ETV Bharat / science-and-technology

వాట్సాప్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ చదివేయొచ్చు! - వాట్సాప్ కొత్త కబుర్లు

వాట్సాప్(whatsapp app).. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వాడుతున్న మేసేజింగ్ యాప్. ఇందులోని మెసేజ్​ను చదవాలంటే వాట్సాప్ ఓపెన్ చేయాలని అనుకుంటాం. కానీ యాప్ ఓపెన్ చేయకుండానే ఆ సందేశాన్ని ఎలా చదవచ్చో తెలుసా?

WhatsApp
వాట్సాప్
author img

By

Published : Oct 4, 2021, 10:37 AM IST

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ డౌన్‌లోడ్స్‌ ఉన్న ఏకైక యాప్‌ వాట్సాప్‌(whatsapp app). ఇతర యాప్‌లకు పోటీగా కొత్త ఫీచర్స్‌(whatsapp new features)ను పరిచయం చేస్తూ యూజర్స్‌ను ఆకట్టుకుంటోంది. సమాచార మార్పిడి నుంచి మీడియా ఫైల్స్‌, పేమెంట్స్‌(whatsapp payment) వరకూ ఎన్నో రకాల ఫీచర్స్‌ వాట్సాప్‌లో ఉన్నాయి. ఇందులో రోజూ మనకు ఎన్నో రకాల సందేశాలు వస్తుంటాయి. కొన్నిసార్లు తీరికలేకపోవడం వల్ల వాటిలో అన్ని మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం సాధ్యంకాదు. అలానే మెసేజ్‌ ఓపెన్‌ చేయకుండా వాటిని చదవలేం. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రం నోటిఫికేషన్ ప్యాన్‌లో మెసేజ్‌ను చూడొచ్చు. అయితే వాటిని కూడా పూర్తిగా చూడటం సాధ్యంకాదు. మరి మెసేజ్ ఓపెన్ చేయకుండా దాన్ని ఎలా చదవాలి? అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.

  • మీ ఫోన్ హోం స్క్రీన్‌ డిస్‌ప్లేపై లాంగ్‌ ప్రెస్ చేస్తే మీకు పాప్‌-అప్‌ మెనూ కనిపిస్తుంది.
  • అందులో విడ్జెట్స్‌ కేటగిరీపై క్లిక్ చేస్తే మీకు వేర్వేరు షార్ట్‌కట్స్ కనిపిస్తాయి. వాటిలో వాట్సాప్‌ ఐకాన్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత మీకు వేర్వేరు వాట్సాప్ విడ్జెట్స్‌ కనిపిస్తాయి. వాటిలో 4x1 వాట్సాప్‌ విడ్జెట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి.
  • దానిపై వేలితో నొక్కిపట్టి హోం స్క్రీన్‌ మీదకి లాగాలి. అప్పుడు మీ ఫోన్ హోం స్క్రీన్‌ మీద వాట్సాప్ కనిపిస్తుంది. దానిపై లాంగ్ ప్రెస్‌ చేసి విడ్జెట్ ఎక్స్‌పాండ్ చేస్తే మీకు వచ్చే మెసేజ్‌లు కనిపిస్తాయి.
  • అందులో యూజర్స్ వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌లు కనిపిస్తాయి. వాటిని పైకి, కిందకి స్క్రోల్‌ చేస్తూ మెసేజ్‌ ఓపెన్ చేయకుండానే చదివేయొచ్చు. అయితే విడ్జెట్‌లో మీకు కనిపించే వాట్సాప్ మెసేజ్‌లపై క్లిక్ చేస్తే మాత్రం ఛాట్ పేజ్‌ ఓపెన్ అవుతుంది. దాంతో మీరు మెసేజ్‌ చూసినట్లు అవతలి వ్యక్తులకు తెలిసిపోతుంది.

వాట్సాప్ వెబ్‌(whatsapp web)లో ఎలా చదవాలంటే?

వాట్సాప్‌ యాప్‌లోలానే వాట్సాప్ వెబ్‌(whatsapp web)లో కూడా మెసేజ్ ఓపెన్ చేయకుండా చదవొచ్చు. వాట్సాప్‌ వెబ్‌లో మౌస్ కర్సర్‌ని కాంటాక్ట్‌ లిస్ట్‌లోని మెసేజ్‌పై ఉంచితే పాప్‌-అప్‌ విండోలో మెసేజ్ సారాంశం మొత్తం కనిపిస్తుంది. అలా వాట్సాప్‌ వెబ్‌లోని మొత్తం మెసేజ్‌లను చూడొచ్చు. అయితే ఇందులో కేవలం లేటెస్ట్‌గా వచ్చే మెసేజ్‌లను మాత్రమే చూడగలరు. పాత మెసేజ్‌లు చూడాలంటే మాత్రం ఛాట్‌ పేజ్ ఓపెన్ చేయాల్సిందే.

ఇవీ చూడండి: ఈ యాప్స్​ను వెంటనే డిలీట్ చేయండి.. గూగుల్ హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.