Increase Battery Life Android Phones : ఫోన్ వాడాలంటే బ్యాటరీ ముఖ్యం. ఫోనే కాదు.. బ్యాటరీతో నడిచే ఏ డివైజ్ అయినా ఉపయోగించాలంటే దీని సామర్థ్యం తగినంత ఉండాలి. తొందరగా బ్యాటరీ డ్రైన్ అయితే చికాకు వస్తుంది. మారుతున్న కాలానికనుగుణంగా ఫోన్‌లోని అన్ని ఫీచర్లలో భారీ మార్పులు వస్తున్నాయి కానీ బ్యాటరీ విషయంలో పెద్దగా ఛేంజ్ లేదు. బ్యాటరీ పనితీరు సాఫ్ట్వేర్ లక్షణాలపై ఆధారపడే పరిస్థితి ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఈ 14 టిప్స్ పాటించి బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవచ్చు. అవేంటంటే?
1. పవర్ సేవింగ్ ఆన్ చేసుకోవడం
ఫోన్‌లో ఎక్కువ బ్యాటరీని ఆదా చేయడానికి పవర్-సేవింగ్ మోడ్ (బ్యాటరీ సేవర్) ఆన్ చేయడం మొదటి మార్గం. సెట్టింగ్స్ ఓపెన్ చేసి అందులో బ్యాటరీ విభాగానికి వెళ్లి ఆన్ చేసుకోవచ్చు. సామ్సంగ్ ఫోన్లలో దీంతో పాటు దాని కింద ఉండే 5జీ టర్న్ ఆఫ్, బ్రైట్‌నెస్‌ని సాధారణం కంటే 10 శాతం తగ్గించడం, సీపీయూ స్పీడ్‌ని 70 శాతానికి పరిమితం చేసుకోవాలి. వీలుని బట్టి ఇతర సెట్టింగ్స్‌ను ఛేంజ్ చేసుకోవాలి.
2. లొకేషన్ సర్వీసు ఆఫ్ చేసుకోవడం
లొకేషన్ సర్వీసులను ఆఫ్ చేసుకోవడం వల్ల బ్యాటరీ లైఫ్ ఆదా చేసుకోవచ్చు. దీనికి తోడు అవసరమైన యాప్స్‌కి మాత్రమే లొకేషన్ పర్మిషన్ ఇచ్చి మిగతా వాటికి అనుమతి రద్దు చేయాలి. ఇవి బ్యాగ్రౌండ్లో లొకేషన్ ఉపయోగించుకోవడం వల్ల బ్యాటరీ లైఫ్‌పై ఎఫెక్ట్ పడుతుంది. దీనికోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి లొకేషన్ > యాప్ పర్మిషన్స్‌కి వెళ్లి ఏయే యాప్‌కు పర్మిషన్ ఇచ్చారో తెలుసుకోవచ్చు.
3. డార్క్ మోడ్‌ని ఉపయోగించడం
మీ ఫోన్ AMOLED డిస్ ప్లే ఉంటే డార్క్ మోడ్‌ను ఉపయోగించడం వల్ల బ్యాటరీ లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఫోన్‌లోని పిక్సెల్స్, బ్యాగ్రౌండ్‌ను డిసేబుల్ చేస్తుంది. దీంతో పాటు డార్క్ వాల్ పేపర్, సిస్టంలోని డార్క్ థీమ్ వినియోగం, వాట్సాప్, యూట్యూడ్, ట్విట్టర్ (X), జీమెయిల్ లాంటి అప్లికేషన్లకు డార్క్ థీమ్ అప్లై చేసి వాడుకోవాలి. ఫలితంగా బ్యాటరీ తక్కువ వినియోగం అవుతుంది.
4. ఆటోమేటిక్ వైఫై టర్న్ ఆఫ్
ఆండ్రాయిడ్ ఓరియో వెర్షన్ రిలీజైనప్పటి నుంచి ఆటోమేటిక్ వైఫై ఆప్షన్ వచ్చింది. గతంలో మనం ఏదైనా వైఫై నెట్ వర్క్ కోసం వెతికినప్పుడు మాత్రమే వైఫ్ ఆన్ చేయాల్సి ఉండేది. కానీ తర్వాత కాలంలో ఏదైనా నెట్ వర్క్ అందుబాటులో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా వైఫై ఆన్ అవుతుంది. దీన్ని ఆఫ్ చేసుకోవడానికి Settings > Connections > Wi-Fi కి వెళ్లి Advanced మెనూ సెలెక్ట్ చేసుకుని Turn on Wi-Fi automatically పై క్లిక్ చేయాలి.
5. బ్యాక్‌గ్రౌండ్ రన్నింగ్ యాప్ రిస్ట్రిక్ట్
చాలా యాప్‌లు ఉపయోగించి వదిలేసిన తర్వాత కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటాయి. ఇలా బ్యాక్‌గ్రౌండ్‌లో నడిచే అప్లికేషన్ల వల్ల బ్యాటరీ డ్రైన్ అవుతుంది. వీటిని నియంత్రించాలి. దీనికోసం Settings > Apps ఓపెన్ చేసి మీకు నచ్చిన యాప్‌ను ఎంచుకోండి. తర్వాత దాని కింద యాప్ ఇన్ఫో ఉంటుంది. అందులో Battery పై క్లిక్ చేసి బ్యాగ్రౌండ్ మేసేజ్‌ని రిస్ట్రిక్ట్ చేయవచ్చు. కొంచెం పాత మోడళ్లు వాడే వారు.. Greenify అనే థర్డ్ పార్టీ యాప్‌ని ఇన్స్టాల్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్‌గా వాటిని రిస్ట్రిక్ట్ చేస్తుంది.
6. స్క్రీన్ పిక్సెల్స్ తగ్గించడం
Pixoff అనే థర్డ్-పార్టీ యాప్ ద్వారా మాన్యువల్‌గా పిక్సెల్‌లను స్విచ్ ఆఫ్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ సేవ్ చేయవచ్చు. దీని వల్ల కొంత క్వాలిటీ కోల్పోతారు. కానీ మీరు 1080 పిక్సెల్ లేదా HD రిసొల్యూషన్లో చూసినప్పుడు మినహాయించి మిగతా వాటిల్లో పెద్దగా తేడా ఏం అనిపించదు. సామ్ సంగ్ వంటి కొన్ని కంపెనీలు డిస్ ప్లే రిసొల్యుషన్ని తగ్గించే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
7. బ్యాక్‌గ్రౌండ్ డేటా ఆక్సెస్ డిసేబుల్ చేయడం
బ్యాక్‌గ్రౌండ్‌లో డేటా (ఇంటర్నెట్) ఉపయోగించుకునే అనవసర అప్లికేషన్లకు ఇంటర్నెట్ను డిసేబుల్ చేయాలి. యాప్స్‌కు నెట్ కనెక్షన్ లేకపోతే అవి కొత్త ఫైల్స్ డౌన్లోడ్ చేయలేవు. బ్యాగ్రౌండ్లో రన్ కాలేవు. ఫలితంగా బ్యాటరీ లైఫ్ సేవ్ అవుతుంది. ఇది ఆఫ్ చేయడానికి Settings > Apps కి వెళ్లి ఏదోఒక యాప్ సెలెక్ట్ చేయండి. అక్కడ Usage పై క్లిక్ చేసి Mobile data ని ఎంచుకుంటే Allow background data usage ని ఆఫ్ చేయండి.
8. అనవసర యాప్‌లు తీసేయండి
మీరు ఎక్కువగా ఉపయోగించని యాప్ ఏదైనా ఉన్నట్లయితే, దాన్ని అన్ఇన్‌స్టాల్ చేయండి. ఎప్పుడో అవసరం వచ్చిందని దాన్ని ఇన్స్టాల్ చేసుకుని తర్వాత వాడని యాప్స్ ఉంటాయి. అలాంటి వాటిని తీసేయడం వల్ల బ్యాటరీ సేవ్ అవుతుంది. తీసేయడానికి వీలు లేని ఇన్ బిల్ట్‌గా వచ్చిన మరికొన్ని యాప్స్‌ను ఫోర్స్ స్టాప్ చేయడం మంచిది.
9. గూగుల్ అసిస్టెంట్ డిసేబుల్ చేయడం
ఈజీ యూసేజ్ కోసం చాలా మంది గూగుల్ అసిస్టెంట్‌ను వాడతారు. కానీ ఇది అధిక బ్యాటరీని ఖర్చుచేస్తుందని మీకు తెలుసా ? అందుకే మీరు దాన్ని పెద్దగా వినియోగించకపోతే డిసేబుల్ చేయడం ఉత్తమం. దీనికోసం Settings > Google Assistant > General లోకి వెళ్లి Google Assistant ని టర్న్ ఆఫ్ చేయండి. లేదా ఆ అసిస్టెంట్ నే ఉపయోగించి "Hey Google, turn off Google Assistant" అని చెప్పండి. తర్వాత Assistant settings ఓపెన్ Google Assistant ఆఫ్ చేయండి.
10. లైట్ యాప్స్ వినియోగం
ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను పెంచే మరో పద్ధతి లైట్ యాప్స్ ఉపయోగించడం. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్స్ అధిక స్టోరేజీని ఆక్రమించుకుంటాయి. వీటికి ప్రత్యమ్నాయంగా తక్కువ స్టోరేజీ ఉండే లైట్ యాప్స్ తయారు చేశారు. అవి తక్కువ వనరుల్ని వినియోగించుకుంటాయి. దాని వల్ల మీ ఫోన్‌పై పెద్ద భారం పడదు. ఫలితంగా బ్యాటరీ లైఫ్ సేవ్ అవుతుంది.
11. ఆటో- సింక్ ఆపేయడం
కొన్ని యాప్‌లు ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా డేటా సింక్ అయి కొత్త కంటెంట్ వస్తుంది. దీనికోసం మీకు కొత్త సమాచారాన్ని అందించడానికి యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం వాటికవే రిఫ్రెష్ చేసుకుంటాయి. దీని వల్ల ఛార్జింగ్ ఖర్చవుతుంది. అందుకే ఆటో-సింక్‌ను ఆఫ్ చేయాలి. ఏదైనా యాప్ తెరిచి, మాన్యువల్‌గా రిఫ్రెష్ చేసినప్పుడు మాత్రమే మీకు కొత్త కంటెంట్ కనిపిస్తుంది. దీనికోసం Settings > Accounts and backup > Manage accounts లోకి వెళ్లి Auto sync data ని ఆఫ్ చేయాలి.
12. టర్న్ ఆఫ్ నియర్ బై డివైజ్ స్కానింగ్
మన చుట్టు పక్కల ఉన్న ఇయర్‌బడ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, బ్లూటూత్ స్పీకర్ లాంటి డివైజ్‌లను కనెక్ట్ చేసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. దీన్ని ఆన్‌లో ఉంచడం వల్ల స్కానింగ్‌కు బ్యాటరీ వినియోగం అవుతుంది. ఒక్కసారి వాటికి కనెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని టర్న్ ఆఫ్ చేయడం వల్ల బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు. దీనికోసం settings > Connections > More connection settings వెళ్లి Nearby device scanning ని ఆఫ్ చేయాలి.
13. స్క్రీన్ టైమౌట్ తగ్గించడం
మన ఫోన్‌ను ఎంతసేపు ఆన్‌లో ఉంచాలన్నదే స్క్రీన్ టైమౌట్ ఆప్షన్. మనం ఫోన్ వాడకుండా పక్కన పెట్టినప్పుడు ఈ టైమ్ ఎక్కువ సమయం ఉంటే అప్పటిదాకా ఫోన్ డిస్ ప్లే ఆన్లోనే ఉంటుంది. ఫలితంగా బ్యాటరీ ఎక్కువగా ఖర్చవుతుంది. అందుకే ఈ సమయాన్ని తగ్గించాలి. దీనికోసం Settings > Display > Screen timeout పై క్లిక్ చేసి 1 minute లేదా అంతకంటే తక్కువ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
14. ఆటోమేటిక్ బ్రైట్‌నెస్ ఎనేబుల్ చేసుకోవడం
ఫోన్ బ్రైట్‌నెస్ స్థాయిని తగ్గించడం వల్ల దాని బ్యాటరీ జీవితాన్ని ఆదా చేయవచ్చు. దాన్ని ప్రతి సారీ మాన్యువల్‌గా అడ్జస్ట్ చేయడం అంటే కష్టం. అందుకు ఆటోమేటిక్ బ్రైట్ నెస్ ఫీచర్‌ని ఎనేబుల్ చేసుకోవాలి. శామ్‌సంగ్ ఫోన్‌లలో అడాప్టివ్ బ్రైట్‌నెస్ అని పిలుస్తారు. దీన్ని ఆన్ చేసుకోవడానికి Settings > Display కి వెళ్లి Adaptive brightness ని ఆన్ చేసుకుంటే సరి.
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో బ్యాటరీ లైఫ్‌ను మెరుగు పర్చడానికి పైన చెప్పిన లాంటి పనులెన్నో చేయవచ్చు. మంచి బ్యాటరీ లైఫ్ కోసం ఎప్పుడూ బ్యాటరీ సేవర్‌ను వాడాలి. ఫోన్‌ను వీలైనంత తక్కువ సేపు వినియోగించాలి. ఆ సమయంలో ఇంటర్నెట్ ఆఫ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్లు రావు. ఫలితంగా వాటి వల్ల మీరు మళ్లీ దాన్ని ముట్టరు.
అదిరే ఫీచర్లతో రెడ్మీ 13సీ 5జీ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ - ధర ఎంతంటే?
వన్‌ప్లస్ 12 ఫోన్ లాంఛ్ - స్నాప్‌డ్రాగన్ జెన్ 3 చిప్సెట్ సహా సూపర్ ఫీచర్స్ - ధర ఎంతంటే?