ETV Bharat / science-and-technology

Upi Payment: ఇంటర్నెట్​ లేకపోయినా పేమెంట్స్​కు నో ప్రాబ్లం - భారత్​లో యూపీఐ పేమెంట్స్​

యూపీఐ (Upi Payment) లావాదేవీలు చేయాలి అంటే పక్కాగా స్మార్ట్​ఫోన్​, ఇంటర్నెట్​ కనెక్షన్​ ఉండాలి అనేది ఒకప్పటి మాట. అయితే కేవలం యూపీఐకు జత చేసిన ఫోన్​ నంబర్​ ఉంటే చాలు అనేది నేటి మాట. సులభ మార్గాలను ఉపయోగించి లావాదేవీలను ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి. ​

UPI payment
యూపీఐ పేమెంట్స్
author img

By

Published : Sep 23, 2021, 12:30 PM IST

మనదేశంలో ప్రస్తుతం డిజిటల్​ పేమెంట్స్(Digital Payment)​ హవా నడుస్తోంది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ సదుపాయం.. శరవేగంగా విస్తరించి ఇప్పుడు మారుమూల పల్లెల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. యూపీఐ (Upi Payment) యాప్​లను ఉపయోగించి లావాదేవీలు జరుపుతున్నారు. అయితే ఈ పేమెంట్స్​ చేయాలి అంటే ఇంటర్నెట్​ సౌకర్యం, స్మార్ట్​ఫోన్​లు పక్కగా ఉండాలి అని చాలామంది అనుకుంటారు. కానీ నెట్​ రాకపోయనా, స్మార్ట్​ఫోన్​ లేకపోయినా కూడా లావాదేవీలను చాలా సులభంగా చేయొచ్చని తెలుసా?

ఎలా చేయాలి?

ఇంటర్నెట్​ పూర్తిగా లేకపోయినా, డేటా కనెక్షన్ చాలా నెమ్మదిగా ఉన్నా యూపీఈ పేమెంట్స్​ చేయొచ్చు. ఇందుకు కావాల్సిందల్లా కేవలం బ్యాంక్​ అకౌంట్​తో లింక్ అయి ఉన్న ఫోన్​ నెంబర్​. ఇది ఒక్కటి ఉంటే చాలు. అదే ఫోన్​ నంబర్​ యూపీఐ పేమెంట్స్​లోని (Upi Payment) ఏదో ఒకదానికి జత చేసి ఉంటే మన లావాదేవీలు సులభంగా చేయవచ్చు. దీనికి స్మార్ట్​ ఫోన్ కూడా అవసరం లేదు.

  • ముందుగా మన దగ్గర ఉన్న ఫోన్​ నుంచి *99# అనే యూఎస్​ఎస్​డీ కోడ్​ను డయల్​ చేయాలి.
  • అనంతరం మనకు ఒక పాప్​ మెనూ ఓపెన్​ అవుతుంది. అందులో ఉన్న సెండింగ్​ మనీ అనే ఆప్షన్​ ఎంచుకొని 1 మీద నొక్కాలి.
  • అప్పుడు మరో మెనూ ఓపెన్​ అవుతుంది. అందులో మొబైల్​ నంబర్​తో సెండ్​ చేయాలా అని ఉంటుంది. దాని మీద క్లిక్​ చేయాలి. మరలా సంబంధిత అంకెను నొక్కాలి.
  • ఇప్పుడు మరొకటి ఓపెన్​ అవుతుంది. అప్పుడు మనం ఎవరికి అయితే యూపీఐ ద్వారా పంపాలని అనుకుంటున్నామో.. వారికి నంబర్​ అక్కడ ఎంటర్​ చేసి, సెండ్​ చేయాలి.
  • అనంతరం ఈ లావాదేవీలను ఎందుకు చేస్తున్నారు అని అడుగుతుంది. దానికి సమాధానంగా మీరు ఎందుకు పేమెంట్​ చేస్తున్నారు అనేది టైప్​ చేయాలి.

ఆ తరువాత మీ యూపీఐ పిన్​ను ఎంటర్​ చేస్తే.. ఆ లావాదేవీ పూర్తి అవుతుంది.

యూపీఐ నుంచి *99# సర్వీస్​ను తొలగించడం ఎలా?

  • డయల్​ ప్యాడ్​ ఓపెన్​ చేసి *99#ను డయల్​ చేయాలి.
  • ఆ మెనూలోని నాలుగో ఆప్షన్​ ఎంచుకోవాలి.
  • మీ నంబర్​ను ఎంటర్​ చేసి 7 నొక్కాలి. అందులో చూపించిన విధంగా డీరిజిస్టర్​ ఫ్రం యూపీఐ అనే ఆప్షన్ ప్రెస్ చేయాలి.
  • చివరగా 1 నంబర్ నొక్కి డీ రిజిస్టర్​ కన్​ఫార్మ్​ చేయాలి.

ఇదీ చూడండి: Email Tracking: ఈమెయిల్‌ ట్రాకింగ్‌.. ఈ మార్పులు చేశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.