ETV Bharat / science-and-technology

స్పామ్ కాల్స్​తో ఇబ్బందులా? ఫోన్​లో ఈ సెట్టింగ్స్ మార్చితే సరి! - స్పామ్ కాల్స్ గుర్తింపు

స్పామ్ కాల్స్​ వల్ల ఇబ్బంది పడుతున్నారా? కొత్త నంబరు నుంచి ఫోన్లు చేసి విసిగిస్తున్నారా? అయితే మీ ఫోన్ సెట్టింగ్స్​లో ఈ మార్పులు చేసుకోండి. అప్పుడు స్పామ్ కాల్స్ బెడద నుంచి సులువుగా బయటపడతారు.

spam calls
స్పామ్‌ కాల్
author img

By

Published : Oct 23, 2022, 12:04 PM IST

లోన్‌ కావాలా?, క్రెడిట్‌ కార్డ్‌ ఇస్తామంటూ రోజూ ఎన్నో ఫోన్‌ కాల్స్ వస్తుంటాయి. కొత్త నంబర్‌ నుంచి ఫోన్ రాగానే ఎవరు చేస్తున్నారనే ఆసక్తితో కాల్ అటెండ్ చేస్తాం. స్పామ్‌ కాల్ అని తెలిసి పట్టరానంత కోపం వస్తుంది. అవసరంలేదని చెప్పినా.. పదే పదే ఇలాంటి కాల్స్‌ వస్తుంటే.. ఒకింత అసహనానికి గురవుతాం. మరోవైపు లాటరీ తగిలిందని, మీ క్రెడిట్/డెబిట్ కార్డ్‌ వ్యాలిడిటీ ముగిసిందంటూ మోసపూరిత కాల్స్‌ వస్తుంటాయి. మరి, విసుగు పుట్టించే స్పామ్‌ కాల్స్‌ ఎలా అడ్డుకోవాలి? అసలు స్పామ్‌ కాల్స్‌లో ఎన్ని రకాలున్నాయి? వాటికి చెక్‌ పెట్టేందుకు ఫోన్‌ సెట్టింగ్స్‌లో ఏమేం మార్పులు చేయాలో తెలుసుకుందాం.

స్పామ్‌ కాల్స్‌లో టెలీమార్కెటింగ్‌ కాల్స్‌, రోబో కాల్స్‌, స్పామ్‌ కాల్స్‌ అని మూడు రకాలున్నాయి. స్పామ్‌ కాల్స్‌ కొన్ని యూజర్లను మోసం చూసేందుకు చేస్తుంటారు. వీటి బారి నుంచి బయటపడేందుకు ఆండ్రాయిడ్ యూజర్లకు కాలర్‌ ఐడీ, స్పామ్‌ ప్రొటెక్షన్ అనే రెండు ఫీచర్లను గూగుల్ అందిస్తుంది. యూజర్లు తమ ఫోన్లలో వీటిని ఎనేబుల్‌ చేసి స్పామ్‌ కాల్స్‌ను అడ్డుకోవచ్చని గూగుల్ చెబుతోంది. వీటిని ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దాం.

  • ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫోన్ యాప్‌ ఓపెన్ చేసి కుడివైపు పైన మూడు చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయాలి.
  • అందులో కాలర్‌ ఐడీ అండ్ స్పామ్‌ ప్రొటెక్షన్ అనే ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేస్తే, కింద నిబంధనలకు అంగీకరిస్తున్నారా? అని అడుగుతూ అగ్రీ బటన్‌ చూపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే కాలర్‌ ఐడీ అండ్‌ స్పామ్‌ ప్రొటెక్షన్ ఫోన్‌లో యాక్టివేట్ అవుతుంది.
  • ఈ ఆప్షన్‌ ఎనేబుల్ చేసినా స్పామ్‌ కాల్స్‌ వస్తుంటే.. గూగుల్ మరో ఆప్షన్‌ను సూచిస్తుంది. అదేంటో చూద్దాం.
  • ఫోన్‌ యాప్‌ ఓపెన్‌ చేసి కింద ఉన్న రీసెంట్స్‌ సెక్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీకు వచ్చిన స్పామ్‌ కాల్‌ నంబర్‌పై క్లిక్ చేసి ఫోన్‌, మెసేజ్‌, వీడియో, ఐ అని ఐకాన్స్‌ కనిపిస్తాయి.
  • వాటిలో ఐ ఐకాన్‌పై క్లిక్ చేస్తే బ్లాక్‌, రిపోర్ట్ అని రెండు ఆప్షన్లు ఉంటాయి. స్పామ్‌ కాల్‌ వచ్చిన నంబర్‌ను బ్లాక్ చేయాలంటే బ్లాక్‌ ఆప్షన్‌పై, సదరు నంబరుపై రిపోర్ట్ చేయాలంటే రిపోర్టు ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, దాని నుంచి మీకు ఫోన్‌కాల్స్‌ రావు.

ఇవీ చదవండి: రెడ్‌మీ నుంచి బడ్జెట్‌ ట్యాబ్లెట్‌, ఫీచర్లు చూశారా

వాట్సాప్​ యూజర్లకు గుడ్​న్యూస్.. త్వరలోనే మెసేజ్​ ఎడిట్​ ఫీచర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.