Save Whatsapp Group Contacts : మన జీవితంలో సెల్‌ఫోన్స్ ఒక భాగం అయిపోయాయి. అవి లేకపోతే మనం జీవితమే లేదనే స్థాయికి తీసుకెళ్లిపోయాయి. మన స్నేహితులను, బంధువులను సంప్రదించాల్సి వస్తే మనకు టక్కున గుర్తుకు వచ్చేది వాట్సాప్. సాధారణ సందేశాలతో పోలిస్తే, వాట్సాప్ సందేశాలే ఎక్కువగా చేస్తుంటారు.
Export Whatsapp Group Contacts : అయితే తరచుగా వాట్సాప్ వాడే వారి ఫోన్లలో కాంటాక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ కాంటాక్ట్స్‌ను ఒకేసారి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉందని చాలా మందికి తెలీదు. పని రీత్యా మనం కొన్ని వాట్సాప్ గ్రూప్స్‌లో ఉండవలసి వస్తుంది. అయితే గ్రూప్‌లోని అందరూ మనకు పరిచయం లేకపోవచ్చు. కాబట్టి అందరి నంబర్స్ సేవ్ చేసుకోవడం కొంచెం కష్టం. చిన్న టిప్స్ పాటించడం వల్ల వాట్సాప్ కాంటాక్ట్స్ అన్నిటినీ సులువుగా సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మన ఫోన్ పోయినా, ఎవరైనా హ్యాక్ చేసినా ఒకేసారి మన కాంటాక్ట్స్ అన్నిటికీ ఈ విషయాన్ని సులువుగా తెలియజేయచ్చు.
Whatsapp Group Contacts Limit : క్రోమ్ ఎక్స్టెన్షన్, వాట్సాప్ వెబ్ సాయంతో వాట్సాప్ గ్రూప్ కాంటాక్ట్స్‌ను ఎక్స్పోర్ట్ చేయడం ఎలా అంటే.. కంప్యూటర్లో వాట్సాప్ వెబ్ ద్వారా గ్రూప్ చాట్ కాంటాక్ట్స్‌ను వాట్సాప్ నుంచి స్ప్రెడ్‌షీట్‌లో కాపీ చేయవచ్చు. ఇలా చేయడానికి గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఒక మార్గం. అయితే, ప్రీమియం ప్లాన్ తీసుకోకపోతే చాలా వరకు ఎక్స్‌టెన్షన్స్‌లో డౌన్లోడ్ చేయగలిగే గ్రూప్ కాంట్రాక్ట్స్‌కు ఒక పరిమితి ఉంటుంది. ఉదాహరణకు, WA- డౌన్‌లోడ్ గ్రూప్ ఫోన్ నంబర్స్ ఎక్స్‌టెన్షన్స్ నెలకు $6.99 వసూలు చేస్తుంది.
ఇలా చేయడానికి పాటించాల్సిన స్టెప్స్:
- గూగుల్ క్రోమ్ వెబ్స్టోర్కు వెళ్లాలి. ఆ తరువాత WA- డౌన్‌లోడ్ గ్రూప్ ఫోన్ నంబర్స్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్‌ను ఇన్‌స్టాల్ చేయాలి.
- ఎక్స్‌టెన్షన్స్ ఇన్‌స్టాల్ చేసిన తరువాత, క్రోమ్ బ్రౌజర్లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేయాలి.
- ఫోన్ కెమెరాతో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వాట్సాప్‌ను సింక్ చేసి ఓపెన్ చేయాలి.
- లాగిన్ అయ్యాక, క్రోమ్ బ్రౌజర్ ఎగువ-కుడి మూలాన ఉన్న ఎక్స్టెన్షన్ ఐకాన్‌ను క్లిక్ చేయాలి.
- ఎక్స్టెన్షన్ లిస్ట్‌లో WA- డౌన్లోడ్ గ్రూప్ ఫోన్ నంబర్స్ ఎక్స్‌టెన్షన్స్‌ను క్లిక్ చేయాలి.
- Choose this first drop-down నుంచి, గ్రూప్స్ నుంచి ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- డ్రాప్-డౌన్‌కు కుడి వైపున ఉన్న ఫారమ్ ఫీల్డ్‌ను క్లిక్ చేయాలి (ఈ టెక్స్ట్‌ను ఎంచుకోండి కింద ఇన్‌పుట్ ఫీల్డ్). ఇలా చేశాక మీ వాట్సాప్ గ్రూప్స్ అన్నీ కనపడతాయి.
- లిస్ట్‌లో నుంచి మీకు కావాల్సిన గ్రూప్స్‌ను ఎంచుకోండి. కావాలంటే ఒకేసారి ఎక్కువగా గ్రూప్స్‌ను కూడా ఎంచుకోవచ్చు.
- అన్ని డౌన్‌లోడ్ ప్రాధాన్యతలను వర్తింపజేయడానికి చెక్ బాక్స్ కింద ఉన్న అన్ని ఆప్షన్స్‌ను ఎంచుకోవాలి. లేదంటే, ఆ ఆప్షన్స్‌ను మాన్యువల్‌గా ఎంచుకోవాలి.
- చివరగా ఎంపిక చేసిన వాట్సాప్ గ్రూప్స్‌లో ఉన్న కాంటాక్ట్స్‌ను ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేయడానికి దిగువ- కుడివైపు ఉండే డౌన్లోడ్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
- ఒకవేళ మీరు ఇప్పటికే సభ్యత్వాన్ని పొంది ఉండకపోతే, పాప్-అప్ మెనూ నుంచి ట్రై ఫ్రీ ఆప్షన్‌ను ఎంపిక చేయాలి. ఇది మీ డౌన్‌లోడ్‌ను వాట్సాప్ గ్రూప్‌లో మీ మొదటి పది కాంటాక్ట్స్‌కు పరిమితం చేస్తుంది. అపరిమిత డౌన్‌లోడ్‌ల కోసం ఇప్పుడు సబ్‌స్క్రైబ్ చేయి ఆప్షన్‌ను క్లిక్ చేయడం ద్వారా మీరు ప్రీమియం ప్లాన్‌ను పొందవచ్చు.
- ఈ ఎక్స్టెన్షన్ వాడటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే.. ఇది కాంటాక్ట్స్‌ను ఒక ఎక్సెల్ షీట్లో నిర్వహిస్తుంది. పైగా, ఇది ప్రతి కాంటాక్ట్‌కు సంబంధించి వినియోగదారుడి పేరును దాని ఫోన్ నంబర్‌తో సరిపోల్చుతుంది. ఒకవేళ మీ కాంటాక్ట్ బుక్‌లో ఫోన్ నంబర్ ఇప్పటికే ఉన్నట్లయితే, డౌన్‌లోడ్ చేసిన ఎక్సెల్ ఫైల్లో చూపిస్తుంది.
- ఇవీ చదవండి :
- మీ ఫోన్ పోయిందా?.. లొకేషన్ ఆఫ్‌లో ఉన్నా కనిపెట్టేయొచ్చిలా!
- ఇండియా స్పేస్ రేస్.. అగ్ర రాజ్యాలతో పోటీ.. ఇస్రో ఫ్యూచర్ ప్లాన్స్ ఇవే!