ETV Bharat / science-and-technology

హెచ్‌ఐవీకి ఇజ్రాయెల్ మందు... ఒక్క డోసుతో వైరస్ ఖతం.. మార్కెట్లోకి అప్పుడే! - ఇజ్రాయెల్ ఎయిడ్స్ ఇంజక్షన్ రేటు

HIV Israel treatment: హెచ్ఐవీని అంతమొందించే సరికొత్త ఔషధాన్ని ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. జన్యుమార్పిడి విధానంలో రూపొందించిన ఈ ఔషధంతో ప్రయోగశాలలో ఆశాజనక ఫలితాలు వచ్చాయి. ఎయిడ్స్‌ పరిశోధనల్లో ఇదో భారీ ముందడుగుగా నిపుణులు భావిస్తున్నారు.

HIV TREATMENT ISRAEL INJECTION
HIV TREATMENT ISRAEL INJECTION
author img

By

Published : Jun 16, 2022, 6:53 AM IST

Israel HIV medicine injection: దశాబ్దాల తరబడి మానవాళిని పీడిస్తున్న హెచ్‌ఐవీ... ఇక తలవంచాల్సిందే! ఎయిడ్స్‌కు కారణమయ్యే ఈ వైరస్‌ను సమూలంగా అంతమొందించే సరికొత్త ఔషధాన్ని ఇజ్రాయెల్‌కు చెందిన టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. జన్యు మార్పిడి విధానంలో అభివృద్ధిచేసిన ఈ ఔషధాన్ని ఇంజెక్షన్‌ రూపంలో ఒక్కడోసు ఇవ్వడం ద్వారా... హెచ్‌ఐవీని సమర్థంగా అడ్డుకుని, ఎయిడ్స్‌ నుంచి బాధితులకు విముక్తి ప్రసాదించే అవకాశముందని వారు స్పష్టమైన నిర్ధారణకు వచ్చారు. ఎయిడ్స్‌ పరిశోధనల్లో భారీ ముందడుగుగా శాస్త్రవేత్తలు దీన్ని అభివర్ణిస్తున్నారు.

ఎలా పనిచేస్తుంది?
ఎముక మజ్జలో బి-టైప్‌గా పిలిచే తెల్ల రక్తకణాలు తయారవుతాయి. పరిపక్వం చెందిన తర్వాత ఇవి ఎముక మజ్జ నుంచి రక్తం, గ్రంథుల వ్యవస్థల్లోకి ప్రవేశిస్తాయి. తర్వాత అక్కడి నుంచి వివిధ అవయవాలకు చేరుకుంటాయి. శరీరంలో బ్యాక్టీరియా, వైరస్‌లకు వ్యతిరేకంగా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించే కణాలు కూడా ఇవే! బి-కణాలు ఎదురుపడినప్పుడు హెచ్‌ఐవీ తదితర వైరస్‌లు వాటిపై ప్రభావం చూపి, విచ్ఛిన్నమయ్యేలా ప్రోత్సహిస్తాయి.

అయితే, ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు... వైరస్‌లోని కొన్ని భాగాలను ఉపయోగించి ఈ బి-కణాల జన్యువుల్లో మార్పులు చేశారు. ఇలా మార్పులు చేసిన కణాలు... వైరస్‌ ఎదురుపడినా, దాని ప్రభావానికి గురికావు. సరికదా, వైరస్‌ ప్రవర్తనను పసిగట్టి, తదనుగుణంగా తమ ప్రవర్తనను కూడా మార్చుకుంటాయి. హెచ్‌ఐవీని అడ్డుకునే యాంటీబాడీలను ఉత్పత్తి చేసేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. వైరస్‌ను అంతమొందించడమే లక్ష్యంగా పనిచేస్తాయి.

ఏ స్థాయిలో విజయవంతమైంది?
"సీఆర్‌ఐఎస్‌పీఆర్‌ అనే సాంకేతికతను ఉపయోగించి... టైప్‌-బి తెల్లరక్త కణాల జన్యువుల్లో మార్పులు చేశాం. తర్వాత వీటిని ప్రయోగశాలలో పరీక్షించగా... వైరస్‌ను సమర్థంగా అడ్డుకునేలా రక్తంలో పుష్కలంగా యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి! హెచ్‌ఐవీని ఈ ప్రతినిరోధకాలు అత్యంత సమర్థంగా అడ్డుకోగలవన్న నిర్ధారణకు వచ్చాం" అని పరిశోధనకర్త డా.బార్జెల్‌ వివరించారు.

క్యాన్సర్‌ చికిత్సలోనూ ఉపయోగం!
ఈ టీకాతో ఉత్పత్తయ్యే యాంటీబాడీలు అత్యంత సురక్షితమైనవి, సమర్థంగా పనిచేస్తాయని పరిశోధకులు తెలిపారు. ఇవి కేవలం హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌ నివారణకే కాకుండా... క్యాన్సర్‌, రోగనిరోధక వ్యవస్థ స్వీయదాడి చేసుకునే ఆటోఇమ్యూన్‌ వ్యాధుల చికిత్సకూ దోహదపడతాయన్నారు. ‘నేచర్‌’ పత్రిక ఈ వివరాలు అందించింది.

అందుబాటులోకి వచ్చేదెప్పుడు?
ప్రస్తుత పరిశోధనలో చాలా ఆశాజనక ఫలితాలు వచ్చాయి. జన్యు మార్పులు చేసిన తెల్లరక్త కణాలతో ఎయిడ్స్‌ను అడ్డుకునే ఔషధాన్ని రూపొందించడానికి... మరికొన్ని లోతైన పరిశోధనలు, వ్యక్తులపై ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇవన్నీ పూర్తిచేసుకుని, ఔషధాన్ని అందుబాటులో తీసుకురావడానికి మరికొన్ని సంవత్సరాలు పట్టొచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.