ETV Bharat / science-and-technology

సరికొత్తగా 'ఐమెసేజ్​'.. మరిన్ని నయా ఫీచర్లతో... - ఐమెసేజ్​ ఐఓఎస్​

Imessage New Features : ఐఫోన్‌ యూజర్లకు ఐమెసేజ్‌ సుపరిచితమే. రోజుకో నయా ఫీచర్​తో ఆకట్టుకుంటున్న ఈ ఐమేసేజ్​.. ఐఓఎస్‌ 16తో మరింత ట్రెండీగా మారింది.. పాత ఫీచర్లు ఉన్నప్పటికి కొత్తవీ సైతం అలరిస్తున్నాయి. ఓ సారి వాటిని చూద్దామా!

iMessage  Latest Version Updates
iMessage Latest Version Updates
author img

By

Published : Sep 21, 2022, 9:01 AM IST

Imessage New Features : ఐఫోన్​ యూజర్లు ఎంతో ఇష్టంగా వాడే ఐమెసేజ్​ సరికొత్త రూపంలో రానుంది. ఐఓఎస్‌ 16 రాకతో మరిన్ని సొబగులూ అద్దుకుంది. పాత ఫీచర్లతో పాటు కొత్తవీ అలరిస్తున్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందామా.

పంపిన మెసేజ్‌ల సవరణ
కొన్నిసార్లు మెసేజ్‌ పంపిన తర్వాత 'అయ్యో.. తప్పులు దొర్లాయే' అనిపించొచ్చు. చెప్పాల్సిన విషయాన్ని 'పూర్తిగా వివరించలేకపోయామే' అనుకోవచ్చు. ఇప్పుడిక అలాంటి ఇబ్బందేమీ ఉండదు. ఐఓఎస్‌ 16 పుణ్యమాని పంపించిన మెసేజ్‌ను ఎడిట్‌ చేసి, తిరిగి పంపించుకోవచ్చు. ఇలా ఒకో మెసేజ్‌ను ఐదు సార్లు సవరించుకోవచ్చు. మార్చిన ప్రతిసారీ ఆ విషయం అవతలి వారికీ తెలిసిపోతుంది. దీన్ని వాడుకోవటం పెద్ద కష్టమేమీ కాదు.

  • సవరించాలని అనుకునే మెసేజ్‌ మీద కాసేపు అలాగే నొక్కిపడితే మెనూలో 'ఎడిట్‌' ఆప్షన్‌ కనిపిస్తుంది. నీలి బబుల్‌ తెల్లగా మారుతుంది. అప్పుడు అనుకున్న విధంగా సవరించుకోవచ్చు. తర్వాత చెక్‌ బటన్‌ను ట్యాప్‌ చేసి, రీసెండ్‌ చేసుకోవాలి. మార్చిన మెసేజ్‌ కింద నీలిరంగులో ఎడిటెడ్‌ లేబుల్‌ కనిపిస్తుంది. దాన్ని నొక్కితే అంతకు మునుపు వర్షన్లనూ చూసుకోవచ్చు. అయితే అవతలివారికీ మునుపటి మెసేజ్‌లు కనిపిస్తాయన్న విషయం మరవరాదు. ఐఓఎస్‌ 16 వర్షన్‌ లేనివారికైతే వరుసగా మెసేజ్‌లు పంపించినట్టు అనిపిస్తుంది కూడా.

పంపిన మెసేజ్‌ అన్‌డూ: ఒకరికి పంపాల్సిన మెసేజ్‌ను పొరపాటున మరొకరికి పంపారా? చెప్పకూడని విషయాన్ని పంపించానని అనిపించిందా? దీనికి చింతించాల్సిన పనిలేదు. పంపించిన మెసేజ్‌ను అన్‌డూ చేయొచ్చు. తిరిగి వెనక్కి తీసుకోవచ్చు. ఐఓఎస్‌ 16తో అందుబాటులోకి వచ్చిన మరో ఫీచర్‌ ఇది. మెసేజ్‌ను పంపించాక రెండు నిమిషాల్లోపు దాన్ని అన్‌డూ చేసుకోవచ్చు.

  • దీనికోసం మెసేజ్‌ మీద కాసేపు నొక్కి పట్టి, మెనూలో 'అన్‌డూ సెండ్‌' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అంతే బెలూన్‌ పగిలిపోయినట్టుగా యానిమేషన్‌ రూపంలో మెసేజ్‌ అదృశ్యమైపోతుంది. మనకు, అవతలివారికి ఆ మెసేజ్‌ను అన్‌సెంట్‌ చేసినట్టు నోట్‌ అందుతుంది. అవతలివారు ఐఓఎస్‌ 16కు అప్‌డేట్‌ కాకపోతే మాత్రం వారికి ఆ మెసేజ్‌ కనిపిస్తూనే ఉంటుంది.

మెసేజ్‌లలో షేర్‌ ప్లే
యాపిల్‌ ఇప్పటికే ఫేస్‌టైమ్‌లో షేర్‌ప్లేను ప్రవేశపెట్టింది. ఇప్పుడు దీన్ని మెసేజెస్‌కూ విస్తరించింది. చూస్తున్న వీడియో, వింటున్న సంగీతం, ఆడుతున్న గేమ్స్‌ను ఫోన్‌ ద్వారా ఇతరులతో పంచుకోవటం దీని ఉద్దేశం. దీన్ని ఉపయోగించుకోవాలంటే షేర్‌ప్లేను సపోర్టు చేసే యాప్‌ను ఓపెన్‌ చేయాలి.

  • ఇది ప్రస్తుతానికి స్పోటిఫై, యాపిల్‌ మ్యూజిక్‌, యాపిల్‌ టీవీ, డిస్నీ ప్లస్‌ వంటి కొన్ని యాప్స్‌లోనే అందుబాటులో ఉంది. వీటిల్లో దేంట్లోనైనా 'షేర్‌ బటన్‌'ను తాకితే మోర్‌, షేర్‌ప్లే ఆప్షన్లు కనిపిస్తాయి. తర్వాత కాంటాక్ట్‌ నంబరును ఎంచుకొని, మెసేజ్‌స్‌ ద్వారా పంపించుకోవచ్చు. అప్పటికప్పుడు చూస్తున్న, వింటున్న అంశాల గురించి చర్చించుకోవచ్చు.
    iMessage  Latest Version Updates
    చదివినట్టు తెలియకుండా..

చదివినట్టు తెలియకుండా..: ఏదో మెసేజ్‌ పంపిస్తాం. దాన్ని అవతలివారు చూశారో లేదోనని కంగారు పడుతుంటాం. ఇలాంటి సమయాల్లోనే రీడ్‌ రిసిప్ట్స్‌ ఆప్షన్‌ బాగా ఉపయోగపడుతుంది. అవతలివారు ఫోన్‌ స్విచాఫ్‌ చేసినా, కావాలనే మెసేజ్‌లను పక్కన పెడుతున్నా దీని ద్వారా తెలిసిపోతుంది. అయితే కొన్నిసార్లు మనం చదివామో లేదో అవతలివారికి తెలియకూడదని భావిస్తుంటాం. ఇందుకోసం రీడ్‌ రిసిప్ట్స్‌ను ఆఫ్‌ చేసుకునే సదుపాయం ఉంది. దీన్ని ఆయా వ్యక్తులకే పరిమితం చేసుకోవచ్చు. లేదంటే అందరికీ వర్తింపజేయొచ్చు. దీంతో అందిన మెసేజ్‌లను మనం చదివామో, లేదో అవతలివారికి తెలియదు.

  • కన్వర్జేషన్‌లోనే అయితే వాటిని ఓపెన్‌ చేసి, టాప్‌ బార్‌ మీద నొక్కి 'సెండ్‌ రీడ్‌ రిసిప్ట్స్‌' ఆప్షన్‌ను ఆన్‌ లేదా ఆఫ్‌ చేసుకోవచ్చు. ఇది మొత్తానికి వర్తించాలంటే ఐఫోన్‌ సెటింగ్స్‌ ద్వారా మెసేజ్‌స్‌లోకి వెళ్లి 'సెండ్‌ రీడ్‌ రిసిప్ట్స్‌' ఆఫ్‌ చేసుకోవాలి.
    iMessage  Latest Version Updates
    డిలీట్‌ మెసేజ్‌లు వెనక్కి

డిలీట్‌ మెసేజ్‌లు వెనక్కి: ఏదో ముఖ్యమైన మెసేజ్‌. పొరపాటు డిలీట్‌ చేశాం. తిరిగి చూసుకోవాలంటే? ఐఓఎస్‌ 16 కొత్త ఫీచర్‌ దీనికి వీలు కల్పిస్తుంది. ఇది ట్రాష్‌ ఫోల్డర్‌ మాదిరిగా డిలీట్‌ చేసిన మెసేజ్‌లను తాత్కాలికంగా నిల్వ చేసుకుంటుంది. వీటిని వెనక్కి తీసుకోవాలంటే-

  • మెసేజ్‌స్‌ ప్రధాన స్క్రీన్‌లోకి వెళ్లి 'ఎడిట్‌' మీద ట్యాప్‌ చేయాలి. 'షో రీసెంట్లీ డిలీటెడ్‌'ను ఎంచుకోవాలి. అప్పుడు డిలీట్‌ అయిన మెసేజ్‌లు కనిపిస్తాయి.
  • ఇవి కేవలం 30 రోజుల వరకే ఉంటాయి. తర్వాత ఎరేజ్‌ అవుతాయి. అవి ఎరేజ్‌ కావటానికి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయనేదీ మెసేజ్‌ల పక్కన కనిపిస్తుంటుంది. ఆయా మెసేజ్‌లను ఎంచుకొని 'రికవర్‌' చేసుకోవచ్చు. శాశ్వతంగా కనిపించొద్దని అనుకుంటే 'డిలీట్‌' బటన్‌ను నొక్కాలి. గత ఐఓఎస్‌ వర్షన్లలోనూ డిలీట్‌ అయిన మెసేజ్‌లను వెనక్కి తీసుకునే సదుపాయం ఉంది గానీ బ్యాకప్స్‌ను రిస్టోర్‌ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడిది చాలా తేలికైన పనిగా మారిపోయింది.
    iMessage  Latest Version Updates
    ఆండ్రాయిడ్‌ మెసేజ్‌లకు స్పందించటం

ఆండ్రాయిడ్‌ మెసేజ్‌లకు స్పందించటం: యాపిల్‌ మెసేజ్‌ యాప్‌ ద్వారా ఆండ్రాయిడ్‌ పరికరాలకు టెక్స్ట్‌ సందేశాలు పంపటం, అందుకోవటం క్రమంగా మెరుగవుతూ వస్తోంది. తాజాగా ఆండ్రాయిడ్‌ పరికరాల నుంచి అందిన సందేశాలకు ఎమోజీలతోనూ స్పందించే సదుపాయం కలిగించారు. ఐఫోన్ల నుంచి వచ్చిన సందేశాలకు స్పందించినట్టుగానే ఈ ప్రక్రియ ఉంటుంది.

  • ప్రత్యుత్తరం ఇవ్వాలని అనుకునే మెసేజ్‌ మీద కాసేపు అలాగే నొక్కి పట్టి, మెనూ ద్వారా ఎమోజీ రిప్లయ్‌ను ఎంచుకోవాలి. గుండె, థమ్స్‌ ఆప్‌, థమ్స్‌ డౌన్‌, హాహా, ప్రశ్నార్థకం, రెండు ఆశ్చర్యార్థకాలు.. ఇలా అవసరమైన ఎమోజీలతో స్పందనలు తెలియజేయొచ్చు.
    iMessage  Latest Version Updates
    విషయం మీద శీర్షిక

విషయం మీద శీర్షిక: మామూలుగా మెసేజ్‌లకు శీర్షికలేవీ ఉండవు. కానీ బోల్డ్‌ హెడింగ్‌ను యాక్టివేట్‌ చేసుకుంటే మెసేజ్‌ మీద ఓ ప్రత్యేక పంక్తి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సూచనల వంటివి పంపించే సమయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. బోల్డ్‌ హెడింగ్‌ సదుపాయాన్ని ఎనేబుల్‌ చేసుకోవటానికి-

  • ఐఫోన్‌ సెటింగ్స్‌ ద్వారా మెసేజెస్‌లోకి వెళ్లి ‘షో సబ్జెక్ట్‌ ఫీల్డ్‌’ స్విచ్‌ను ఆన్‌ చేసుకోవాలి. దీంతో ఏదైనా కొత్త మెసేజ్‌ను టైప్‌ చేస్తున్నప్పుడు సబ్జెక్ట్‌, ఐమెసేజ్‌ బాక్సులు రెండూ కనిపిస్తాయి. మెసేజ్‌లో పంక్తి బోల్డ్‌గా కనిపిస్తుంది. శీర్షిక వద్దనుకుంటే సబ్జెక్ట్‌ బాక్స్‌లో టైప్‌ చేస్తే చాలు. మామూలు మెసేజ్‌ మాదిరిగానే పంపించుకోవచ్చు.

ఇదీ చదవండి: వాట్సాప్ యూజర్లకు గుడ్​న్యూస్.. కొత్తగా మెసేజ్ ఎడిట్ ఫీచర్!

అదిరే ఫీచర్లతో ఐఫోన్​ 14 రిలీజ్​.. ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.