ETV Bharat / science-and-technology

ఆ యాప్​లకు గూగుల్​ షాక్​.. మీ మొబైల్​లో ఉన్నాయా? - non updated apps

Google PlayStore Apps: యూజర్ డేటాను తస్కరిస్తున్న సైబర్​ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి గూగుల్​ కీలక నిర్ణయం తీసుకుంది. ప్లేస్టోర్​లో విడుదలైనప్పటి నుంచి కొన్ని యాప్​లు అప్​డేట్​ కాకపోవడం వల్ల భద్రతాపరమైన లోపాలు తలెత్తున్నాయి. ఇక వాటికి చెక్​ పెట్టేందుకు.. ఏడాది నుంచి అప్​డేట్​ ఇవ్వని యాప్​లను ఇకమీదట యూజర్లు డౌన్​లోడ్​ చేసుకోలేరని గూగుల్​ తెలిపింది.

Google PlayStore
Google PlayStore
author img

By

Published : Apr 8, 2022, 6:57 AM IST

Google PlayStore Apps: స్మార్ట్‌ఫోన్‌లో ఏ చిన్న పనిచేయాలన్నా యాప్‌ తప్పనిసరి. అయితే మనకు అవసరమైన యాప్‌లు కొన్ని ఫోన్‌తోపాటు వస్తే.. మరికొన్ని మన అవసరానికి తగినట్లు ప్లేస్టోర్‌ (ఆండ్రాయిడ్‌), యాప్‌స్టోర్‌ (యాపిల్‌) నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటాం. వీటిలో కొన్ని యాప్‌లు ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లను విడుదలచేస్తూ భద్రత, గోప్యత, సర్వీసుల పరంగా యూజర్‌కు మెరుగైన సేవలందిస్తుంటాయి. మరికొన్ని యాప్‌లు విడుదలైనప్పటి నుంచి అప్‌డేట్ కాకపోవడం వల్ల వాటిలోని భద్రతాపరమైన లోపాల కారణంగా యూజర్‌ డేటాను సైబర్‌ నేరగాళ్లు సులువుగా సేకరిస్తున్నారట. ఈ సమస్యకు చెక్ పెట్టే దిశగా గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది.

గూగుల్ ప్లేస్టోర్‌ టార్గెట్‌ లెవల్‌ ఏపీఐ ప్రమాణాలకు అనుగుణంగా విడుదలైన ఏడాదిలోపు అప్‌డేట్‌ ఇవ్వని యాప్‌లను ఇకమీదట యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోలేరని తెలిపింది. 2022 నవంబరు 1 నుంచి ఈ నిబంధనను అమల్లోకి తేనున్నట్లు గూగుల్ తన డెవలపర్‌ కమ్యూనిటీ బ్లాగ్ పేజ్‌లో పేర్కొంది. ఇకమీదట ప్లేస్టోర్‌లోకి వచ్చే ప్రతి యాప్‌, ఆండ్రాయిడ్ ఓఎస్‌ అప్‌డేట్‌ అయిన ఏడాదిలోపు అప్‌డేట్ ఇవ్వకుంటే సదరు యాప్‌ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉండదని గూగుల్ వెల్లడించింది.

ఎందుకీ నిర్ణయం? "గూగుల్ ఏటా కొత్త వెర్షన్‌ ఆండ్రాయిడ్ ఓఎస్‌ను విడుదల చేస్తుంది. యూజర్లకు సరికొత్త ఫీచర్లను పరిచయం చేయడంతోపాటు, భద్రతపరంగా ఓఎస్‌ను మరింత మెరుగుపరుస్తుంది. ఈ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత యూజర్లు సైబర్‌ దాడుల నుంచి రక్షణ పొందామనే ఆలోచనతో ఉంటారు. అయితే ఓఎస్‌ అప్‌డేట్‌కు అనుగుణంగా యాప్‌లు అప్‌డేట్ ఇవ్వకపోతే అందులోని భద్రతాపరమైన లోపాల కారణంగా యూజర్ డేటా సైబర్‌ నేరగాళ్లకు చేరిపోతుంది. అందుకే ప్లేస్టోర్‌లోని ప్రతి యాప్‌ విడుదలైన ఏడాదిలోపు తప్పనిసరిగా గూగుల్ టార్గెట్ లెవల్ ఏపీఐ ప్రమాణాలకు అనుసరించి మార్పులు చేయాల్సిందే" అని యాప్‌ డెవలపర్స్‌కు గూగుల్‌ సూచిస్తోంది. అలానే కొత్త యూజర్లకు అప్‌డేట్‌ కాని యాప్‌లు ప్లేస్టోర్‌లో కనిపించవని, ఇప్పటికే వాటిని డౌన్‌లోడ్ చేసుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది.

ఇదీ చదవండి: టోల్​ గేట్స్​ లేని 'ఫ్రీ రూట్స్'​ కావాలా? గూగుల్​ మ్యాప్స్​లో​ ఇలా చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.