విండోస్ యూజర్లకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు (windows 11 update) అక్టోబర్ 5 నుంచి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) విండోస్ 11ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఇప్పటి వరకు కేవలం బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. విండోస్ 10కి అప్‌గ్రేడెడ్ వెర్షన్ విండోస్ 11ను తీసుకొస్తామని గత జూన్‌లో మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. విండోస్ 11 వెర్షన్‌లో యూజర్ ఇంటర్ఫేస్ను(యూఐ) కొత్త డిజైన్‌లో తీసుకువచ్చినట్లు (windows 11 requirements) మైక్రోసాఫ్ట్ పేర్కొంది. పనితీరు వేగవంతం, నూతనంగా గేమింగ్ ఫీచర్లు, కొత్త విండోస్ స్టోర్, విండోస్ (windows 11 features) లోగోను కూడా కొత్తగా రూపొందించింది. ఆండ్రాయిడ్ యాప్స్ సపోర్ట్‌తో విండోస్ 11 పనిచేయనుంది. ల్యాప్‌టాప్, పీసీల్లో థర్డ్ పార్టీ యాప్ అవసరం లేకుండానే మొబైల్ ఫోన్స్ యాప్‌లను రన్ చేసుకునే అవకాశాన్ని రానున్న రోజుల్లో యాడ్ చేస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. విండోస్ 11ను ఇన్‌స్టాల్ చేసుకునేందుకు ఎలాంటి రుసుములు అవసరం లేదని, ఎలిజిబుల్ డివైజ్‌లకు ఉచితమని తెలిపింది.
డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలంటే..?
విండోస్ 10 వెర్షన్‌ను వాడుతున్న (windows 11 dark mode enable) వినియోగదారులు విండోస్ 11కు అప్‌గ్రేడ్ కావాలని మైక్రోసాఫ్ట్ సూచించింది. ల్యాప్‌టాప్, పర్సనల్ కంప్యూటర్లలో విండోస్ 11ను డౌన్‌లోడ్ చేసుకోండిలా..
- ల్యాప్‌లాప్, పీసీ సెట్టింగ్స్ అప్లికేషన్‌కు వెళ్లండి
- అప్‌డేట్ అండ్ సెక్యూరిటీ ఎంచుకోవాలి
- ఎడమవైపున ఉండే విండోస్ అప్‌డేట్ ఆప్షన్‌కు వెళ్లాలి
- విండోస్ 11 అప్‌డేట్ చూపించకపోతే.. చెక్ అప్‌డేట్‌ను క్లిక్ చేయాలి
- అప్‌డేషన్ వచ్చాక.. ఓఎస్‌ను డౌన్‌లోడ్ చేసేందుకు గెట్ స్టార్టెడ్‌ను క్లిక్ చేయాలి
- డౌన్‌లోడ్ పూర్తయ్యాక.. విండోస్ 11 వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసేందుకు డివైజ్‌ను రీస్టార్ట్ చేయాలి
- ఇన్‌స్టాలేషన్ కాస్త సమయం పడుతుంది.. కాబట్టి మీకున్న టైమ్‌ను బట్టి డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ చేసుకోవాలి
విండోస్ 11లో డార్క్‌మోడ్‌ను ఎనేబుల్ ఎలా చేసుకోవాలి?
డీఫాల్ట్‌గానే లైట్ మోడ్ ఎనేబుల్ ఆప్షన్లతో విండోస్ 11 ఓఎస్ వచ్చింది. వెలుతురు ఎక్కువగా ఉన్న సమయంలో వర్క్ చేసుకునేందుకు ఆటోమేటిక్‌గా బ్రైట్‌నెస్ తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా డార్క్ మోడ్‌ను కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. మీ పీసీ, ల్యాప్‌టాప్‌లో డార్క్‌మోడ్‌ను ఈ విధంగా ఎనేబుల్ చేసుకోండి..
- విండోస్ 11 సెట్టింగ్స్ స్క్రీన్‌ను ఓపెన్ చేయండి
- ఎడమ వైపు కనిపించే ప్యానెల్‌లోని పర్సనలైజేషన్‌ను ఎంచుకోవాలి
- పర్సనలైజేషన్‌లోని రెండో ఆప్షన్ కలర్స్‌ను సెలెక్ట్ చేసుకోవాలి
- డ్రాప్-డౌన్ మెనును క్లిక్ చేసి 'choose your mode'
- 'choose your mode'లోని 'డార్క్'ను ఎంచుకోవాలి
- ప్రాసెసింగ్ అయిపోయాక సిస్టమ్ కలర్స్ 'లైట్' నుంచి 'డార్క్' మోడ్‌కు మారిపోతాయి
డార్క్‌మోడ్‌ను డిజేబుల్ చేయాలంటే?
- డార్క్‌మోడ్‌ను డిజేబుల్ చేయాలంటే.. మళ్లీ విండోస్ 11 సెట్టింగ్స్ పేజీకి వెళ్లాలి
- పర్సనలైజేషన్‌ను ఎంచుకుని 'choose your mode'లో 'లైట్'ను ఎంచుకోవాలి
- డార్క్‌మోడ్ నుంచి లైట్ మోడ్‌లోకి వచ్చేందుకు కాస్త సమయం పడుతుంది
- డార్క్, లైట్ మోడ్‌లే కాకుండా 'కస్టమ్' మోడ్‌ను విండోస్ 11 యూజర్లకు మైక్రోసాఫ్ట్ ఆఫర్ చేసింది
- ప్రత్యేకమైన రంగులను ఎంచుకునే వీలు కల్పించింది
- విండోస్, యాప్స్ కోసం వేర్వేరుగా డార్క్ మోడ్‌నుగానీ.. లైట్ మోడ్‌ను ఎంపిక చేసుకోవచ్చు
ఇదీ చదవండి: వాట్సాప్ డీపీకి ఇకపై మరింత ప్రైవసీ!