గుజరాత్ ఆరావళి జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో గొడవ అనంతరం.. ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లల్ని హత్య చేశాడు. అంతేకాకుండా తన భార్యపైనా హత్యాయత్నం చేశాడు.
వివాహేతర సంబంధం పెట్టుకుందనే..
ఆరావళీ జిల్లా మేఘ్రాజ్ మండలంలోని రామెడ్ గ్రామంలో జీవాబాయ్ డెడున్.. తన భార్య ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నాడు. అయితే.. శుక్రవారం రాత్రి డెడున్ తన భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తన భార్యపై గొడ్డలితో హత్యాయత్నం చేశాడు. ఆ తర్వాత తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడ్ని తీసుకుని సమీపంలోని డ్యాం దగ్గరికి వెళ్లి.. వారిని అందులో తోసేశాడని పోలీసులు తెలిపారు.
అదే డ్యాం సమీపంలో ఆదివారం డెడున్ కూడా ఆత్మహత్య చేసుకోబోతుండగా.. గ్రామస్థులు చూసి ఆపారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిందితుడి భార్యను ఆసుపత్రికి తరలించారు. తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని వెల్లడించారు.
ఇవీ చదవండి:లారీని ఢీకొన్న బస్సు- విద్యార్థుల పరిస్థితి విషమం
Viral Video: చెలరేగిన దొంగలు.. తుపాకులతో బెదిరించి దుకాణం లూటీ