్​లతో పోలిస్తే ఇది అతిపెద్దది. ఉత్తరాఖండ్​లోని నైనితాల్​లో ఏర్పాటు చేసిన 3.6ఎం దేవస్థల్ ఫాస్ట్​​ ఆప్టికల్​ టెలిస్కోప్​(డాట్​)లో అమర్చారు. ఇది దేశంలోనే కాదు ఆసియాలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది.

ఏడీఎఫ్​ఓఎస్​సీగా నామకరణ..

ఇప్పటివరకు ఇలాంటి అత్యంత విలువైన స్పెక్ట్రోస్కోప్​లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుతం స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన స్పెక్ట్రోగ్రాఫ్​కు.. 'ఏరీస్​-దేవస్థల్​ ఫేయింట్​ ఆబ్జెక్ట్​ స్పెక్ట్రోగ్రాఫ్'(ఏడీఎఫ్​ఓఎస్​సీ)గా నామకరణం చేశారు. దీనిని నైనితాల్​లోని ఆర్యభట్ట రీసర్చ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ అబ్జర్వేషనల్​ సైన్స్​(ఏఆర్​ఐఈఎస్​)లో అభివృద్ధి చేశారు.

" ఖగోళ, భౌతిక శాస్త్రంలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంగా ఏడీఎఫ్​ఓఎస్​సీ వంటి కాంప్లెక్స్​ సామగ్రిని భారత్​లో తయారు చేయటం కీలక ముందడుగు. ఏఆర్​ఐఈఎస్​తో పాటు ఇస్రో, పలు సూక్ష్మ, చిన్న పరిశ్రమలు, నేషనల్​ ఇన్​స్టిట్యూట్స్​.. ఈ ప్రాజెక్టు రూపకల్పనలో పలు పరికరాలను తయారు చేయటంలో పాలుపంచుకొని సమర్థవంతమైన భాగస్వామ్యానికి నిదర్శనంగా నిలిచాయి. వాటి సహకారంతో ఏఆర్​ఐఈఎస్​.. స్పెక్ట్రో-పోలారిమీటర్​, హై స్పెక్ట్రాల్​ రెసల్యూషన్​ స్పెక్ట్రోగ్రాఫ్​ వంటి మరింత క్లిష్టమైన పరికరాలను తయారు చేసేందుకు ప్రణాళికలు చేస్తోంది. "

- ప్రొఫెసర్​ దీపాంకర్​ బెనర్జీ, ఏఆర్​ఐఈఎస్​ డైరెక్టర్​. ​

స్పెక్ట్రోగ్రాఫ్​ ఎలా పని చేస్తుంది?

ఖగోళంలోని సుదూర ప్రాంతంలోని వాటిని చూసేందుకు ఈ స్పెక్ట్రోగ్రాఫ్​ ఉపయోగపడనుంది. ప్రత్యేక అద్దాలతో రూపొందించిన లెన్స్​లు ఇందులో ఉంటాయి. వాటిని 5 నానోమీటర్ల​ వరకు చదును చేస్తారు. దాంతో ఖగోళంలోని దృశ్యాలను స్పష్టంగా చూపేందుకు ఉపయోగపడుతుంది. సుదూరంలోని వస్తువుల నుంచి ఫోటాన్స్​ వస్తాయి. వాటిని వివిధ రంగుల్లో అమర్చిన స్పెక్ట్రోగ్రాఫ్​లు కలిగిన టెలీస్కోప్​లు స్వీకరిస్తాయి. చివరకు వాటిని -120 డిగ్రీల సెల్సియస్​లో ఉంచిన ఛార్జ్​ కపుల్డ్​ డివైజ్​(సీసీడీ) సాయంతో ఎలక్ట్రానిక్​ రికార్డెబుల్​ సిగ్నల్స్​గా మారుస్తుంది.

ఇదీ చూడండి: మరో భూగ్రహాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.