ఒకేసారి నాలుగు పరికరాల్లో లాగిన్ అయ్యేలా మల్టీ డివైజ్ ఫీచర్ (Whatsapp Multiple Devices) బీటా వెర్షన్‌ను యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్. స్మార్ట్‌ఫోన్, వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్, పోర్టల్‌లో ఏకకాలంలో లాగిన్ అయ్యి ఉపయోగించుకోవచ్చు. ఇప్పటి వరకు వాటిలో లాగిన్ అవ్వాలంటే ప్రతిసారి మీరు ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి వచ్చేది. అయితే ఆ సంస్థ తీసుకొచ్చిన మరో ఫీచర్‌తో ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ అవసరం లేకుండానే లాగిన్ కావచ్చు!
ఈ ఫీచర్‌లోనూ పర్సనల్ మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్, కాల్స్ లాంటివి ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్తో ఉండనున్నాయని వాట్సాప్ ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో చాట్స్ కూడా పూర్తిగా ప్రైవేట్‌గా ఉంటాయని పేర్కొంది. అయితే ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి స్మార్ట్‌ఫోన్‌కు ఇంటర్నెట్ సౌకర్యం ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. కానీ మీ ఫోన్‌కు 14 రోజులు కంటే ఎక్కువగా నెట్ సౌకర్యం లేకపోతే మిగతా అన్నీ డివైజ్‌లలో వాట్సాప్ అటోమేటిక్‌గా లాగ్అవుట్ కానుంది. స్మార్ట్‌ఫోన్ లేకుండా వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించడం ఎలా? అనేది తెలుసుకుందాం.
స్మార్ట్‌ఫోన్ లేకుండా వాట్సాప్ వెబ్ ఉపయోగించడం ఎలా?
- ముందుగా మీ ఫోన్లో వాట్సాప్‌ను ఓపెన్ చేయండి. స్క్రీన్‌పై కుడి భాగంలో కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయండి.
- లింక్డ్ డివైజస్ పేరుతో ఉండే దానిని క్లిక్ చేయండి. మళ్లీ 'మల్టీ డివైజ్ బీటా' అనే దానిపై క్లిక్ చేయండి. అప్పుడు మీకు వాట్సాప్ నుంచి డిస్ప్లే పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో ఫీచర్, లిమిటేషన్స్, మిగతా విషయాలు ఉంటాయి.
- ఇప్పుడు మీరు కింద ఉండే జాయిన్ 'బీటా వర్షన్' అనే బటన్‌పై క్లిక్ చేయండి. తరువాత ఓపెన్ అయ్యే డైలాగ్ బాక్స్‌లో కంటిన్యూ అనే బటన్‌ను క్లిక్ చేయండి. ఆ తరువాత ప్రతిసారీ చేసినట్లే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వాట్సాప్ వెబ్‌లోకి లాగిన్ అవ్వాలి.
- మీరు ఉపయోగిస్తున్న ఫోన్లో అప్డేట్ అయిన యాప్ ఉంటేనే ఈ ఫీచర్ పనిచేస్తుందని గమనించాలి. అప్డేట్ చేయకుండా ఉన్న పాత ఫోన్లలో ఈ ఫీచర్ పనిచేయదు.
- ఈ ఫీచర్‌తో అనుసంధానం చేసిన డివైజ్‌లలో లైవ్ లొకేషన్ ఆప్షన్ పనిచేయదు. లింక్ ప్రివ్యూలు కూడా కనిపించవు.
ఇదీ చూడండి: కొత్త ఫీచర్లతో వాట్సాప్.. ఇవి తెలుసుకోండి..