How to Use Unsend Email Feature in Gmail on Computer : ఇవాళ మాగ్జిమమ్ నెటిజన్లు జీమెయిల్ వాడుతున్నారు. ఇందులో మీరు కూడా ఉండే ఉంటారు. అందులోని చాలా ఫీచర్లు మీకు తెలిసే ఉంటాయి. ఫైల్ అటాచ్ చేయడం, సెండ్ కొట్టడం, ఎవరితోనైనా చాట్ చేయడం.. ఇలాంటి ఫీచర్స్ మీరు ఉపయోగించే ఉంటారు. కానీ మేం చెప్పే ఈ ఫీచర్ గురించి చాలా మందికి తెలియదు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
How to Unsend an Email in Gmail in Telugu : మన కంపెనీకి సంబంధించి కావొచ్చు.. లేదంటే పర్సనల్ విషయాలు కావొచ్చు.. మూడోకంటికి తెలియకుండా షేర్ చేయాల్సిన విషయాలు ఉంటాయి. అవి కూడా అర్జెంట్‌గా షేర్ చేయాల్సి వస్తే.. హడావిడిగా పని కంప్లీట్ చేస్తాం. ఈ ఆతృతలో.. ఒకరికి పంపాల్సిన మెయిల్(email) మరికొరికి సెండ్ కొట్టేస్తాం. నాలుక కరుచుకునే లోపే.. మెయిల్ వెళ్లిపోతుంది. ఆ తర్వాత అయ్యో అని ఆలోచిస్తూ తలపట్టుకుంటాం. అయితే.. జీమెయిల్లో ఉన్న ఈ ఫీచర్ మిమ్మల్ని ఈ పరిస్థితి నుంచి బయటపడేలా చేస్తుంది. ఇందుకోసం మనం చేయాల్సిందల్లా.. ఈ స్పెషల్ ఫీచర్ సెట్ చేసుకోవడమే.
How to use Undo Send Feature in Gmail : Gmailలో ఉన్న ఆ స్పెషల్ ఫీచర్ పేరు Undo Send. దీని ద్వారా.. మీరు మెయిల్లో ఏదైనా సందేశాన్ని తప్పుగా పంపించినా, లేదంటే మరేదైనా కారణం చేతనైనా.. ఆ మెయిల్ సెండ్ కాకుండా ఆపాలనుకున్నప్పుడు.. Undo send ఫీచర్ ద్వారా మనం వెంటనే రీకాల్ చేసుకోవచ్చు. ఇందుకోసం మనం చేయాల్సిందల్లా Gmail సెట్టింగ్స్ లోకి వెళ్లి Undo sendని ఎనేబుల్ చేయడమే.
How to Use Unsend Email Feature in Gmail on PC : కంప్యూటర్‌లో Gmail Undo Send ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
- మీరు మెయిల్ పంపిన వెంటనే మీ కంప్యూటర్(Computer) స్క్రీన్ దిగువ-ఎడమ వైపున పాప్-అప్ వస్తుంది. అందులో మీరు Undo or View message అనే ఆప్షన్స్ కనిపిస్తాయి.
- ఆ తర్వాత Undo అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అప్పుడు మెయిల్ సెండ్ కాదు. వెనక్కి వచ్చేస్తుంది.
- దాంతో.. ఆ సందేశాన్ని మళ్లీ కంపోజ్ చేయడానికి.. స్క్రీన్ దిగువన కుడి వైపున ఒక విండో కనిపిస్తుంది.
- అయితే.. మీరు మెయిల్ ద్వారా పంపే సందేశాలను ఎంతసేపు undo sendలో ఉంచాలనేది మీ ఇష్ట ప్రకారం సెట్ చేసుకోవచ్చు.
- దానికోసం.. మీ స్క్రీన్ పైన రైట్‌సైడ్ కార్నర్లో ఉన్న Settings (ఇది చిన్న కాగ్ లాగా కనిపిస్తుంది) అనే ఆప్షన్ క్లిక్ చేసి.. ఆ తర్వాత See all settings అనే దానిపై క్లిక్ చేయాలి.
- అప్పుడు Undo Send సెక్షన్ కోసం వెతికి.. దాని పక్కన మీరు నచ్చిన టైమ్ సెట్ చేసుకోవాలి.
- 5, 10, 20, 30 సెకన్ల టైమ్ స్లాట్ చూపిస్తుంది. అంటే.. మీరు మెయిల్ పంపిన తర్వాత.. ఈ టైమ్‌లో రీకాల్ చేయవచ్చన్నమాట.
- కనిష్టంగా 5 సెకన్లు.. గరిష్టంగా 30 సెకన్ల టైమ్ ఉంటది.
- మీకు నచ్చిన టైమ్ సెట్ చేసుకొని.. ఆ తర్వాత 'Save Changes' అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- అంతే మీ కంప్యూటర్లో Undo Send ఫీచర్ సెట్ అయిపోతుంది.
How to Use Unsend Email Feature in Gmail on Mobile : మొబైల్లో అన్‌సెండ్ ఫీచర్ ఎలా సెట్ చేయాలి..?
- మీరు మీ మొబైల్ నుంచి మెయిల్ పంపిన తర్వాత.. పంపిన నోటిఫికేషన్ స్క్రీన్ దిగువన 'Undo option' కనిపిస్తుంది.
- అప్పుడు 'Undo'పై నొక్కాలి. దాంతో సందేశం Send కాదు.
- అలాగే మళ్లీ మనం సందేశాన్ని కంపోజ్ చేయడానికి స్క్రీన్‌పై మెయిల్ కనిపిస్తుంది.
- అయితే.. Undo Send టైమ్ సెట్ చేసుకునే ఆప్షన్ Gmail మొబైల్ యాప్‌లో ప్రస్తుతానికి అందుబాటులో లేదు.
- డీఫాల్ట్‌గా ఉండే 5 సెకన్ల సమయం మాత్రమే మొబైల్లో అందుబాటులో ఉంటుందని గమనించాలి.
ఈ-మెయిల్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా?
Gmail Tips : ఈ సింపుల్ టిప్స్ & ట్రిక్స్ తెలుసా?.. వీటితో మీ పనులు మరింత ఈజీగా!