లగ్జరీ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ యాపిల్.. ఐఫోన్ 12 మోడళ్లను భారత్‌లో తయారు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చైనా నుంచి ఈ మోడళ్ల తయారీని భారత్‌కు తరలించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనంలో పేర్కొంది. చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం వస్తే సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు యాపిల్ ఈ నిర్ణయం తీసుకుందనేది ఆ కథనం సారాంశం.
భారత్‌లో తయారు కానున్న కొత్త మోడళ్లు
భారత్‌లో ఇప్పటికే ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ 11, ఐఫోన్ ఎస్ఈ వంటి మోడళ్లు తయారవుతున్నాయి. ఇప్పుడు ఐఫోన్ 12 ఉత్పత్తిని భారత్‌కు తరలించేందుకు కసరత్తు చేస్తోంది యాపిల్. ఐఫోన్ 12 మినీ మోడల్‌ను కూడా భారత్‌లో తయారు చేయాలని భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు.
ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. 7 శాతం నుంచి 10 శాతం వరకు ఐఫోన్ 12 మోడళ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని చైనా నుంచి భారత్‌కు తరలించనున్నట్లు తెలుస్తోంది.
ఐఫోన్ 12ల తయారీ కూడా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహక (పీఎల్ఐ) పథకం ద్వారా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తయ్యే మోడళ్లను భారత్‌లోనే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే వీలుంది.
దేశీయంగా ఈ మోడళ్లను ఉత్పత్తి చేయడం ద్వారా యాపిల్.. దిగుమతి సుంకాల భారం తగ్గించుకోవచ్చని కూడా భావిస్తోంది. అయితే దేశీయంగా ఐఫోన్ 12ల తయారీతో భారత్‌లో వాటి ధరలు ఏమైనా తగ్గే అవకాశముందా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఇదీ చదవండి:కెయిర్న్‌కు భారత ఆస్తులు సీజ్ చేసే అవకాశం!