How to Block Ads in Android Phone in Telugu: ఆ స్మార్ట్ యూగంలో.. స్మార్ట్ఫోన్లు ప్రతి ఒక్కరి జీవితంలోనూ భాగమయ్యాయి. దాదాపు అన్ని ముఖ్యమైన పనులనూ ఫోన్ ద్వారానే సులభంగా చేసుకుంటున్నారు. అయితే.. ఫోన్లో తరచూ యాడ్స్ వస్తుంటాయి. సాధారణ సమయాల్లో అయితే ఫర్వాలేదు. ఏదో ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్నప్పుడు ప్రకటనలు వస్తే ఇబ్బందిగా ఉంటుంది. కొన్నిసార్లు చేస్తున్న పని మధ్యలో డిస్ట్రబ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ పరిస్థితిని చాలా మంది యూజర్స్ ఎదుర్కొంటూ ఉంటారు.
మీ స్మార్ట్‌ఫోన్ ఎవరికైనా అమ్ముతున్నారా? ఈ విషయాలు మరిచిపోతే అంతే!
Tips to Block Advertisements in Smartphones: అత్యవసర సమయంలో ఫోన్ ఉపయోగించేటప్పుడు యాడ్స్ వస్తే ఫోన్ నేలకేసి కొట్టాలన్నంత కోపం వస్తుంది. Apple iPhoneలో ప్రకటనలు ఎప్పుడూ కనిపించవు. కానీ.. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారిలో చాలామంది ఈ సమస్యను ఇప్పటికే ఎదుర్కొని ఉంటారు. యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ప్రకటనలను ఆపేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఫోన్‌లోనే(ఆండ్రాయిడ్) ప్రకటనలు కనిపిస్తే మాత్రం ఏం చేయాలో చాలా మందికి తెలియదు.
ఆ యాడ్ మొత్తం చూసి.. ఆ తర్వాత క్రాస్ (X) ఆప్షన్‌పై నొక్కడం మినహా ఏమీ చేయలేకపోతుంటారు. ఇలాంటి పరిస్థితిని మీరు కూడా ఫేస్ చేస్తున్నట్టయితే.. మీకోసమే ఈ ఆర్టికల్. మొబైల్లో వచ్చే ఈ ప్రకటనలను సులభంగా బ్లాక్ చేయవచ్చని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మరి.. Android ఫోన్లలో వచ్చే ప్రకటనలను ఎలా బ్లాక్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.
ప్రీపెయిడ్ కన్నా - పోస్ట్‌పెయిడ్ సిమ్‌లో ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువా?
ఫోన్లో యాడ్స్ బ్లాక్ చేయడం ఎలా..?
- ఇందుకోసం ముందుగా ఫోన్లో Settings ఓపెన్ చెయ్యండి.
- ఆ తర్వాత Google ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు Manage Your Google Account అనే దానిపై క్లిక్ చేయాలి.
- మీరు ఆ ఆప్షన్‌ను నొక్కిన వెంటనే.. మీకు Data & Privacy ఆప్షన్ వస్తుంది.
- అక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసినప్పుడు, మీరు Personalized Ads ఆప్షన్ కనిపిస్తుంది.
- Personalized Ads కింద, మీకు My Ad Center ఆప్షన్ ఉంటుంది.
- మీరు దానిపై క్లిక్ చేసిన తర్వాత Personalized Ads టోగుల్(అది మీ స్క్రీన్ పైన కుడివైపున ఉంటుంది) ఆఫ్ చేయాలి.
- ఆ తర్వాత మళ్లీ Settings ఓపెన్ చేసి Google ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- Manage Your Google Account కింద Services on this Device సెక్షన్లో Ads ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత Delete Advertising IDని ట్యాప్ చేసి డెలిట్ చేయండి.
- ఇలా చేస్తే ఇకపై ఆండ్రాయిడ్ ఫోన్లలో యాడ్స్ రాకుండా ఆగిపోతాయి.
- చూశారుగా పైన చెప్పిన విధానాన్ని ఫాలో కావడం ద్వారా .. సింపుల్ యాడ్స్‌ను బ్లాక్ చేసుకోవచ్చు.
ల్యాప్‌టాప్ త్వరగా డిస్ఛార్జ్ అయిపోతోందా? ఈ ట్రిక్స్‌తో ప్రోబ్లమ్ సాల్వ్!
మీ ఫోన్లో ఈ సీక్రెట్ కోడ్స్ ఎంటర్ చేస్తే - మీరు ఊహించని సమాచారం వస్తుంది!