ETV Bharat / science-and-technology

ఏడు ప్రధాన అంశాలపై ఏడాది కాలంగా 271 ప్రాజెక్టులు - కరోనా మహమ్మారి

కరోనా మహమ్మారి అంతానికి ఐఐటీలు, ఎన్‌ఐటీలు ఏడాది కాలంగా పరిశోధనల రూపేణా తమవంతు పోరాటం చేస్తున్నాయి. మహమ్మారి కట్టడికి అనువుగా వైద్యులు, పోలీసులు, ఔషధ రంగానికి అవసరమైన పరికరాలు రూపొందిస్తున్నాయి. వైరస్‌ బారిన పడకుండా సామాన్యుడికి తక్కువ ధరలో వ్యక్తిగత రక్షణ పరికరాలు సమకూర్చేందుకు పాటుపడుతున్నాయి. కరోనా తీరుతెన్నులు, తగ్గుదల, వ్యాప్తి వంటి అంశాలపై కృత్రిమ మేధ, గణిత నమూనాలను వినియోగించి ముందుగానే అంచనా వేస్తూ ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తున్నాయి.

iit-nits-struggle-from-one-year-to-end-corona
ఏడు ప్రధాన అంశాలపై... ఏడాది కాలంగా 271 ప్రాజెక్టులు
author img

By

Published : May 13, 2021, 8:07 AM IST

ఏప్రిల్‌లో శ్రీకారం..

2020 మార్చిలో కరోనా వైరస్‌ దేశవ్యాప్తంగా విస్తరించగా ఐఐటీలు ఏప్రిల్‌ నుంచే పరిశోధనకు నడుం బిగించాయి. అప్పుడు 190 ప్రాజెక్టులు చేపట్టగా.. ఇప్పుడు వాటి సంఖ్య 271కి చేరింది. ఎన్‌ఐటీలు కూడా 176 ప్రాజెక్టులు చేపట్టి పరిశోధన కొనసాగిస్తున్నాయి. ఐఐటీ గణిత ఆచార్యుడు విద్యాసాగర్‌ మాట్లాడుతూ.. కాన్పుర్‌ ఐఐటీతో కలిసి.. కరోనా రెండో దశ తీవ్ర స్థాయికి ఎప్పుడు చేరుకుంటుందో, ఎన్ని కేసులు వస్తాయో గణిత నమూనా ఆధారంగా అంచనా వేశామన్నారు. తదనుగుణంగా ఇప్పుడదే పరిస్థితి ఉందని చెప్పారు. మే 15-18 మధ్య తీవ్ర స్థాయికి చేరుకుంటుందని, క్రియాశీలక కేసులు 35 లక్షలు ఉంటాయని అంచనా వేశామన్నారు.

ఇవే అంశాలు

కరోనాపై క్రియాశీలక పరిశోధన

సంచాలకుడు, ఐఐటీ హైదరాబాద్‌

మా ఆచార్యులు తయారుచేసిన శానిటైజర్‌ను రోజుకు 200 లీటర్ల వంతున ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నాం. అవసరమైన వారికి 5,500 మాస్కులు, పోలీసు, వైద్య, ఇతర ప్రభుత్వ సిబ్బందికి 10 వేల ఫేస్‌షీల్డ్‌లు పంపిణీ చేశాం. పరిశోధనలోనూ ఐఐటీహెచ్‌ క్రియాశీలకంగా పనిచేస్తోంది. ఎన్‌95కు సమానమైన తక్కువ ఖరీదైన యూఎస్‌9 మాస్కును రూపొందించాం. అలాగే పోర్టబుల్‌ వెంటిలేటర్‌నూ తయారు చేశాం. ఇటీవలే హ్యాండ్‌, మాస్కు శానిటైజర్లతోపాటు పరిసరాలను క్రిమిరహితం చేసే యాంటీవైరస్‌ కోటింగ్‌ సొల్యూషన్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి పొఖ్రియాల్‌ ఆవిష్కరించారు. ఈ ఉత్పత్తులు కొన్ని సూపర్‌మార్కెట్లతో పాటు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నాయి.

-- ఆచార్య బీఎస్‌ మూర్తి, సంచాలకుడు, ఐఐటీ హైదరాబాద్‌

ఇదీ చూడండి: 'అవసరమైన దేశాలకు టీకాలను సరఫరా చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.