ETV Bharat / science-and-technology

గూగుల్​ స్ట్రీట్​ వ్యూ మళ్లీ వచ్చేసింది.. మరి మీ ఇంటిని బ్లర్​ చేశారా?

House Blurred on Google Street View: చిన్న చిన్న రహదారులు, అక్కడున్న ఇళ్లు.. చిన్న చిన్న వీధులు.. 360 డిగ్రీల కోణంలో కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు గూగుల్​ స్ట్రీట్​ వ్యూ మళ్లీ వచ్చేసింది. దీంట్లో.. మీ ఇల్లు కూడా కనిపిస్తుంది. అది మీ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించొచ్చు. అందుకే.. ఈ స్ట్రీట్​ వ్యూతో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. దానిని అడ్డుకోవాలంటే.. మీ ఇల్లు కనిపించకుండా బ్లర్​ చేయాలి. మరి ఆ ప్రక్రియ ఎలా చేయాలి? ఇది ఎంతవరకు మేలు చేస్తుంది?

Why You Should Blur Your House on Google Street View And How

author img

By

Published : Aug 7, 2022, 5:58 PM IST

House Blurred on Google Street View: కేంద్ర ప్రభుత్వం అనుమతితో.. భారత్​లో గూగుల్​ స్ట్రీట్‌ వ్యూ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. దీంతో చిన్న చిన్న గల్లీలు కూడా స్పష్టంగా 360 డిగ్రీల కోణంలో చూడొచ్చు. 2011లోనే గూగుల్​ స్ట్రీట్​ వ్యూ సేవలు భారత్​లోకి వచ్చినప్పటికీ.. భద్రతాపరంగా ముప్పు పొంచి ఉందన్న కారణంతో 2016లో దీనిపై నిషేధం విధించింది. ఈ సేవల వల్ల ఉగ్రమూకలు సులువుగా రక్షణ శాఖకు చెందిన వివరాలను తెలుసుకునే అవకాశం కల్పిస్తుందన్న భావన అప్పట్లో వ్యక్తమవగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో స్థానిక టెక్‌ సంస్థలైన టెక్‌ మహీంద్రా, జెనిసిస్‌తో జట్టు కట్టి తాజాగా గూగుల్‌ మళ్లీ తీసుకొచ్చింది. హైదరాబాద్‌ సహా తొలుత 10 నగరాల్లో ఈ సేవలను ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి 50 నగరాల్లో ఈ సేవలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు గూగుల్‌ తెలిపింది.

అయితే.. ఈ ఫీచర్​తో మీ ఇల్లు కూడా స్ట్రీట్​ వ్యూలో కనిపిస్తుందన్న విషయం మీకు తెలుసా? దానిని ప్రైవేట్​గా ఉంచాలని మీరు భావిస్తున్నారా? అసలు ఆ అవసరం ఉందా? సాధారణంగా మీరు గూగుల్​ మ్యాప్స్​లో వీధులను జూమ్​ చేసి చూస్తున్నపుడు కొన్ని వస్తువులు, ముఖాలు అస్పష్టంగా కనిపిస్తుంటాయి. ఇదే ప్రైవసీగా ఉంచడం. మీరూ అలా చేసుకోవచ్చు. అసలు ఇంటిని ఎందుకు బ్లర్​ చేయాలి?

  • స్ట్రీట్​ వ్యూలో మీ ఇంటిని కనిపించేలా ఉంచినట్లయితే.. అపరిచిత వ్యక్తులకు అవకాశం కల్పించినట్లే.
  • దొంగలు, చొరబాటుదారులు లేదా ఇతర వ్యక్తులు మీ భవనానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఎలా ప్రవేశించాలి వంటి అంశాలపై పూర్తి అవగాహనకు వచ్చే అవకాశముంది.
  • ఇప్పటికే స్పష్టంగా కనిపించకపోయినా.. అపరిచిత వ్యక్తులకు మీ ఇంటికి సంబంధించిన కొంతైనా సమాచారం గూగుల్​ మ్యాప్స్​ ఇచ్చే ఉంటుంది.
  • వాహనం కూడా ఎక్కడ పార్కింగ్​ చేస్తున్నారన్నది చూడొచ్చు.
  • ముఖ్యంగా.. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగినట్లే.. మీ కదలికల్ని స్ట్రీట్​ వ్యూతో పసిగట్టే ఆన్​లైన్​ స్టాకర్లు ఉంటారు. వీటి ఆధారంగా వారు డబ్బులు డిమాండ్​ చేయొచ్చు. ఇవే కాకుండా గూగుల్​ మ్యాప్స్​ను చాలా వరకు దుర్వినియోగం చేసే ఛాన్స్​ ఉంది.

గూగుల్​ స్ట్రీట్​ వ్యూలో ఇంటిని బ్లర్​ చేయడం క్లిష్టతరమైన ప్రక్రియ. ఇదో శాశ్వత మార్పు అని గుర్తుంచుకోవాలి. అంటే మళ్లీ దానిని అన్​బ్లర్​ చేయడం కుదరకపోవచ్చు.

మీ ఇంటిని ఎలా బ్లర్​ చేయాలి?

  • మొదట maps.google.com లింక్​ ఓపెన్​ చేయాలి.
  • మీ ఇంటిని నావిగేట్​ చేయండి.
  • మీ ఇంటికి పక్కనే ఉన్న రోడ్డుపైకి స్ట్రీట్​ వ్యూ ఐకాన్​ను డ్రాగ్​ చేయాలి.
  • మీ ప్రాపర్టీపైనే దృష్టి కేంద్రీకరించాలి.
  • దిగువ మూలన, రిపోర్ట్​ ఎ ప్రాబ్లం అన్నదానిపై క్లిక్​ చేయాలి.
  • అక్కడ.. మీ అడ్రస్​ సరిగానే ఉందో చెక్​ చేసుకోవాలి.(లేకుంటే మళ్లీ వెనక్కి వెళ్లి రీట్రై చేయాలి)
  • మీ ఇంటిపై బ్లర్​ చేసే వీలుగా ఒక ఇమేజ్​ను సెట్​ చేసుకోవాలి.
  • రిక్వెస్ట్​ బ్లర్రింగ్​ టూల్​ను ఉపయోగించి ఎందుకు అలా చేయాలనుకుంటున్నారో చెప్పాలి.
  • హౌస్​ను బ్లర్​ చేయడానికి.. 'మై హోం'ను సెలక్ట్​ చేయాలి.
  • మీరు ఎందుకు బ్లర్​ చేయాలనుకుంటున్నారో స్పష్టమైన సమాచారం ఇవ్వాలి. వ్యక్తిగత కారణాలను కూడా పేర్కొనండి.
  • తర్వాతి దశలో మీ ఈ-మెయిల్​ అడ్రెస్​ను ఎంటర్​ చేయాలి.
  • క్యాప్చా ధ్రువీకరణ పూర్తిచేసి సబ్మిట్​ బటన్​పై క్లిక్​ చేయాలి.

కొద్దిసేపటికి మీకు ఒక మెసేజ్​ వస్తుంది. కానీ.. ఈ ప్రక్రియ విజయవంతం అయ్యేందుకు కొన్ని రోజులు పట్టొచ్చు. వాహనాల నంబర్​ ప్లేట్స్​, మొత్తం వాహనాలు, ఇతరత్రా ఏది బ్లర్​ చేయాలన్నీ ఇదే పద్ధతిని పాటించాలి.
అయితే.. ఇంటిని బ్లర్​ చేయడం అనేది కూడా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. దీనికి చాలానే కారణాలున్నాయి.

  • మీరు మీ ఇంటిని అమ్మాలని ఆన్​లైన్​లో సేల్​కు పెట్టారనుకోండి. వారు గూగుల్​ స్ట్రీట్​ వ్యూలో మీ ఇంటిని చూడలేరు. దీనికి ప్రత్యామ్నాయం కూడా లేదు.
  • అప్పుడు మీరు బింగ్​, యాండెక్స్​, యాపిల్​ మ్యాప్స్​ వంటి వాటిని ఆశ్రయించాలి. దానికి కూడా చాలా ఎక్కువ సమయం పడుతుంది. మళ్లీ గోప్యతా సమస్యలు తలెత్తొచ్చు.

ఒక వేళ మీ ఇల్లు ఇప్పటికే బ్లర్​ చేసి ఉంటే.. దానికి చాలానే కారణాలు ఉండొచ్చు. అంతకుముందు మీరు ఉన్న ఇంటి యజమాని అలా చేసి ఉండొచ్చు. మీ పొరుగువారు పొరపాటున అలా చేసి ఉండొచ్చు. లేదా ఎవరైనా ప్రాంక్​ చేసి ఉండొచ్చు.
ఏదేమైనా చివరగా మీ ఇంటిని బ్లర్​ చేయాలా? వద్దా? అనేది మీ చేతుల్లోనే ఉంది.

ఇవీ చూడండి: Google Street View: గూగుల్‌ తల్లి అద్దంలో గల్లీ.. గల్లీ..

భారత్​లో మళ్లీ 'గూగుల్​ స్ట్రీట్​ వ్యూ'.. ముందుగా ఆ నగరాల్లోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.