ETV Bharat / science-and-technology

ఫేస్​బుక్ హ్యాక్ అవుతుందని భయమా? ఇవి పాటిస్తే మీ ఖాతా సూపర్ స్ట్రాంగ్!

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్​ఫామ్ ఫేస్​బుక్​కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఫేస్​బుక్​ను వాడుతుంటారు. ఫేస్​బుక్​లో పోస్టులు పెట్టడం, నోటిఫికేషన్స్​ను ఎప్పటికప్పుడు చూస్తూ ఉండటం చాలా మందికి అలవాటుగా మారింది. అయితే ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమ వ్యక్తిగత ఖాతాలు హ్యాక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫేస్​బుక్ హ్యాక్ కాకుండా ఉండడానికి ఏం చేయాలో ఓ సారి తెలుసుకుందాం.

avoid facebook hack
avoid facebook hack
author img

By

Published : Apr 24, 2023, 9:12 AM IST

వ్యక్తిగత ఆలోచనలతో పాటు, సమకాలీన అంశాలపై అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు సామాజిక మాధ్యమాలు చక్కనైన వేదికలు. అంతేకాదు, పరిచయం లేని వ్యక్తుల గురించి ప్రాథమిక వివరాలు తెలుసుకునేందుకు కూడా వీటిని ఉపయోగిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమ ఖాతాల్లోని వివరాలు బహిర్గతం కావడం యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోంది. ఇటీవలి కాలంలో తమ ఫేస్‌బుక్‌ ఖాతాలు హ్యాక్‌ అయినట్లు పెడుతున్న మెసేజ్‌లు చూస్తూనే ఉన్నాం. దీంతో అందులోని ఫొటోలు, మెసేజ్‌లు వంటి సమాచారం సైబర్‌ నేరగాళ్లకు చేరిపోతుందని ఆందోళన చెందుతుంటాం. ఫేస్​బుక్ ఖాతా హ్యాక్ కాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలెంటో ఓ సారి తెలుసుకుందాం.

1. టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్..
ఫేస్​బుక్​ ఖాతా​ హ్యాకర్ల బారిన పడకూడదంటే మీ అకౌంట్ సెక్యూరిటీని మరింత పటిష్ఠం చేసుకోవాలి. ఇందులో భాగంగా టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్​ను ఆన్ చేసుకోవాలి. దీని వల్ల కొత్త డివైజ్ నుంచి ఫేస్​బుక్​ లాగిన్​ అయ్యే సమయంలో పాస్​వర్డ్​తో పాటు స్పెషల్ కోడ్​ను కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పాస్​వర్డ్​ హ్యాకర్​కు తెలిసినా.. కోడ్ లేకుండా అకౌంట్ లాగిన్ అవ్వలేరు.

ఫేస్​బుక్​ అకౌంట్​లో టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్​ను ఎనేబుల్ చేసేందుకు ముందుగా సెట్టింగ్స్ అండ్ ప్రైవసీలోకి వెళ్లాలి. ఆ తర్వాత సెట్టింగ్స్​ను సెలెక్ట్ చేసుకోవాలి. అందులో సెక్యూరిటీ అండ్ లాగిన్ ఆప్షన్​ను ఎంచుకోవాలి. అప్పుడు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అనంతరం పాస్​వర్డ్ నమోదు చేయాలి. ఆ తర్వాత మూడు ఆప్షన్ లు కనిపిస్తాయి.

టెక్ట్స్ మెసేజ్ (ఎస్ఎంఎస్):
ఫేస్​బుక్​ వెబ్​సైట్​ లేదా యాప్​లో లాగిన్ అయ్యే సమయంలో మీ మొబైల్​కు ఎఫ్​బీ నుంచి నుంచి ఒక మెసేజ్ వస్తుంది. పాస్​వర్డ్ నమోదు చేసినా సరే.. ఈ లాగిన్ కోడ్ ఎంటర్ చేయకపోతే మాత్రం మీరు ఫేస్​బుక్​ లాగిన్ అవ్వలేరు.

అథెంటికేషన్ యాప్:
ఇది కూడా టెక్ట్స్ మెసేజ్ మాదిరిగానే పనిచేస్తుంది. కాకపోతే ఇందులో మెసేజ్​కు బదులుగా థర్డ్ పార్టీ యాప్​లో న్యూమరిక్ కోడ్ వస్తుంది. అయితే ఏది పడితే అది కాకుండా నమ్మకమైన థర్డ్ పార్టీ యాప్స్ డౌన్​లోడ్​ చేసుకోవాలి. ట్విలియోస్ ఆథీ, గూగుల్ అథెంటికేటర్ లాంటి థర్డ్ పార్టీ యాప్స్ వాడటం సురక్షితం అని నిపుణులు చెబుతున్నారు.

సెక్యూరిటీ కీ:
ఫేస్​బుక్​ అకౌంట్​కు టెక్ట్స్ మెసేజ్ రూపంలో భద్రత వద్దనుకుంటే ఫిజికల్ సెక్యూరిటీ కీ ద్వారా కూడా అథెంటికేషన్​ను ఎనేబుల్ చేసుకోవచ్చు. అయితే దీని కోసం యుబికో లాంటి చిన్న డాంగిల్​ను ఎప్పుడూ వెంట ఉంచుకోవాల్సి ఉంటుంది. లాగిన్ చేసే ప్రతిసారి సంబంధింత డివైజ్​లో డాంగిల్​ను ప్లగ్ చేయాల్సి ఉంటుంది. సాధారణ ఫేస్​బుక్​ యూజర్లకు ఇది అంతగా ఉపయోగపడకపోవచ్చు.

2. ఈ-మెయిల్ పనిచేస్తోందా?.. చెక్​ చేసుకోండి..
మీ ఫేస్​బుక్​ ఖాతాకు లింక్ అయిన ఈ-మెయిల్​ను మీరు ప్రస్తుతం వాడకపోయినా లేదా అది పనిచేయకున్నా మీకు సమస్యే. దీని వల్ల మీరు పాస్​వర్డ్​ రీసెట్ చేయడం కుదరదు. కాబట్టి ఫేస్​బుక్​లో యాక్టివ్​గా ఉన్న ఈ-మెయిల్​ను అప్డేట్ చెయ్యండి. అలాగే ఈ-మెయిల్ పాస్​వర్డ్​ కూడా స్ట్రాంగ్​గా ఉండేలా చూసుకోండి. దానికి టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆప్షన్​ను ఎనేబుల్ చేయండి. ఫేస్​బుక్​లో ఈ-మెయిల్ అప్డేట్​ చేయాలంటే ముందుగా సెట్టింగ్స్ అండ్ ప్రైవసీలోకి వెళ్లాలి. అందులో సెట్టింగ్స్ ఆప్షన్​పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత జనరల్​ను ఎంచుకోవాలి. అక్కడ కాంటాక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అక్కడ ఉండే ఈ-మెయిల్ అడ్రస్ పాతదైతే దాన్ని అప్డేట్ చేస్తే సరిపోతుంది.

3. పాస్​వర్డ్​తో జాగ్రత్త..
మీ ఫేస్​బుక్ ఖాతాలో టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్​లో ఉన్నా పాస్​వర్డ్​ కూడా బలంగా ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. పాస్​వర్డ్ ఏది పడితే అది పెట్టకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలి. వేర్వేరు కాంబినేషన్లతో విభిన్నమైన, బలమైన పాస్​వర్డ్​ను సెట్ చేసుకోవాలి. ఇందుకోసం అవసరమైతే వన్​పాస్​వర్డ్​, డ్యాష్​లేన్​ లాంటి యాప్స్ సాయం తీసుకోవచ్చు. పాస్ వర్డ్​లు గుర్తుపెట్టుకోవడం కష్టంగా అనిపిస్తే వాటిని డైరీలో లేదా ఏదైనా పుస్తకంలో రాసుకోవాలి.

4. స్కామర్లతో జాగ్రత్త:
ఎన్ని సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నప్పటికీ సైబర్ మోసగాళ్ల నుంచి మిమ్మల్ని కాపాడుకునేది మీరే. అవును.. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ సామాజిక మాధ్యమ ఖాతాలు అంత సురక్షితంగా ఉంటాయి. ఈ-మెయిల్​, మెసేజ్​లు, మెసెంజర్ల ద్వారా మీ ఫోన్​లో సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తుంటారు. హ్యాకర్లు, సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

ఎవరినీ నమ్మొద్దు:
ఫేస్​బుక్​లో మీకు తెలిసినవారు, మిత్రులు, కుటుంబ సభ్యుల ఖాతాల నుంచి సాయం కోరుతూ డబ్బుల అవసరం ఉందని, వ్యక్తిగత సమాచారం చెప్పాలంటూ వచ్చే మెసేజ్​లను అస్సలు నమ్మొద్దు. అంతగా కావాలంటే వారిని నేరుగా కలవడం లేదా ఇతర విధాలుగా కాంటాక్ట్ అవ్వండి.

పాస్​వర్డ్​ లేదా కోడ్స్ షేర్ చేయొద్దు..
మీ లాగిన్ వివరాలు లేదా టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోడ్ చెప్పమని ఫేస్​బుక్​ తన యూజర్లకు మెసేజ్​లు, ఈ-మెయిల్స్ ఎప్పుడూ చేయదని గ్రహించండి. ఒకవేళ అలాంటి సమాచారం అడిగినా అది ఫేస్​బుక్​ వెబ్​సైట్​ లేదా యాప్​లో లాగిన్ అయ్యే సమయంలోనే నమోదు చేయాలని కోరుతుంది.

ఆ లింక్స్​తో జాగ్రత్త:
హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్ హ్యాక్ చేసేందుకు ప్రమాదకర లింక్స్ పంపిస్తుంటారు. అలాంటి లింక్స్​తో ఫేస్​బుక్​ లాగిన్ అయితే ఇక అంతే సంగతులు. కాబట్టి ఎప్పుడైనా బ్రౌజర్​లోకి వెళ్లి ఫేస్​బుక్​ హోమ్ పేజ్​ లేదా యాప్​లో లాగిన్ అవ్వాలి.

ఆందోళన అక్కర్లేదు:
మీ భావోద్వేగాలు, భయాలను కొందరు సైబర్ నేరగాళ్లు.. తమ స్వార్థానికి వాడుకుంటారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. 'మాకు మీ సమాచారం కావాలి వెంటనే పంపండి లేకపోతే మీ అకౌంట్​ను ఎప్పటికీ పొందలేరు' అంటూ ఫేస్​బుక్​లో సందేశాలు పంపుతుంటారు. అలాంటి వాటితో జాగ్రత్త. ఒకవేళ మీకు ఫేస్​బుక్​లో ఏదైనా సమస్య ఉంటే ఎఫ్​బీ సపోర్ట్​ను సంప్రదించండి.

5. వేరే వాళ్లు లాగిన్ అయితే..
ఫేస్​బుక్​లో మీ ఖాతా నుంచి వేరేవారు ఎవరైనా లాగిన్ అయితే, మీకు దానికి సంబంధించిన సమాచారం వెంటనే వచ్చేలా ఒక సదుపాయం ఉంది. అందుకోసం సెట్టింగ్స్ అండ్ ప్రైవసీలోకి వెళ్లాలి. అక్కడ సెట్టింగ్స్ ఆప్షన్​ను ఎంచుకోవాలి. అందులో సెక్యూరిటీ అండ్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత సెట్టింగ్ అప్ ఎక్స్ ట్రా సెక్యూరిటీని ఓపెన్ చేయాలి. అందులో 'గెట్ అలర్ట్స్ అబౌట్ అన్ రికగ్నైజ్డ్ లాగిన్స్' ఆప్షన్​ను ఎంచుకోవాలి.

6. ఫేస్​బుక్ బ్యాకప్​..
ఫేస్​బుక్​ అకౌంట్ హ్యాక్ అయితే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎఫ్​బీలో చాటింగ్ చేయలేం. అలాగే మనం ఏవీ పోస్ట్ చేయలేం. కాబట్టి మీ ఫేస్​బుక్ అకౌంట్ మొత్తాన్ని ఇప్పుడే సేవ్ చేసుకోండి. దీని వల్ల మీ కాంటాక్ట్స్, పోస్టులతో పాటు ఇతర సమాచారం అంతా ఒక ఫైల్ రూపంలో సురక్షితంగా ఉంటుంది. అందుకోసం ముందుగా సెట్టింగ్స్ అండ్ ప్రైవసీలోకి వెళ్లాలి. ఆ తర్వాత సెట్టింగ్స్ ఆప్షన్​ను ఓపెన్ చేయాలి. అనంతరం యువర్ ఫేస్​బుక్​ ఇన్ ఫర్ మేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అందులో డౌన్​లోడ్​ యువర్ ఇన్ఫర్మేషన్​ను సెలెక్ట్ చేయాలి. అప్పుడు మీ ఫేస్​బుక్​ హిస్టరీ మొత్తం ఒక ఫైల్ రూపంలో మీ డివైజ్​లో భద్రంగా డౌన్ లోడ్ అవుతుంది.

మీ ఫేస్​బుక్ ఖాతాలో ఉన్న ఫొటోలను భద్రపరుచుకోవాలంటే అందులోని ఆల్బమ్స్​ను నేరుగా ఇతర స్టోరేజ్ ప్లేసెస్​కు కాపీలుగా పంపుకోవచ్చు. అందుకోసం సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఆప్షన్​లోకి వెళ్లాలి. అక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత యువర్ ఫేస్​బుక్​ ఇన్ఫర్మేషన్​ ఓపెన్ చేయాలి. అందులో ట్రాన్స్ ఫర్ ఏ కాపీ ఆఫ్ యువర్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.