How To Check Credibility Of A Website : సమాచార సాంకేతిక విప్లవం ఆధునిక మానవునికి ఒక వరమని చెప్పవచ్చు. ప్రపంచంలోని సమాచారం అంతటినీ క్షణాల్లో వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో జ్ఞాన సముపార్జనకు కావలసిన సమాచారం వెబ్‌సైట్స్‌లో కుప్పలు తెప్పలుగా లభిస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని నకిలీ వెబ్సైట్లు యూజర్లకు పెద్ద సమస్యగా తయారయ్యాయి. మరి ఒక వెబ్సైట్ విశ్వసనీయమైనదా? లేదా? అనేది ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- డొమైన్ పేరును పరిశీలించాలి : వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేసేందుకు ఉపయోగించే అడ్రస్‌నే డొమైన్ నేమ్ అని అంటారు. సాధారణంగా .Com, .Org, .Gov, .Edu లాంటి డొమైన్లు ఉన్న వెబ్సైట్లు విశ్వసనీయమైనవిగా ఉంటాయి. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఫేక్ డొమైన్ పేర్లు కాస్త తప్పుగా ఉంటాయి.
- HTTPS చూసుకోవాలి : వెబ్సైట్ URLలో మొదట HTTPS (హైపర్‌టెక్ట్స్ ట్రాన్స్ఫర్ ప్రోటొకాల్ సెక్యూర్) ఉండాలి. ఇలా ఉంటే ఆ వెబ్సైట్ సురక్షితమైనది అని అర్థం.
- రీడైర్ట్ అవుతుంటే.. : కొన్ని వెబ్సైట్లు ఓపెన్ చేసినప్పుడు.. అవి మరో వైబ్‌సైట్‌కు రీడైరెక్ట్ చేస్తుంటాయి. అలాంటి వాటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి.
- About us, Contact పేజ్‌లు పరిశీలించాలి : ఒరిజనల్ వెబ్సైట్లో About us, Contact పేజ్‌లు ఉంటాయి. ఫేక్ వెబ్సైట్లలో ఈ వివరాలు ఉండవు. అందువల్ల ఒక వెబ్సైట్ సరైనదా కాదా అని తెలుసుకునేందుకు.. About us పేజ్‌పై క్లిక్ చేసి పరిశీలించాలి. కాంటాక్ట్ పేజ్‌లోకి వెళ్లి వెబ్సైట్ యజమాని వివరాలు చూడాలి. ఒక వేళ ఈ వివరాలు లేకపోతే దానిని ఫేక్ వెబ్‌సైట్‌గా గుర్తించాలి.
- వెబ్సైట్ క్రెడిబిలిటీని తెలిపే ఆన్లైన్ టూల్స్ : WOT( Web of Trust) అనే ఎక్స్టెన్షన్ ఫేక్ వెబ్సైట్లను గుర్తించడానికి ఉపయోపగపడుతుంది. దీనిని గూగుల్ క్రోమ్‌కు బ్రౌజర్‌కు యాడ్ చేసుకోవాలి. తరువాత మీరు మీకు కావాల్సిన వెబ్‌సైట్‌ను సెర్చ్ చేయాలి. వెంటనే మీకు ఒర్జినల్ సైట్ ముందు గ్రీన్ టిక్, ఫేక్ వెబ్సైట్ ముందు రెడ్ టిక్ కనిపిస్తుంది. ఈ విధంగా మీరు నకిలీ వెబ్సైట్లను చాలా సులువుగా గుర్తించవచ్చు.
- క్రోమ్ ఎక్స్టెన్షన్ : వెబ్సైట్ ఎంత కచ్చితమైనదో తెలుసుకునేందుకు ఈ Stopaganda Plus అనే ఎక్స్టెన్షన్ ఉపయోగపడుతుంది. ఈ ఎక్స్టెన్షన్లో మోర్ డీటైల్స్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే అది https://mediabiasfactcheck.com/ కు డైరెక్ట్ చేస్తుంది. అక్కడ సదరు వెబ్‌సైట్‌కు చెందిన క్రెడిబిలిటీ రిపోర్ట్ కనిపిస్తుంది. ఈ విధంగా మీరు ఫేక్ వెబ్సైట్లను గుర్తించగలుగుతారు.
సైబర్ స్కామ్‌లు విపరీతంగా పెరిగిపోతున్న నేటి కాలంలో.. వెబ్సైట్ సర్ఫింగ్ చేస్తున్నప్పుడు, సదరు సైట్లు ఒర్జినల్వా, కాదా అని తెలుసుకోవడం చాలా అవసరం. లేదంటే మీ కష్టార్జితమైన సొమ్మును పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేదా మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లు చిక్కుతుంది. తస్మాత్త్ జాగ్రత్త!
ఇన్‌యాక్టివ్ జీ-మెయిల్స్ తొలగించనున్న గూగుల్ - ఈ టెక్నిక్స్ పాటిస్తే మీ అకౌంట్ సేఫ్!
మీ ఫోన్లో ఈ సీక్రెట్ కోడ్స్ ఎంటర్ చేస్తే - మీరు ఊహించని సమాచారం వస్తుంది!