ETV Bharat / science-and-technology

మోదీ చెప్పినట్టు సోషల్ మీడియాలో డీపీ మార్చాలా? ఇలా చేయండి!

Social media DP: వాట్సాప్​లో ప్రొఫైల్‌ పిక్‌ను ఎలా మార్చుకోవాలనేది చాలా మందికి అవగాహన ఉంటుంది. మరి ట్విట్టర్​, ఫేస్​బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, లింక్డ్​ఇన్​ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్ పిక్​ను ఎలా మార్చుకోవాలో ఓ సారి తెలుసుకుందాం.

social media profile picture
సోషల్ మీడియా
author img

By

Published : Aug 2, 2022, 12:00 PM IST

Social media DP: భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దేశ ప్రజలంతా ఆగస్టు 13 నుంచి 15 వరకు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలు ఎగరేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే ఆగస్టు 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాల్లో తమ ప్రొఫైల్‌ పిక్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని కోరారు.

ఆగస్టు 2న జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి. ఆయనకు నివాళిగా ఆగస్టు 2 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని పిలుపుతో చాలా మంది సోషల్‌ మీడియా యూజర్లు తమ ఖాతాల ప్రొఫైల్‌ పిక్‌/డీపీలను మార్చుకుంటున్నారు. వాట్సాప్‌లో ఎలా మార్చుకోవాలనేది చాలా మంది అవగాహన ఉండే ఉంటుంది. మరి మిగిలిన వాటి సంగతి ఏంటి? సోషల్‌ మీడియాలన్నింటిలో సెట్టింట్స్‌ ఒకేలా ఉండవు కదా..! అందుకే సామాజిక మాధ్యమ ఖాతాల్లో ప్రొఫైల్‌ పిక్‌/డీపీ ఎలా మార్చుకోవాలో చూద్దాం..

.

ఫేస్‌బుక్‌:

  • ఫేస్‌బుక్‌ ఖాతాలోకి లాగిన్‌ తరువాత ప్రొఫైల్‌ పిక్‌/డీపీపై కనిపించే కెమెరా ఐకాన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీరు ఫేస్‌బుక్‌ ఖాతాలో అప్‌లోడ్‌ చేసిన ఫొటోలను చూపిస్తుంది.
  • వాటిని నుంచి మీకు కావాల్సిన ఫొటోను సెలెక్ట్ చేసి ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకోవవచ్చు. ఫేస్‌బుక్‌ గ్యాలరీ నుంచి కాకుండా కొత్త ఫొటోను డీపీగా పెట్టుకోవాలనుకుంటే అప్‌లోడ్ ఫొటో ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • తర్వాత మీ ఫోన్‌ లేదా డెస్క్‌టాప్‌/పీసీలోని ఫొటోలను చూపిస్తుంది. వాటిలో మీకు నచ్చిన ఫొటోను సెలెక్ట్ చేసి సేవ్‌ చేసుకుంటే ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ పిక్‌/డీపీ మారిపోతుంది.
  • ఒకవేళ టైమ్‌లైన్‌ ఫొటో మార్చుకోవాలనుకున్నా పైన పేర్కొన్న పద్ధతిని అనుసరించి ఛేంజ్‌ చేసుకోవచ్చు.
.

ట్విట్టర్ :

  • ట్విట్టర్​లో ఎడమవైపు కనిపిస్తున్న మెనూలో ప్రొఫైల్ ఓపెన్‌ చేసి ఎడిట్‌ ప్రొఫైల్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • అందులో మీకు ప్రొఫైల్‌ పిక్‌/డీపీ‌, టైమ్‌లైన్‌ ఫొటోలపై కెమెరా ఐకాన్‌ కనిపిస్తుంది. మీరు ఏ ఫొటో మార్చుకోవాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేసి ఫోన్‌ గ్యాలరీ లేదా డెస్క్‌టాప్‌/పీసీ నుంచి ఫొటో సెలక్ట్ చేసుకోవాలి.
  • తర్వాత కుడివైపు పైన ఉన్న అప్లై ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ప్రొఫైల్‌ పిక్‌/డీపీ మారిపోతుంది. టైమ్‌లైన్‌ ఫొటోను కూడా ఇదే తరహాలో మార్చుకోవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్:

  • ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలోకి లాగిన్‌ అయిన తర్వాత యాప్‌లో కింద కుడివైపు ప్రొఫైల్‌ ఫొటో/డీపీ ఉంటుంది.
  • దానిపై క్లిక్ చేసి ఎడిట్ ప్రొఫైల్‌ ఓపెన్ చేస్తే ఛేంజ్‌ ప్రొఫైల్‌ ఫొటో ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో ప్రొఫైల్‌ ఫొటో/డీపీపై క్లిక్ చేయగానే న్యూ ప్రొఫైల్‌ ఫొటో, ఇంపోర్ట్ ఫ్రమ్‌ ఫేస్‌బుక్‌ ఆప్షన్లు కనిపిస్తాయి.
  • న్యూ ప్రొఫైల్‌ ఫొటోపై క్లిక్ చేస్తే ఫోన్ గ్యాలరీ లేదా డెస్క్‌టాప్‌/డీసీ నుంచి ఫొటోను సెలెక్ట్ చేసి సేవ్‌ చేయాలి.
  • ఒకవేళ ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసిన ఫొటోలు కావాలనుకుంటే ఇంపోర్ట్ ఫ్రమ్‌ ఫేస్‌బుక్‌ ఆప్షన్‌పై క్లిక్ చేసి అక్కడి గ్యాలరీలోని ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌ పిక్‌/డీపీగా పెట్టుకోవచ్చు.
  • ఇన్‌స్టాగ్రామ్‌ డెస్క్‌టాప్‌/పీసీ వెర్షన్‌లో పర్సన్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేసి ప్రొఫైల్ ఫొటో సెలెక్ట్‌ చేసి మార్చుకోవచ్చు.

లింక్డ్‌ఇన్‌:

  • లాగిన్‌ తర్వాత ప్రొఫైల్‌పై క్లిక్ చేస్తే ఎడిట్‌ ప్రొఫైల్‌ ఆప్షన్‌ ఉంటుంది. అందులో ప్రొఫైల్‌ పొటోపై క్లిక్ చేస్తే యాడ్ ప్రొఫైల్‌ ఫొటో, వీడియో, ఫ్రేమ్‌ ఆప్షన్లు కనిపిస్తాయి.
  • వాటిలో ప్రొఫైల్ ఫొటో ఆప్షన్‌పై క్లిక్‌ చేసి ఫోన్ గ్యాలరీ లేదా డెస్క్‌టాప్‌/పీసీ వెర్షన్‌ నుంచి కావాల్సిన ఫొటోను సెలెక్ట్ చేసి సేవ్‌ చేస్తే ప్రొఫైల్ ఫొటో/డీపీ మారిపోతుంది.

వాట్సాప్‌:

  • యాప్‌ ఓపెన్‌ చేసిన తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళితే ప్రొఫైల్‌ ఫొటో/డీపీ కనిపిస్తుంది. దానిపైన ఉన్న కెమెరా ఐకాన్‌పై క్లిక్ చేస్తే కెమెరా, గ్యాలరీ ఆప్షన్లు చూపిస్తుంది.
  • ఫోన్‌ మెమొరీ నుంచి అప్‌లోడ్‌ చేయాలనుకుంటే గ్యాలరీపై క్లిక్ చేసి అందులోని ఫొటోను సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఫొటో తీసుకోవాలనుకుంటే కెమెరా ఆప్షన్‌పై క్లిక్ చేసి ప్రొఫైల్‌ ఫొటో/డీపీని మార్చుకోవచ్చు.

డెస్క్‌టాప్ వెర్షన్‌లో ప్రొఫైల్‌ ఫొటో/డీపీపై క్లిక్ చేస్తే కెమెరా సింబల్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి డెస్క్‌టాప్‌/పీసీ నుంచి నచ్చిన ఫొటోను సెలెక్ట్ చేసుకుని డీపీగా పెట్టుకోవచ్చు.

ఇవీ చదవండి: ఫోన్​ అతిగా వాడుతున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే..

మనం ఎందుకు నిద్రించాలి? జ్ఞాపకాలు ఎలా ఏర్పడతాయో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.