How To Build A Low Cost YouTube Studio : కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ ఒక వరం లాంటిది. ఇది మీలోని సృజనాత్మకతను ప్రపంచానికి తెలియజేయమే కాకుండా.. మీకు మంచి ఆదాయ వనరుగా కూడా పనిచేస్తుంది. అందుకే చాలా మంది తమ ఆభిరుచికి అనుగుణంగా మంచి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. అలాగే వీడియో షూటింగ్ కోసం మంచి స్టూడియో కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆశిస్తూ ఉంటారు. బాగా డబ్బులు ఉన్నవారు అయితే.. ఎంత ఖర్చుపెట్టి అయినా బెస్ట్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేయగలుగుతారు. మరి లిమిటెడ్ లేదా మోడరేట్ బడ్జెట్ ఉన్నవారి పరిస్థితి ఏమిటి? అందుకే ఈ ఆర్టికల్ ద్వారా.. సింపుల్ బడ్జెట్లో మంచి యూట్యూబ్ స్టూడియోను ఎలా ఏర్పాటుచేసుకోవాలో తెలుసుకుందాం.
1. కెమెరా :
Best Camera For Youtube Videos : నేటి కాలంలో వాయిస్ ఓవర్ వీడియోల కంటే, రియల్ వీడియో కంటెంట్‌కే ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే కంటెంట్ క్రియేటర్లు చాలా మంది వీడియో షూట్ చేయాలని ఆశిస్తూ ఉంటారు. అయితే ఇందుకోసం సెల్‌ఫోన్ వాడవచ్చు లేదా ప్రత్యేకంగా DSLR కెమెరాలు వాడవచ్చు. అందుకే ప్రస్తుతం బడ్జెట్లో లభిస్తున్న బెస్ట్ కెమెరాల గురించి తెలుసుకుందాం.
Smartphones :
iQOO Z7 Pro 5G :
- దీని అసలు ధర రూ.26,999.
- అమెజాన్‌లో ప్రస్తుతం ఇది రూ.23,999కే లభిస్తోంది.
iPhone 13 :
- మార్కెట్లో దీని ధర రూ.69,900 వరకు ఉంది.
- ప్రస్తుతం ఇది అమెజాన్‌లో రూ.48,999కే లభిస్తోంది.
DSLR Camera Offers :
Canon 200D :
- దీని అసలు ధర రూ.68,995
- అమెజాన్‌లో ఇది ప్రస్తుతం 15% డిస్కౌంట్‌తో రూ.58,988కే లభిస్తుంది.
Canon 90D+ 18-135 Lens
- మీ బడ్జెట్ కనుక కాస్త ఎక్కువగా ఉంటే కెనాన్ 90Dని కొనుగోలు చేయవచ్చు.
- కెనాన్ 90D అసలు ధర రూ.1,27,999 ఉంది. రిలయన్స్ డిజిటల్లో ఇది రూ.1,20,999కే లభిస్తుంది.
2. వైర్లెస్ మైక్రో ఫోన్స్
Best Wireless Mics For Youtube Videos :
Digitek Wireless Microphone :
- మార్కెట్లో దీని ధర రూ.6,995 వరకు ఉంది.
- ప్రస్తుతం అమెజాన్‌లో ఇది కేవలం రూ.4,297లకే లభిస్తోంది.
Boya by-WM4 PRO-K2 Dual-Channel :
- దీని అసలు ధర రూ.18,850.
- ప్రస్తుతం ఇది అమెజాన్‌లో రూ.10,299లకే లభిస్తోంది.
Rode Wireless Go : కాస్త బడ్జెట్ ఎక్కువగా ఉన్నవారు కచ్చితంగా రోడ్ వైర్లెస్ గో మైక్‌ను తీసుకోవచ్చు.
- దీని ఒరిజినల్ ధర రూ.35,400 వరకు ఉంటుంది.
- అమెజాన్ సేల్‌లో ఇది రూ.27,999కే అందుబాటులో ఉంది.
3. లైట్స్
Best Lights For Youtube Videos : కెమెరా, మైక్‌లతో పాటు లైటింగ్ కూడా చాలా కీలకం. సరైన లైటింగ్ సెటప్ లేకపోతే.. హై క్వాలిటీ వీడియోలు తీయడం సాధ్యం కాదు. అందుకే మంచి లైట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
- DIGITEK DRL 018H : ఇది యూట్యూబర్స్ ఫేవరెట్ అని చెప్పవచ్చు. దీని అసలు ధర రూ.5,995 వరకు ఉంటుంది. ప్రస్తుతం ఇది అమెజాన్‌లో రూ.2,999లకే లభిస్తోంది. ఇది మంచి డీల్ అని చెప్పుకోవచ్చు.
- GODOX SL-60W : దీని అసలు ధర రూ.15,499 ఉంటుంది. ప్రస్తుతం ఇది అమెజాన్‌లో రూ.9,999కే అందుబాటులో ఉంది. కాస్త బడ్జెట్ ఉన్నవారు దీనిని తీసుకోవడం బెటర్‌గా ఉంటుంది.
4. ల్యాప్‌టాప్
Best Laptop For Youtube Videos :
Apple MacBook Air Laptop M1 :
- వీడియో ఎడిటింగ్‌కు మంచి ల్యాప్‌టాప్ ఉండాల్సిందే. ఇందుకోసం యాపిల్ మ్యాక్‌బుక్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
- మార్కెట్లో యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ల్యాప్‌టాప్ ఎం1 ధర రూ.99,900 ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇది రూ.69,990కే లభిస్తోంది.
Acer Nitro V :
- మార్కెట్లో దీని అసలు ధర రూ.92,999 ఉంటుంది.
- ప్రస్తుతం ఇది రూ.73,990కే లభిస్తోంది.
నోట్ : పైన తెలిపిన పరికారాల ధరలు కాస్త అటుఇటుగా ఉంటాయి. ముఖ్యంగా ఆయా ఈ-కామర్స్ సైట్స్, డిజిటల్ స్టోర్స్ ఇచ్చే బ్యాంక్ ఆఫర్స్, డిస్కౌంట్స్ ఉపయోగిస్తే.. మరింత తక్కువ ధరకే వీటిని పొందడానికి వీలవుతుంది.
Best Video Editing Tools : పైన తెలిపినవి అన్నీ కచ్చితంగా వీడియో ఎడిటింగ్‌కు కావాల్సిన టూల్స్. అయితే వీటితోపాటు వైర్డ్ మైక్స్, యూఎస్బీ మైక్స్, ట్రైపాడ్స్, స్టోరేజ్ డివైజెస్, మోనిటర్స్, గింబల్, గ్రీన్ స్క్రీన్, బ్లూ మ్యాట్ లాంటివి కూడా అవసరం అవుతాయి. కానీ వీటిని డబ్బులు ఉన్నప్పుడు, అవసరమైతేనే కొనుగోలు చేసుకోవచ్చు.
వీడియో ఎడిటింగ్‌కు కావాల్సిన సాఫ్ట్వేర్స్
Best Video Editing Software : యూట్యూబ్ వీడియో తయారు చేయాలంటే మంచి సాఫ్ట్వేర్స్ కూడా కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా అడోబ్ ప్రీమియర్ ప్రో, ఫిల్మోరా లాంటి వీడియో ఎడిటింగ్ టూల్స్ అవసరం అవుతాయి. అయితే వీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటిని అందరూ ఎఫర్ట్ చేయలేరు. అందుకే యూట్యూబ్ ఇటీవల YT Create అనే ఉచిత ఎడిటింగ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
యూట్యూబ్ థంబ్‌నెయిల్స్
యూట్యూబ్ యూజర్లను ఎట్రాక్ట్ చేయాలంటే.. మంచి థంబ్‌నెయిల్ కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం Canva లాంటి వెబ్‌సైట్స్ ఎంతో ఉపయోగపడతాయి. అయితే దీనికి మనం కొంత డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ఒక వేళ మీకు ఉచితంగా వీడియోలు, ఫొటోలు కావాలంటే Pixabay, pixels లాంటి వెబ్‌సైట్స్‌ను వినియోగించుకోవచ్చు.
Youtube SEO tools
మీ యూట్యూబ్ ఛానల్ మంచిగా వ్యూయర్షిప్ పొందాలంటే.. మంచిగా ఎస్ఈవో కూడా చేయించాల్సి ఉంటుంది. దీని కోసం VidIQ, TubeBuddy లాంటి ఎస్ఈవో టూల్ ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటు చాట్‌జీపీటీ, ఏఐ టూల్స్ కూడా బాగా ఉపయోగపడతాయి.
నోట్ : చాలా మంది ఏదో ఆవేశంలో యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేస్తారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు. తమకు ఏ రంగంలో అభిరుచి ఉంటుందో దానినే ఎంచుకోవాలి. అలాగే తమకు ఏ విషయంపై బాగా అవగాహన ఉందో, దానినే ఎంచుకోవాలి. యూట్యూబ్‌లో సక్సెస్ అనేది వెంటనే రాదు. దానికోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎంతో సృజనాత్మకతతో, క్రమం తప్పకుండా వీడియోలు చేయాల్సి ఉంటుంది. అన్నింటి కంటే ప్రధానంగా సహనం ఉండాలి. అప్పుడే యూట్యూబ్‌లో అయినా, మరే ఇతర డిజిటల్ ప్లాట్‌ఫాంలో అయినా సక్సెస్ కాగలరు. ఆల్ ది బెస్ట్!
How to Use Umang App and its Features : ఒక్క ఉమాంగ్ యాప్‌తో ఎన్నో ప్రభుత్వ సేవలు.. ఇలా వాడేయండి!
Chandrayaan 3 Wake Up : 'ఆశలు లేవు.. చంద్రయాన్-3 ఇక ముగిసినట్లే!'